For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలనాటి సుందరీమణులను తలపించే అందాల అనసూయ సౌందర్య రహస్యాలేంటో తెలుసా...

|

జబర్దస్త్ యాంకర్ అనసూయ అంటే పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి వారం ప్రత్యేకంగా కనిపించే అనసూయ కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తారంటే ఎలాంటి అతిశయోక్తి లేదు. మూడు పదుల వయసు దాటినా తన అందచందాలతోనే కాకుండా, డ్యాన్స్, నటన, వాక్చాతుర్యంతో ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేస్తుంది.

ఓసారి సందర్భానికి తగ్గట్టు అచ్చం తెలుగింటి ఆడపడుచుగా.. సినిమాల్లో పాత్రకు తగ్గట్టుగా మోడ్రన్ అమ్మాయిగా.. అలా బయటికొచ్చిన ప్రతిసారీ నలుగురి చూపు తన వైపు తిప్పుకునేలా బంగారు బొమ్మలా మెరిసిపోతుంది.

Image curtosy

అయితే ఈ అమ్మడు ఫాలో అయ్యే మేకప్ సీక్రెట్స్, ఫ్యాషన్ విషయంలో అనసూయ తీసుకునే జాగ్రత్తలే ఆమె వయసును తగ్గించి చూపుతుంటాయి. అయితే ఈ టాలీవుడ్ ముద్దుగుమ్మ ఎక్కువగా చేనేత అవుట్ ఫిట్స్ ను ఎక్కువగా ఫాలో అవుతుంటారు. ఇక ప్రస్తుత సమ్మర్ లో కూల్ గా ఉండేందుకు కాటన్, చేనేత వస్త్రాలనే ఎక్కువగా వాడేది. అంతే కాదు అందం, ఆరోగ్యం విషయంలోనూ అనేక జాగ్రత్తలు తీసుకుంటుందని పలు ఇంటర్వ్యూల్లో కూడా స్వయంగా వెల్లడించింది.

మే 15వ తేదీ అందాల అనసూయ పుట్టినరోజు సందర్భంగా ఈ అందాల భామ ఫాలో అయ్యే బ్యూటీ, ఫ్యాషన్ సీక్రెట్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం...

రంగమ్మత్త ప్రేమ పెళ్లి జరిగి పదేళ్లు పూర్తయ్యిందట... అయినా ఏ మాత్రం జోరు తగ్గని అనసూయ...

జబర్దస్త్ బ్యూటీగా..

జబర్దస్త్ బ్యూటీగా..

Image curtosy

అటు బుల్లి తెరపై, ఇటు తెలుగు వెండి తెరపై హాట్ బ్యూటీగా అందరినీ ఆకట్టుకున్న అనసూయ భరద్వాజ్ 1985లో మే 15వ హైదరాబాద్ జన్మించారు. ఈమె ఎంబీఎ పూర్తి చేసి కెమెరా ముందుకొచ్చింది. తొలుత న్యూస్ ప్రెజెంటర్ గా ప్రస్థానం మొదలుపెట్టిన ఈ అందాల భామ.. తర్వాత ‘జబర్దస్త్‘ ఛాన్స్ కొట్టేసి జనాల్లో హాట్ బ్యూటీగా మంచి క్రేజ్ సంపాదించుకుంది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా..

సోషల్ మీడియాలో యాక్టివ్ గా..

Image curtosy

అతి తక్కువ కాలంలో అత్యంత పాపులర్ అయిన అనసూయ సుమారు ఎనిమిదేళ్లుగా జబర్దస్త్ యాంకర్ గానే కాకుండా సినిమాల్లోనూ, సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుకుగా ఉండేంది. ఇక సోషల్ మీడియాలో అయితే హీరోయిన్లను మించిన అందగత్తెలా ఫొటో షూటులో ఫోజులిచ్చేది. అలా తన సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కూడా విపరీతంగా పెంచుకుంది.

రోటీన్ కాస్ట్యూమ్స్ నచ్చవట..

రోటీన్ కాస్ట్యూమ్స్ నచ్చవట..

Image curtosy

అనసూయకు అందరిలాగా రోటిన్ కాస్ట్యూమ్స్ వేసుకోవడం నచ్చదట. ఆమె స్కిన్ కేర్ జంకీ కూడా కాదు చాలాసార్లు సోషల్ మీడియాలో కూడా చెప్పేసింది. తను ఎక్కువగా సహజంగా ఉండే వాటిని ఇష్టపడుతుందట.

ఎక్కువగా యోగా..

ఎక్కువగా యోగా..

తన అందంతో పాటు ఫిట్ నెస్ గా ఉండటానికి ఎక్కువగా యోగా చేస్తారట. అలాగే శాఖాహారమై ఆహారాన్నే ఎక్కువగా తీసుకుంటారట. అయితే కొన్నిసార్లు కోడిగుడ్డును తీసుకున్నారట. ఇక రెగ్యులర్ బ్లాక్ కాఫీ తీసుకుంటారట. దాని వల్లే తన అందంగా కనిపిస్తానంటోంది.

మళ్లీ మోడ్రన్ అమ్మాయిలా మారిపోయిన జబర్దస్త్ యాంకర్ అనసూయ...

చేనేత చీరలో చక్కని చుక్కలా..

చేనేత చీరలో చక్కని చుక్కలా..

చేనేత చీరలను ధరించడం వల్ల చాలా మంది అమ్మాయిలకు ఓల్డ్ లుక్ వస్తుందని, వయసులో చాలా పెద్దవారిలా కనిపిస్తామని భయపడుతూ ఉంటారు. కానీ అనసూయ మాత్రం అలాంటివాటికి భయపడకుండా చేనేత చీరలో చక్కని చుక్కలా ఎలా మెరిసిపోవచ్చో అందరికీ చూపిస్తూ ఉంటుంది.

ట్రెండీ డ్రస్సుల్లోనూ..

ట్రెండీ డ్రస్సుల్లోనూ..

అనసూయ కేవలం సాంప్రదాయ దుస్తులనే కాదు.. ఈ కాలం అమ్మాయిలలో చాలా మందికి ఇష్టమైన జీన్స్, టాప్ వంటి అవుట్ ఫిట్స్ తోనూ ట్రెండీగా కనిపిస్తుంది అనసూయ. ఈ ఫ్యాషన్ ను కాలేజీకి వెళ్లే అమ్మాయిలు కూడా చాలా సులభంగా ఫాలో అవ్వొచ్చు.

ఇద్దరు పిల్లల తల్లి అయినా..

ఇద్దరు పిల్లల తల్లి అయినా..

2010లో సుశాంక్ భరద్వాజ్ ని పెళ్లి చేసుకున్న అనసూయ ఇద్దరు పిల్లలకు కూడా జన్మినిచ్చింది. అయినా కూడా ఒక ఇల్లాలిగా, తల్లిగా అందరి ప్రశంసలు అందుకుంటోంది. వీలు దొరికినప్పుడల్లా భర్త, పిల్లలతో టూర్లు వేస్తూ సరదాగా ఎంజాయ్ చేస్తుంటుంది. అయితే తను ఏ పని చేసినా చాలా ఇష్టంగా చేస్తుందట. అది కూడా తన అందానికి ఓ కారణమని చెబుతుంది.

లాక్ డౌన్ తర్వాత ఏం చేస్తారంటే..

లాక్ డౌన్ తర్వాత ఏం చేస్తారంటే..

అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే అనసూయ అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు చెప్పింది. లాక్ డౌన్ పూర్తయిన వెంటనే ఏమి చేస్తారనే అడిగితే, ఫస్ట్ సెలూన్ కు వెళ్తానని చెప్పింది. ఎలాంటి డ్రస్సులు ఇష్టమంటే, తనకు కంఫర్ట్ గా ఏ డ్రస్సులైనా ఇష్టమని చెప్పేసింది.

సక్సెస్ ఫుల్ కెరీర్..

సక్సెస్ ఫుల్ కెరీర్..

Image curtosy

ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ కారణంగా అనసూయ ఇంటికి పరిమితమైన, తాను డైలీ చేసే పనులను వంటల నుండి తన కుటుంబసభ్యులతో క్షణాలను సైతం సోషల్ మీడియా ద్వారా అందరితోనూ షేర్ చేసుకుంటోంది. జబర్దస్త్ బ్యూటీ ఇలాగే అభిమానులను అలరిస్తూ తన జీవితంలో సక్సెస్ ఫుల్ కెరీర్ ను కొనసాగించాలని ‘బోల్డ్ స్కై తెలుగు‘ తరపున అనసూయకు పుట్టినరోజు శుభాకాంక్షలు.

English summary

Jabardasth Anchor Anasuya reveals her Beauty & Fashion Secrets

Here are the jabardast anchor anasuya fashion to get cool looks in this summer. Take a look.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more