మీ మేకప్ ను ఎందుకు ఎప్పుడూ తొలగించుకోవాలి

Written By: DEEPTHI T A S
Subscribe to Boldsky

మనందరికీ ఇలా ఎప్పుడో జరిగే ఉంటుంది,మనం వేసుకున్న మేకప్ ను తొలగించటానికి బద్ధకించే ఉంటాం. అర్థరాత్రి జరిగే పెళ్ళిళ్ళ నుంచి ఆఫీసులో లేటు అయినపుడల్లా, రాత్రి ఇంటికొచ్చి మేకప్ తీయడం చాలా కష్టంగా అన్పిస్తుంది. కానీ ఈ అలవాటు మీ చర్మానికి ఎంత నష్టం కలిగిస్తుందో తెలుసా? పడుకునేముందు ఈ ఒక్క స్టెప్ మిస్సవ్వడం అనేది అందాన్ని కోరుకునే ఏ అమ్మాయీ చేయకూడనిది. ఒప్పుకుంటారు కదూ? మీ మేకప్ ను క్రమంగా తీసెయ్యడం అలవాటు చేసుకోకపోతే జరిగే విషయాలను చదివి తెలుసుకోండి.

Why you should always remove your make-up

1.కంటి ఇన్ఫెక్షన్

ప్రతి అమ్మాయికి పర్ఫెక్ట్ కంటి మేకప్ కుదరటం పెద్ద విజయంలా ఉంటుంది. కానీ మీకు తెలుసా ఆ హాట్ కాటుక కళ్ళు లేదా రంగుల నీడలు కంటి ఇన్ఫెక్షన్ కలిగించవచ్చని? మస్కారా నుండి షాడోల వరకూ చిన్న చిన్న ధూళికణాలు కంట్లోకి వెళ్ళి మంటను, ఎర్రదనాన్ని లేదా తీవ్ర ఇన్ఫెక్షన్ ను కూడా కలిగించవచ్చు.

Why you should always remove your make-up

2.మొండి బ్లాక్ హెడ్స్

ఎవరికీ ఆ మొండి బ్లాక్ హెడ్స్ నచ్చవు. మీరు మేకప్ తీయకపోతే చర్మ గ్రంథులను మీరే ఇంకా నింపి, బ్లాక్ హెడ్స్ వచ్చేలా చేస్తున్నారు.

Why you should always remove your make-up

3.మొటిమ

మీరు మేకప్ తీయకపోతే అన్నిటికన్నా మొదటగా తప్పక వచ్చేది మొటిమలు. పేరుకుపోయిన గ్రంథులు ఇంకా మేకప్ తీయకపోవటం వలన ఇన్ఫెక్షన్ కలిగి మొటిమలకి దారితీస్తుంది.

Why you should always remove your make-up

4.పొడిబారిన పెదవులు

చాలాసేపు నుంచి ఉన్న లిప్ స్టిక్ రంగును తొలగించడం కొంచెం పనే కానీ, పొడి పెదవుల బారిన పడటం అవసరమా? అస్సలు కాదు. మీరు మీ లిప్ స్టిక్ ను రాత్రిపూట తీయకపోతే, మీ పెదవులపై ఆ రంగు తేమను మొత్తం లాగేయటం వలన పెదవులు ఎండిపోయి పొడిబారుతాయి.

Why you should always remove your make-up

5.చర్మం వయస్సు మీరటం

తర్వాత ఎప్పుడో చికిత్సల కోసం తిరగటం కన్నా మీ చర్మాన్ని మొదటిదశల్లోనే సంరక్షించుకోవటం మంచిది.మేకప్ తొలగించకపోతే చర్మం పొడిబారిపోతుంది. ఇంకా మేకప్ వలన ఫ్రీ రాడికల్స్ ఆకర్షితమై చర్మం వయస్సుమీరే మొదటి లక్షణాలు కన్పిస్తాయి.

English summary

Why you should always remove your make-up

We have all been there, when we are too lazy to remove our make-up. From attending late-night weddings to a long day at work, removing make-up seems like a tedious job at night. But, do you know that this habit can take a toll on your skin. Missing that one step at night is one beauty sin a girl should never commit.