ఆయిలీ స్కిన్ పై మేకప్ ఎక్కువ సేపు నిలిచి ఉంచే బ్యూటీ టిప్స్

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

వివిధ చర్మ తత్వాలను వివిధ రకాలుగా డీల్ చేయాలి. అన్నిటికీ ఒకే రకమైన ఫార్ములా ఉపయోగపడదు. స్కిన్ టైప్స్ అనేవి వివిధ రకాలు. నార్మల్, ఆయిలీ అలాగే డ్రై స్కిన్ కి ఒకే రకమైన బ్యూటీ అప్రోచ్ ఉపయోగకరంగా ఉండదు. ప్రతి స్కిన్ టైప్ మేకప్ అప్లై చేసేటప్పుడు ఎదో ఒక సమస్యతో ఇబ్బందికి గురిచేస్తుంది. ఈ రోజు మనం ఆయిలీ స్కిన్ టైప్ పై ఫోకస్ పెడుతున్నాం.

ఆయిలీ స్కిన్ కలిగి ఉండటం ఇక మీదట శాపం కానేకాదు. ఎందుకంటే, ఈ స్కిన్ టైప్ లో ముడతలు అలాగే ఫైన్ లైన్స్ అనేవి వృద్ధి చెందే అవకాశాలు తక్కువ. వీరి చర్మం ఎల్లప్పుడూ మాయిశ్చరైజ్డ్ గా ఉంటుంది. అయితే, మేకప్ విషయానికి వస్తే మాత్రం వీరు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు. ప్రత్యేకించి, హాట్ సీజన్స్ లో వీరు అమితంగా ఇబ్బంది పడతారు.

Tips To Make Makeup Last On Oily Skin

ఆయిలీ స్కిన్ కలిగిన వారు మేకప్ ను అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. అయితే, ఎటువంటి ప్రోడక్ట్స్ తమ చర్మానికి పడతాయో వీరు తెలుసుకుని ఆ ప్రోడక్ట్స్ ని మాత్రమే వాడాలి.

డ్రై స్కిన్ కి మాత్రమే పరిమితమైన మేకప్ రూల్స్ ని పాటించి డ్రై స్కిన్ కై ఉద్దేశింపబడిన ప్రోడక్ట్స్ ని వాడితే ఆయిలీ స్కిన్ వారి మేకప్ లుక్ పాడైపోవచ్చు. అలాగే, ఆయిల్ బేస్డ్ ప్రోడక్ట్స్ ను ఆయిలీ స్కిన్ వారు వాడకూడదు. ఈ జాగ్రత్తలను తీసుకుంటే డబ్బూ సమయం వృధా కాదు.

కాబట్టి, ఈ రోజు ఈ ఆర్టికల్ లో ఆయిలీ స్కిన్ పై మేకప్ ఎక్కువ సేపు నిలిచి ఉండేందుకు అవసరమైన బ్యూటీ టిప్స్ ను వివరించాము. వీటిని పరిశీలించండి మరి.

1. ముఖాన్ని ప్రోపర్ గా క్లీన్స్ చేసుకోండి:

1. ముఖాన్ని ప్రోపర్ గా క్లీన్స్ చేసుకోండి:

ఆయిలీ స్కిన్ కలిగిన వారు క్లీన్సింగ్ కి తగిన ప్రాముఖ్యతనివ్వాలి. ప్రతి ఉదయం ముఖాన్ని సరిగ్గా క్లీన్స్ చేసుకోవాలి. మీరు వాడే క్లీన్సర్ లో కనీసం 2 శాతం సాలైసైక్లిక్ యాసిడ్ ఉండాలి. ఈ యాసిడ్ అనేది చర్మం లోంచి అదనపు నూనెను తొలగించడానికి తోడ్పడుతుంది. అదే సమయంలో చర్మాన్ని డ్రై గా మార్చదు. ముఖాన్ని క్లీన్స్ చేసే సమయంలో మీ చేతులు క్లీన్ గా ఉండేలా జాగ్రత్త పడండి. లేదంటే, మీ చేతులలోంచి క్రిములు ముఖంపై చేరతాయి.

2. టీ జోన్ ను క్లీన్ చేసుకోండి:

2. టీ జోన్ ను క్లీన్ చేసుకోండి:

ఒకవేళ మీ టీ జోన్ ఆయిలీ గా ఉంటే రబ్బింగ్ ఆల్కహాల్ ను ఉపయోగించి త్వరగా టీ జోన్ ను శుభ్రపరుచుకోండి. రబ్బింగ్ ఆల్కహాల్ లో యాక్నేను తొలగించడానికి ఉపయోగపడే యాంటీ సెప్టిక్ ప్రాపర్టీలు కలవు. రబ్బింగ్ ఆల్కహాల్ అనేది చర్మంపైనున్న అదనపు నూనెను తొలగించి చర్మంలోని జిడ్డును తొలగిస్తుంది.

ఎలా వాడాలి:

ఒక కాటన్ బాల్ ను తీసుకోండి అందులో ఒకటి లేదా రెండు చుక్కల రబ్బింగ్ ఆల్కహాల్ ను వేసి నుదుటిపై, చిన్ అలాగే ముక్కుపై ఒక క్విక్ స్వీప్ ను ఇవ్వండి.

రబ్బింగ్ ఆల్కహాల్ ను తక్కువగా ఉపయోగించాలన్న విషయం గుర్తుంచుకోండి. లేదంటే మీ చర్మం విపరీతంగా డ్రై గా మారే అవకాశాలున్నాయి.

3. ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్:

3. ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్:

ఆయిలీ స్కిన్ కి కూడా మాయిశ్చరైజర్ అవసరం. మీ చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయకపోతే చర్మం మరింత ఎక్కువగా ఆయిల్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి, తేలికపాటి, ఆయిల్ ఫ్రీ, నో క్రీమ్ బేస్డ్ మాయిశ్చరైజర్ ను ఉపయోగించండి. మాయిశ్చరైజర్ ను అప్లై చేసాక అది చర్మంలోకి ఇంకేంత సమయాన్నిచ్చి ఆ తరువాత మేకప్ ను అప్లై చేసుకోండి.

4. ఫౌండేషన్ కు ముందు పౌడర్ ను ఉపయోగించండి:

4. ఫౌండేషన్ కు ముందు పౌడర్ ను ఉపయోగించండి:

ఇది వింతగా అనిపించొచ్చు. కానీ, ఆయిలీ స్కిన్ బ్యూటీ సీక్రెట్ ఇదే. ఫౌండేషన్ ని అప్లై చేసేముందు పౌడర్ ని లైట్ లేయర్ గా అప్లై చేస్తే చర్మంపై జిడ్డు త్వరగా పేరుకుపోదు. పౌడర్ వలన పోర్స్ అనేవి కప్పబడతాయి. తద్వారా, ఆయిల్ అనేది బయటకు రాదు. అందువలన, పౌడర్ ను మొదట అప్లై చేస్తే చర్మాన్ని ఆయిల్ ఫ్రీగా కనీసం ఎనిమిది గంటల వరకు కాపాడుకోవచ్చు.

5. మ్యాట్టే ప్రైమర్ ని వాడండి:

5. మ్యాట్టే ప్రైమర్ ని వాడండి:

ఆయిలీ స్కిన్ పై మేకప్ ఎక్కువ సేపు నిలిచి ఉండేందుకు మ్యాట్టే ప్రైమర్ ని వాడాలి. వివిధ స్కిన్ టైప్స్ కి ప్రైమర్ అనేది చక్కగా ఉపయోగపడుతుంది. అయితే, ఆయిలీ స్కిన్ కి మాత్రం ఇది అవసరం. మీ మేకప్ కి స్మూత్ కాన్వాస్ ని ఇవ్వడానికి మ్యాట్టే ప్రైమర్ ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే మేకప్ కు పెర్ఫెక్ట్ బేస్ గా ఉంటుంది. తద్వారా, మేకప్ ఎక్కువసేపు నిలిచి ఉంటుంది. మీ ముఖాన్ని శుభ్రపరచుకోగానే, ఆయిల్ ఫ్రీ, యాంటీ షైన్ ప్రైమర్ ను ఫోర్ హెడ్, నోస్ మరియు చిన్ పై అప్లై చేయండి.

English summary

Tips To Make Makeup Last On Oily Skin

Tips To Make Makeup Last On Oily Skin,Applying makeup on oily skin is a task. As the makeup does not last long, it is important to follow a few tricks and tips to make the makeup last long.
Story first published: Thursday, March 15, 2018, 7:00 [IST]