మేకప్ వేసుకునే సమయంలో కన్సీలర్ ని ఎలా ఉపయోగించాలి?

Posted By: Ashwini Pappireddy
Subscribe to Boldsky

నామి చెప్పినట్లుగా, ముఖం మీద వున్న మచ్చలను మరియు మొటిమలను దాచడానికి కాన్సెల్ర్ ని ఉపయోగిస్తారు, నిజం చెప్పాలంటే చర్మం మీద వున్న అన్ని లోపాలను దాచిపెట్టి అందంగా కనిపించడానికి దీనిని వాడుతారు. మరి అందంగా కనిపించడానికి దీనిని సరైన మార్గంలో ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందామా.

సాధారణంగా మీరు ఫౌండేషన్ అప్లై చేసినట్లుగా దీనిని ముఖం అంతా రాసుకోనవసరం లేదు. దీనిని కేవలం మీ ముఖం మీద మార్కులు, మచ్చలు, మొటిమలు వున్న ప్రాంతంలో అప్లై చేస్తే సరిపోతుంది.

Tips On How To Apply Concealer During Makeup

ఒకవేళ అలా కాదని మరింత అందంగా కనిపించాలని ముఖం అంతా రాసుకున్నట్లైతే అది మీ ముఖం మీద పెయింట్ వేసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి అలా అవకూడదనే మేము ఇవాళ కాన్సెల్ర్ ని ఎలా అప్లై చేసుకోవాలనే విషయంలో మీకు సహాయం చేయాలనుకుంటున్నాము. క్రింద తెలిపిన విధంగా మీరు కాన్సెల్ర్ ని ఉపయోగించడం వలన మీ చర్మ సమస్యలను దాచిపెట్టడమే కాకుండా మీరు మచ్చలు లేకుండా మరింత అందంగా కనిపిస్తారు.

Tips On How To Apply Concealer During Makeup

ఫౌండేషన్ లేదా కన్సీలర్ - మొదట దేనిని వాడాలి?

ఫౌండేషన్ లేదా కన్సీలర్ మొదట ఏది రాసుకోవాలి అని అడిగితే ఎవరూ సమాధానం ఇవ్వలేరు. ఇది పూర్తిగా మీ చర్మం మీద ఆధారపడి ఉంటుంది.

ఒకవేళ మీరు ఒకటి లేదా కొన్ని చర్మ సమస్యలను కలిగివున్నట్లైతే, అప్పుడు మొదట మీరు ఫౌండేషన్ రాసుకొని తరువాత, కన్సీలర్ ని ఉపయోగించండి.

అలా కాకుండా మీ చర్మం మచ్చలతో పూర్తిగా నిండి ఉంటే, అప్పుడు రివర్స్ మార్గంలో వెళ్ళండి. అంటే, మొదట కన్సీలర్ ని వాడి తరువాత ఫౌండేషన్ ని అప్ప్లై చేయండి.

Tips On How To Apply Concealer During Makeup

డార్క్ సర్కిల్స్ కోసం కన్సీలర్

అవును, మీరు విన్నది నిజమే కన్సీలర్ తో డార్క్ సర్కిల్స్ ని దాచవచ్చు. అది ఎలా సాధ్యం అనుకుంటున్నారా! అయితే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కన్సీలర్ తో మీ కళ్ళు కింద ఒక త్రిభు జాకారంలో రాసుకొని ఇప్పుడు దానిని కలపండి. త్రిభుజాకారం మీ కళ్ళ కింద అంచు నుండి మీ చెంప ఎముకలు వైపు ఉంటుంది. మీకున్నటువంటి డార్క్ సర్కిల్స్ ని బట్టి మీరు కన్సీలర్ ఎంత అప్లై చేసుకోవాలని నిర్ణయించుకోవాలి. మీరు కన్సీలర్ ని రాసుకున్న తరువాత కూడా డార్క్ సర్కిల్స్ కనిపించినప్పటికీ, కన్సీలర్ ని బుగ్గల మీద మొత్తం రాయకండి.

Tips On How To Apply Concealer During Makeup

కన్సీలర్, మీ మేకప్ కి ముఖ్యమైనది

కళ్ళ అందానికి బేస్ ఐ ప్రైమర్. కానీ దీనిని తరచూ ఉపయోగించము. కాబట్టి అలాంటి సందర్బాలలో కన్సీలర్ మనల్ని కాపాడుతుందని చెప్పవచ్చు. మీ కనురెప్ప మీద ఒక కన్సీలర్ రాసుకొని తర్వాత అప్పుడు ఐషాడో ని అప్లై చేయండి. ఇది ఐషాడో దీర్ఘకాలం ఉంటుంది మరియు మీ ఐ మేకప్ కి ఒక మంచి ఆధారాన్ని అందిస్తుంది. కన్సీలర్ ని ఐ మేకప్ బేస్ గా ఉపయోగించినప్పుడు అది మీ ఎట్టి పరిస్థితులలోను కంటిలోనికి వెళ్లకుండా జాగ్రత్త పడండి.

Tips On How To Apply Concealer During Makeup

మీ కన్సీలర్ యొక్క షేడ్

మీరు మంచి కన్సీలర్ ని పొందాలనుకుంటే మేకప్ స్టోర్ వద్దకి వెళ్లి వివిధ రకాల షేడ్స్ ని ప్రయత్నించండి. ఉంది. అయితే, మీరు ఒక మంచి కన్సీలర్ ని పొందాలనుకుంటే మీ చర్మం రంగు కంటే కొంచం లైట్ గా ఉండేలా చూసుకోండి. అలాగే ఒక కన్సీలర్ కొనేటప్పుడు మీ స్కిన్ టోన్ కంటే కొంచం తక్కువ రంగు ఉండేలా చూసుకోండి.

కన్సీలర్ ని అప్లై చేయడానికి వాడే బ్రష్లు

వివిధరకాల కన్సీలర్ బ్రష్లు అందుబాటులో ఉన్నాయి మరియు వీటిని మేకప్ వేసుకొనే సమయంలో కన్సీలర్ ని అప్లై చేయడానికి మీకు నచ్చిన బ్రష్లు ని వాడవచ్చు. అయినప్పటికీ,కన్సీలర్ ని కలపడానికి మీ వ్రేళ్ళని ఉపయోగించండి. ఇలా చేయడం వలన అవి చక్కగా కలుస్తుంది. మీరు కన్సీలర్ ని అప్లై చేసినప్పుడు కొంచం పౌడర్ తో ముగించండి.

English summary

Tips On How To Apply Concealer During Makeup

As the namy says, concealer is used to conceal, that is, hide all the flaws on one's skin and thus look flawless with makeup. To get the right benefit of a concealer, it is important to apply it in the right way.
Story first published: Friday, January 19, 2018, 8:30 [IST]