For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ అద్భుతమైన చిట్కాలతో ఇంట్లోనే ఐలైనర్ తయారుచేసుకోండి!

|
How To Apply Eyeliner Like A Pro || సులువుగా ఐ లైనర్ పెట్టుకునే టిప్స్ || Boldsky Telugu

మీ కళ్ళు అత్యంత సున్నితంగా ఉన్నాయా? క్రమంగా మార్కెట్లో దొరికే ఐ-లైనర్ లేదా కాటుకను వినియోగించడంలో అసౌకర్యానికి గురవుతున్నారా ? సహజసిద్దమైన మార్గాల గురించిన ఆలోచన చేస్తున్నారా ? అయితే ఈ వ్యాసం మీకోసమే. మీ స్వంత ఐ-లైనర్ను ఇంట్లోనే తయారు చేసుకునే విధానం గురించిన వివరాలను ఈ వ్యాసంలో పొందుపరచడం జరిగింది. తద్వారా మీరు మేకప్ వేసుకునేటప్పుడు మీ కళ్ళకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఐ-లైనర్ను అనుసరించవచ్చు. ఆసక్తికరంగా ఉంది కదూ ?

కానీ, మీ సొంత ఐ-లైనర్ను ఇంట్లోనే తయారు చేయడం కుదురుతుందా ? ట్రెండ్ ప్రకారం, అనుసంధానంగా ఉండేలా, వైబ్రెంట్ రంగులను జోడించుకుని, ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా ఐ-లైనర్ తయారు చేయడం సాధ్యపడుతుందా ? సరే ఏదిఏమైనా ఒక ఐ-లైనర్ను ఎలా తయారు చేస్తారు? అది మీ కళ్ళకు ఎంతవరకు నప్పుతుంది ? ఇటువంటి అనేక ప్రశ్నలను నివృత్తి చేసుకునేందుకు వ్యాసంలో ముందుకు సాగండి.

ఐ-లైనర్ను ఇంట్లోనే తయారు చేసుకునే విధానం :

కావలసిన పదార్థాలు :

మీకు నచ్చిన రంగులు మరియు షేడ్స్ తో కూడుకున్న ఐషాడో పాలెట్.

• ఐ-లైనర్ బ్రష్

• ప్రైమర్

• కాటన్ స్వాబ్

• నీరు

తయారుచేసే విధానం :

మీ స్వంత ఐ-లైనర్ను ఇంటి వద్దే అనుసరించడానికి దిగువ పేర్కొన్న సరళమైన మరియు సులభమైన దశల్ని పాటించండి:

• ఐషాడో పాలెట్ తీసుకొని మీకు నచ్చిన ఐషాడో ఎన్నుకోండి. ఐషాడో పౌడర్ రూపంలో ఉండాలని గుర్తుంచుకోండి. అదేవిధంగా, మీరు ఒక ఐలైనర్ తయారు చేస్తున్నారు కనుక, మీరు ఉపయోగించే అన్ని రకాల పదార్థాల (ఉత్పత్తులు) మాన్యుఫాక్చరర్ మరియు ఎక్స్పైరీ తేదీలు సక్రమంగా ఉన్నాయని ధృవీకరించుకోండి. రంగు మరియు ఐషాడో రకాన్ని ఎంచుకున్న తరువాత, షిమ్మరీ లేదా మ్యాట్ వంటి తరువాత దశలకు వెళ్ళవచ్చు.

• కాటన్ స్వాబ్ ఉపయోగించి పాలెట్ నుంచి ఐషాడోను బయటకు తీసి, దానిని ఒక చిన్నపాటి మరియు పారదర్శకంగా ఉండే కంటైనర్లోనికి బదిలీ చేయండి. ఒకవేళ మీకు ఇంటి వద్దనే వాడేసిన లిప్ బామ్ కంటైనర్ ఉన్నట్లయితే, మీ ఐ-లైనర్ను నిల్వ చేసేందుకు అనువుగా ఉంటుంది. మీరు చేయవలసినదల్లా ఆ కంటైనర్ను లిక్విడ్ డిటర్జెంట్ ఉపయోగించి శుభ్రపరచడమే. శుభ్రం చేసేటప్పుడు లిప్ బామ్ అవశేషాలు, మరియు డిటర్జెంట్ సంబంధిత మరకలను తొలగించినట్లు నిర్ధారించుకోండి. శుభ్రమైన టిష్యూ పేపర్ ఉపయోగించి కంటైనర్ని తుడవండి మరియు కొత్తగా తయారు చేసిన ఐ-లైనర్ నిల్వ చేసేందుకు దానిని ఉపయోగించండి. క్రమంగా ఐ-లైనర్ కోసం, పౌడర్డ్ ఐషాడోను ఆ కంటైనర్లోనికి తీసుకుని తరువాత దశకు తరలండి.

• దీనిని ఒక ద్రవరూపంలోనికి తయారుచేసేలా, కొన్ని చుక్కల నీటిని కలపండి. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుంచుకోవలసిన అవసరం ఉంది. మిశ్రమం కొద్దిగా మందపాటిగా మారేవరకు కొద్దికొద్దిగా నీటిని జోడించవలసి ఉంటుంది. ఎక్కువ నీటిని జోడించలేదని నిర్ధారించుకోండి. అది మీ ఐలైనర్ను పాడుచేసే అవకాశముంది. ఒకవేళ మీ ఇంట్లో లభ్యత ఉన్న ఎడల, నీటికి బదులుగా ఐ-డ్రాప్స్ కూడా ఉపయోగించవచ్చు.

• తరువాత దశలో, మిశ్రమానికి కొంత మొత్తంలో ప్రైమర్ని జోడించవలసి ఉంటుంది. ఇక్కడ మీరు మార్కెట్లో అందుబాటులో ఉన్న ఒక మంచి ఐ-ప్రైమర్ ఎంచుకోవచ్చు. లేదా మీరు తరచుగా మీ ముఖానికి వినియోగించే ప్రైమర్ సరిపోతుంది. ఎటువంటి ప్రైమర్ అయినా మీ ఐలైనర్ దీర్ఘకాలికంగా ఉండేందుకు దోహదపడుతుందని గుర్తుంచుకోండి.

• ప్రైమర్ జోడించిన తరువాత, పూర్తిగా కరిగేవరకు బ్రష్ ఉపయోగించి దానిని చక్కగా కలపండి. కంటైనర్ మూతను బిగించి, మీ ఐ-లైనర్ను చల్లని మరియు పొడిగా ఉండే ప్రదేశంలో నిల్వ చేయండి. తద్వారా అది దీర్ఘకాలంపాటు వినియోగించబడేలా సిద్దమవుతుంది. మరియు మీరు ఎక్కడికి వెళ్లినా ఈ ఐ-లైనర్ అనుసరించేలా ఒక ఐ-లైనర్ బ్రష్ సిద్దంగా ఉంచుకోండి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర మేకప్, ఫాషన్, ఆరోగ్య, జీవనశైలి, ఆహార, మాతృ శిశు సంబంధ, వ్యాయామ, లైంగిక, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి

English summary

How To Make Your Own Eyeliner At Home?

Do you have sensitive eyes? Are your sensitive eyes the reason why you do not wear kohl or an eyeliner? Well, guess what? You can now make your very own eyeliner at home and do not have to worry about having any kind of discomfort in your eyes when you wear make-up. Use your eyeshadow to make an eyeliner that is fresh, vibrant, colourful.