మేకప్ ను ఎక్కువసేపు నిలిపి ఉంచే అద్భుతమైన చిట్కాలు

Posted By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

మేకప్ చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టినా మేకప్ మాత్రం కేవలం ఒక గంటలో కరిగిపోతుంది. మేకప్ చేసిన లుక్ అనేది తగ్గిపోతుంది. చర్మతత్వం, కొన్ని రకాల కాస్మెటిక్స్, కాలుష్యంతో పాటు ఇతర వాతావరణ అంశాల వంటివి మేకప్ నిలవకుండా చేయడంలో తమదైన పాత్ర పోషిస్తాయి.

ముఖంపైనుంచి మేకప్ నిలవకుండా తరిగిపోవడం మనల్ని ఇబ్బందికి గురిచేసే అంశం. ఇటువంటి సమస్యతో మీరు ఇబ్బందికి గురవుతూ ఉంటే మీరింక మీ దిగులును పక్కకి పెట్టవచ్చు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. అలాగే, ఈ సమస్యకు కూడా పరిష్కారం ఉంది.

A common worry that most women have is that the makeup does not last long. Yes

మీ సమస్యకు అద్భుతమైన పరిష్కారంతో మీ ముందుకొచ్చాము.

ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవడం ద్వారా మేకప్ ను ఎక్కువసేపు నిలిపివుంచే అద్భుతమైన చిట్కాల గురించి ఉపాయాలు గురించి తెలుసుకోవచ్చు. సరైన ప్రోడక్ట్ ను సరైన విధంగా అప్లై చేయడం ద్వారా ఈ బ్యూటీ ప్రాబ్లెమ్ ని నివారించుకోవచ్చు.

మేకప్ ఎక్కువ సేపు నిలబడి ఉండడం వలన మేకప్ పై మీ చింత తగ్గుతుంది. తద్వారా, మీరు మీ పనిని ఏకాగ్రతతో పూర్తి చేయగలుగుతారు.

ఈ ఆర్టికల్ లో మేకప్ ని ఎక్కువసేపు నిలిపి ఉంచే 10 సులభమైన సూపర్ ఈజీ స్టెప్స్ ను వివరించాము. వీటిని పాటించి అద్భుతమైన ఫలితాలను పొందండి.

మీరు ఫాలో అవవలసిన స్టెప్స్

ముఖాన్ని శుభ్రపరుచుకోండి:

ముఖాన్ని శుభ్రపరుచుకోండి:

మేకప్ ని అప్లై చేసుకునే ముందు మీ ముఖాన్ని అందుకు తగినట్టుగా సిద్ధం చేసుకోవాలి. ఇందులో భాగంగా, ముందుగా మీ ముఖాన్ని గోరువెచ్చటి నీటితో శుభ్రపరచుకుని శుభ్రమైన టవల్ తో ముఖాన్ని తుడుచుకోండి. ఇలా చేయడం వలన చర్మంపైనున్న ఇంప్యూరిటీస్ అనేవి తొలగిపోవడం వలన చర్మంపై మేకప్ ఎక్కువేపు నిలిచి ఉంటుంది.

మాయిశ్చరైజర్ ను అప్లై చేయండి:

మాయిశ్చరైజర్ ను అప్లై చేయండి:

చక్కగా మాయిశ్చరైజ్ చేయబడిన చర్మం అనేది మేకప్ ని నిలిపి ఉంచేందుకు పునాదిగా వ్యవహరిస్తుంది. మీది డ్రై స్కిన్ అయితే, మీ ముఖాన్ని ఖచ్చితంగా మాయిశ్చరైజ్ చేయాలి. అందువలన, మేకప్ పొడిపొడిగా కనిపించదు. మేకప్ ని మెడపై కూడా అప్లై చేసుకోవడం మర్చిపోకండి. అలాగే, మాయిశ్చరైజింగ్ ని ఎక్కువగా వాడటం వలన కూడా మేకప్ అనేది తొలగిపోయినట్లవుంటుంది.

ప్రైమర్ ను వాడండి:

ప్రైమర్ ను వాడండి:

ప్రైమర్ అనేది మేకప్ ను ఎక్కువసేపు నిలిపివుంచే ప్రత్యేకమైన బ్యూటీ ప్రోడక్ట్. చర్మ రంధ్రాలను మృదువుగా చేసేందుకు ఈ ప్రాడక్ట్ ఉపయోగపడుతుంది. అందువలన, ఫౌండేషన్ కి బేస్ గా ప్రైమర్ ఉపయోగపడుతుంది. కాస్తంత ప్రైమర్ ను తీసుకుని ముఖంపై సున్నితంగా అప్లై చేసుకోవాలి. ఐలిడ్స్ పై అప్లై చేసుకోవడం మరచిపోకూడదు. ఇందువలన, మీ ముఖంపై మేకప్ ఎక్కువ సేపు నిలిచి ఉంటుంది.

ఫౌండేషన్ ను వాడండి:

ఫౌండేషన్ ను వాడండి:

చర్మరంధ్రాలను నింపేందుకు సిలికాన్ బేస్డ్ ఫౌండేషన్ ను వాడండి. మీది పొడిచర్మం అయితే ఫౌండేషన్ ను అప్లై చేయడం ద్వారా మీ చర్మానికి తగినంత తేమ అందుతుంది. అందువలన, చర్మం పొడిబారినట్లుగా కనిపించే ఆస్కారం ఉండదు. చర్మంపై మచ్చలు అలాగే పిగ్మెంటేషన్ సమస్య ఉంటే కాంకీలర్ తో వాటిని కవర్ చేసిన తరువాత ఫౌండేషన్ ను వాడండి. ముఖంపై అలాగే మెడపై ఫౌండేషన్ ను సరిగ్గా అప్లై చేయడం మరచిపోకండి.

సెట్లింగ్ పౌడర్:

సెట్లింగ్ పౌడర్:

మంచి నాణ్యత కలిగిన పౌడర్ తో మేకప్ ను సెట్ చేయండి. పౌడర్ ని కాస్తంత తీసుకుని మేకప్ బ్రష్ తో ముఖంపై అప్లై చేసుకోండి. బ్రష్ తో పౌడర్ ని స్ట్రోక్స్ లా అప్లై చేస్తే మీరు అప్లై చేసుకున్న మేకప్ తొలగిపోతుంది. కాబట్టి, సహనంగా పౌడర్ ని అప్లై చేయడం ఉత్తమం.

వాటర్ ప్రూఫ్ ప్రాడక్ట్స్ ని వాడండి

వాటర్ ప్రూఫ్ ప్రాడక్ట్స్ ని వాడండి

వాటర్ ప్రూఫ్ మస్కారా, ఐలైనర్, ఐషాడో తో పాటు మరికొన్ని వాటర్ ప్రూఫ్ ప్రాడక్ట్స్ ని వాడండి. ఆయిలీ స్కిన్ కలిగిన వారు అలాగే ఎక్కువగా స్వేదాన్ని చిందించే వారు వాటర్ ప్రూఫ్ ప్రాడక్ట్స్ ని ఎంచుకోవడం ఉత్తమం. ఈ ప్రాడక్ట్స్ కి నిరంతర టచ్ అప్స్ అనేవి అవసరం ఉండదు. అంతేకాక, ఈ ప్రాడక్ట్స్ అనేవి మేకప్ ని ఎక్కువసేపునిలిపి ఉంచేలా చేస్తాయి.

ఐ ల్యాషెస్ ని కర్ల్ చేయండి

ఐ ల్యాషెస్ ని కర్ల్ చేయండి

మస్కారా ని అప్లై చెసే ముందు ఐ ల్యాషెస్ ని కర్ల్ చేయండి. బ్లో డ్రైయర్ తో ఐ ల్యాష్ కర్లర్ ను వేడి చేయండి. కర్లర్ ని ఓవర్ హీట్ చేయకూడదు. మూడు సార్లు ఐ ల్యాషెస్ ని కర్ల్ చేసి ఆ తరువాత మస్కారా ను అప్లై చేయండి. ఇలా చేయడం ద్వారా ల్యాషెస్ సహజసిద్ధంగా అందంగా ఉంటాయి.

లిప్ స్టిక్ ను అప్లై చేయండి

లిప్ స్టిక్ ను అప్లై చేయండి

లిప్ స్టిక్ ఎక్కువ సేపు నిలిచి ఉండేలా చేయాలంటే ముందుగా క్రీమ్ బేస్డ్ కాంకీలర్ ను అప్లై చేయాలి.

ఎలా అప్లై చేయాలి?

ఎలా అప్లై చేయాలి?

కాంకీలర్ ను పెదవులపై అప్లై చేయాలి.

ఇప్పుడు, లిప్ పెన్సిల్ తో మీ పెదాలపై అవుట్ లైన్ వేయాలి. లిప్ స్టిక్ కలర్ అలాగే లిప్ పెన్సిల్ కలర్ ఒకటే ఉండేలా జాగ్రత్త తీసుకోండి.

ఇప్పుడు లిప్ స్టిక్ ను అప్లై చేసుకోవాలి.

వైప్ చేయడం బదులు ప్యాట్ చేయండి

వైప్ చేయడం బదులు ప్యాట్ చేయండి

మీది ఆయిలీ స్కిన్ అయితే కాసేపటి తరువాత మీ ముఖంపై ఒక విధమైన మెరుపు అనేది కనిపిస్తుంది. ఇది చెమట వలన అలాగే జిడ్డుతనం వలన ఏర్పడిన మెరుపు. మీరు వైప్ చేయకుండా ఒక టిష్యూ పేపర్ ని తీసుకుని దాంతో ముఖాన్ని అద్దుకుంటే అదనపు ఆయిల్ అనేది తొలగిపోతుంది.మీది ఆయిలీ స్కిన్ అయితే కాసేపటి తరువాత మీ ముఖంపై ఒక విధమైన మెరుపు అనేది కనిపిస్తుంది. ఇది చెమట వలన అలాగే జిడ్డుతనం వలన ఏర్పడిన మెరుపు. మీరు వైప్ చేయకుండా ఒక టిష్యూ పేపర్ ని తీసుకుని దాంతో ముఖాన్ని అద్దుకుంటే అదనపు ఆయిల్ అనేది తొలగిపోతుంది.

సెట్టింగ్ స్ప్రే ను వాడండి

సెట్టింగ్ స్ప్రే అనేది మేకప్ ను ముఖంపై ఎక్కువసేపు నిలిపి ఉంచేలా చేస్తుంది. స్ప్రే బాటిల్ ను ముఖం నుంచి కాస్తంత దూరంలో ఉంచి సున్నితంగా ముఖంపై స్ప్రే చేసుకోండి. ఈ స్ప్రే అనేది కాలుష్యం నుంచి అలాగే హ్యుమిడిటీ నుంచి ముఖానికి రక్షణనిస్తుంది.

గుర్తుంచుకోవలసిన అంశాలు:

టిష్యూ పేపర్ లేదా బ్లాటింగ్ పేపర్ ని ఎల్లప్పుడూ వెంట ఉంచుకోండి. ఇలా చేయడం ద్వారా, మీ చర్మాన్ని ఆయిల్ ఫ్రీ గా ఉంచుకోవచ్చు.

మేకప్ ని థిన్ కోటింగ్స్ లో అప్లై చేసుకోండి.

మేకప్ ని ఎక్కువగా చేసుకోకండి. ఎక్కువగా చేసుకోవడం వలన మందంగా కనిపిస్తుంది.

సరైన మేకప్ ప్రాడక్ట్స్ నే వాడండి.

మంచి వెలుతురు కలిగిన ప్రదేశంలోనే మేకప్ ని అప్లై చేసుకోండి.

English summary

Tips For Long Lasting Makeup

A common worry among most women is that the makeup does not last long. Yes, though you spend hours together in applying makeup, within an hour, it disappears. But wait, there are certain simple tips for long-lasting makeup. Here they are.
Story first published: Saturday, January 13, 2018, 16:30 [IST]