For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ చిట్కాలను పాటిస్తే మీ మేకప్ లుక్ మరింత సహజంగా మారుతుంది

టాప్ మోడల్స్ మేకప్ లేని సహజ లుక్ ని ఏ విధంగా క్యారీ చేస్తున్నారోనని మీరెప్పుడైనా ఆశ్చర్యానికి గురయ్యారా? మచ్చలేని చర్మాన్ని మేకప్ తో పొంది సహజమైన లుక్ ని పొందాలని మీరు భావిస్తున్నారా?

|

టాప్ మోడల్స్ మేకప్ లేని సహజ లుక్ ని ఏ విధంగా క్యారీ చేస్తున్నారోనని మీరెప్పుడైనా ఆశ్చర్యానికి గురయ్యారా? మచ్చలేని చర్మాన్ని మేకప్ తో పొంది సహజమైన లుక్ ని పొందాలని మీరు భావిస్తున్నారా? మేకప్ తో మరీ డ్రమటిక్ లుక్ కాకుండా నేచురల్ లుక్ ను సొంతం చేసుకోవాలని ఆశిస్తున్నారా? అలా అయితే, ఈ ఆర్టికల్ ప్రత్యేకంగా మీ కోసమే.

స్మోకీ ఐస్, బోల్డ్ లిప్స్ మరియు కాంటరింగ్ వంటివి ఇప్పుడు మేకప్ లో దూసుకుపోతున్న స్టైల్స్. అయితే, అప్పుడప్పుడు మేకప్ లేని లుక్ తో సహజంగా అందంగా కనిపించాలని భావించడం సహజం. చర్మాన్ని సహజంగా అందంగా చూపించడానికి మేకప్ సహాయం అవసరం.

Tips To Make Your Makeup Look More Natural

ఈ మధ్యకాలంలో నేచురల్ మేక్ అప్ లుక్ అనే బ్యూటీ ట్రెండ్ అనేది విపరీతంగా పాపులర్ అయింది. ఈ ట్రెండ్ ఫ్యాషన్ వరల్డ్ ను కొంతకాలం పాటు ఏలడానికి సిద్ధంగా ఉందని తెలుస్తోంది. ఈ రోజు బోల్డ్ స్కై లో కొన్ని ఉపయోగకరమైన చిట్కాలను వివరిస్తున్నాము. తద్వారా, మేకప్ తో నేచురల్ ఫినిష్ ను మీరు పొందవచ్చు.

ఈ కింద వివరించబడిన టిప్స్ ను పాటించి నో మేకప్ లుక్ ను మేకప్ తో సులభంగా సొంతం చేసుకోండి.

1. మీ చర్మాన్ని సిద్ధం చేసుకోండి:

1. మీ చర్మాన్ని సిద్ధం చేసుకోండి:

మేకప్ సహజంగా కనిపించాలంటే ముందుగా చర్మాన్ని మేకప్ కు అనుగుణంగా సిద్ధం చేసుకోవాలి. ఇది ఎంతో ముఖ్యమైన పాయింట్. తేలికపాటి క్లీన్సర్ ను ఉపయోగించి చర్మంపై పేరుకుపోయిన దుమ్మును తొలగించుకోండి. ఆ తరువాత చర్మంపైన తడిని తుడిచి తేలికపాటి స్కిన్ టోనర్ ను ఉపయోగించి చర్మానికి తగినంత తేమను అందించండి.

2. మీ చర్మాన్ని పరిపూర్ణంగా మాయిశ్చరైజ్ చేయండి:

2. మీ చర్మాన్ని పరిపూర్ణంగా మాయిశ్చరైజ్ చేయండి:

మేకప్ ని అప్లై చేయడానికి ముందు చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయడం ద్వారా మేకప్ ఐటమ్స్ లో లభ్యమయ్యే కెమికల్స్ నుంచి చర్మాన్ని సంరక్షించుకోవచ్చు. తద్వారా, ఫ్లేకీనెస్ ను దూరంగా ఉంచవచ్చు. అలాగే, తగినంత మాయిశ్చర్ తో మెరుస్తున్న చర్మంపై మేకప్ ను అప్లై చేయడం వలన సహజమైన మేకప్ లుక్ వచ్చి మీ చర్మం తాజాగా కనిపిస్తుంది.

3. కంన్సీలర్ ను వాడండి:

3. కంన్సీలర్ ను వాడండి:

కాంకీలర్ ను ఉపయోగించడం ద్వారా డార్క్ సర్కిల్స్ ని అలాగే యాక్నే స్కార్స్ ని హైడ్ చేయవచ్చు. అయినప్పటికీ, కాంకీలర్ ను అతిగా వాడకండి. కేవలం సమస్యాత్మక ప్రాంతంలో మాత్రమే దీనిని ఉపయోగించండి. లేదంటే, సహజమైన మేకప్ లుక్ రావడం కష్టం.

4. పౌడర్ లేదా ఫౌండేషన్ ను సమస్యాత్మక ప్రాంతాలలో అప్లై చేయండి:

4. పౌడర్ లేదా ఫౌండేషన్ ను సమస్యాత్మక ప్రాంతాలలో అప్లై చేయండి:

పౌడర్ లేదా ఫౌండేషన్ ను అతిగా వాడకుండా ఉంటే నేచురల్ మేకప్ లుక్ వస్తుంది. అతిగా వీటిని వాడటం వలన డ్రమాటిక్ లుక్ వస్తుంది. కాబట్టి, కేవలం సమస్యాత్మక ప్రాంతాలలో మాత్రమే వీటిని వాడాలి. స్కిన్ క్రాకీగా కనిపించకుండా కేవలం అవసరమైన చోట మాత్రమే వీటిని ఉపయోగిస్తే మంచి లుక్ వస్తుంది.

5. న్యూట్రల్ షేడ్స్ ను ఎంచుకోండి:

5. న్యూట్రల్ షేడ్స్ ను ఎంచుకోండి:

నేచురల్ లుకింగ్ ఫినిష్ మీ మేకప్ కు లభించేందుకు మీరు న్యూట్రల్ షేడ్స్ ని వినియోగించాలి. మరోవైపు, డార్క్ కలర్స్ ని వాడితే మీ మేకప్ మరీ బోల్డ్ గా కనిపించవచ్చు. కాబట్టి, మీ నేచురల్ స్కిన్ టోన్ కంటే ఒకటి లేదా రెండు షేడ్స్ డార్క్ గా ఉండే షేడ్స్ ను ఎంచుకోండి.

6. చాలా తక్కువగా బ్లష్ ను వాడండి:

6. చాలా తక్కువగా బ్లష్ ను వాడండి:

మీ చెంపలకు రోజీ గ్లోను అందించేందుకు బ్లష్ ఉపయోగపడుతుంది. అయినప్పటికీ, మీ మేకప్ నేచురల్ గా కనిపించాలంటే బ్లష్ ని సాధారణం కంటే తక్కువగా వాడండి. లేయర్స్ గా అప్లై చేయవద్దు.

7. ఐ ల్యాషెస్ కి మెరుగులు దిద్దండి:

7. ఐ ల్యాషెస్ కి మెరుగులు దిద్దండి:

ఈ చిట్కా వలన నేచురల్ మేకప్ లుక్ సహజంగా లభిస్తుంది. మీ ఐ ల్యాషెస్ కి మెరుగులు దిద్దండి. తద్వారా, మీకు నేచురల్ లుక్ అనేది వస్తుంది. ఐ ల్యాషెస్ ని కాస్తంత కర్ల్ చేయండి. ఇలా చేస్తే కళ్ళు హైలైట్ అవుతాయి.

8. ఐ లైనర్ ని స్కిప్ చేయండి:

8. ఐ లైనర్ ని స్కిప్ చేయండి:

ఐ లైనర్స్ వలన మీ కళ్ళు హైలైట్ అవుతాయి. అయితే, నేచురల్ లుక్ కావాలనుకుంటే ఐ లైనర్ ని స్కిప్ చేయాలి. దాని బదులు, లాషెస్ ని హైలైట్ చేయడం ద్వారా మీ ఐ ఏరియాని హైలైట్ చేయవచ్చు. ఐ లైనర్ కి బదులు ఐ ల్యాషెస్ పై శ్రద్ధ వహించండి.

9. ఐబ్రో పెన్సిల్ ను వాడండి:

9. ఐబ్రో పెన్సిల్ ను వాడండి:

ఈ చిట్కాని పాటిస్తే నేచురల్ లుక్ మీ సొంతమైనట్లే. దట్టమైన ఐ బ్రోస్ కావాలనుకుంటే మీరు మీ అఫియరెన్స్ ని మరీ డ్రమాటిక్ గా మార్చకూడదు. అదే సమయంలో, మీ గ్లామర్ అలాగే స్టైల్ అనేవి తగ్గకూడదు. కాబట్టి, ఒక పెన్సిల్ ని వాడి కనుబొమ్మలు చక్కగా విల్లులా దిద్దండి. ఇప్పుడు, మీకు నేచురల్ లుక్ వచ్చేసినట్లే.

English summary

Tips To Make Your Makeup Look More Natural

Tips To Make Your Makeup Look More Natural,One of the best beauty trends that you can follow is the natural makeup look. Yes, there is no need to apply makeup all the time just to look beautiful. But to look beautiful there are simple tips that need to be followed. Moisturising your skin, applying concealer, applying l
Desktop Bottom Promotion