For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కళ్యాణం వంటి కార్యక్రమాల్లో అనుష్క శర్మ లాగా మీరు కూడా కాంతివంతంగా మెరిసిపోవాలంటే...

|

ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం అనే ఘట్టం చాలా ముఖ్యమైనది. చాలా మంది జీవితాలలో ఒకే ఒక్కసారి వచ్చే మధురమైన అనుభూతి. మరి కొద్ది రోజుల్లో పెళ్లిళ్ల సీజన్ మొదలవుబోతోంది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్లకు వెళ్లేందుకు అమ్మాయిలలో చాలా మంది ఇప్పటి నుండి ఎలాంటి మేకప్ వేసుకోవాలో అని తెగ ఆరాటపడుతూ ఉంటారు.

అలా మీ స్నేహితుల, బంధువుల పెళ్లి సమయానికల్లా మీ చర్మం మెరిసిపోతూ కనిపించాలంటే.. మీరు కనీసం ఒక నెల ముందు నుండే చర్మ రక్షణ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకోసం మీరు అనుష్క శర్మ మేకప్ లుక్స్ ను ఉదాహరణగా తీసుకోవచ్చు. విరాట్ కోహ్లీ భార్య అనుష్కశర్మ విషయానికొస్తే, ఆమె వ్యక్తిగత శైలి లేదా నాటకీయ రెడ్ కార్పెట్ దుస్తులే అయినా, మన కళ్లను చూపు తిప్పుకోకుండా చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి మేకప్ ప్రేరణ కోసం మీరు ఎదురుచూస్తున్నట్లయితే అనుష్కశర్మ మేకప్ పై ఓ లుక్కేయండి.. వీటిని మీరు కూడా ప్రయత్నించండి.

సాధారణ అందానికి చిట్కాలు: ఖర్చు తక్కువ ప్రయోజనం ఎక్కువ

చర్మ రక్షణ..

చర్మ రక్షణ..

వివాహం వంటి కార్యక్రమాలకు వెళ్లాలనుకువారి చర్మం మెరిసిపోతూ కనిపించాలంటే అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. కాన్వాస్ సున్నితంగా ఉంటేనే, మీ ముఖంపై వేసిన రంగు బాగా కనబడుతుంది. మీ చర్మం ఆరోగ్యంగా ఉంటేనే మేకప్ వేశాక అది అద్భుతంగా కనిపిస్తుంది. అందుకే పెళ్లికి కనీసం మూడు వారాల ముందు ప్రతిరోజూ సాయంత్రం క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింట్ వంటివి ప్రయత్నించాలి. అలాగే వారంలో రెండుసార్లు ఎక్స్ ఫోలియేషన్ కూడా చేస్తూ ఉండాలి.

అనుష్క చూపులు..

అనుష్క చూపులు..

అనుష్క మేకప్ లోని లుక్స్ నుండి మంచి ప్రేరణ పొందవచ్చు. ఆమె అందమైన పెదవులతో పాటు సున్నితమైన మెరిసే కళ్లు మరియు ఆమె బుగ్గలపై హైలైటర్ యొక్క సూచన అతివలను మరింత అందంగా కనిపించేలా చేస్తుంది. ఇది కాక్టెయిల్ గౌన్ లేదా షిమ్మరీ చీర అయినా, వెస్ట్రన్ అండ్ ఇండియన్ క్లాత్స్ రెండింటికీ పని చేస్తుంది.

స్మోకీ లైనర్..

స్మోకీ లైనర్..

బాలీవుడ్ అందాల భామల్లో ఒకరైన అనుష్క శర్మ రెండో లుక్ లో రెక్కల వంటి డ్రస్సులో స్మడ్జ్ కోహ్ల్ లైనర్ను స్పోర్ట్ చేసింది. ఈ మేకప్ లుక్ భారతీయ దుస్తులు ధరించడానికి గొప్ప ఎంపిక చెప్పవచ్చు. మీరు కళ్లు లోపలి మూలల్లో మెరిసే సూచనతో గ్లాం చేయవచ్చు.

దానిమ్మపండు ఉపయోగించి అందమైన పెదాలను ఎలా పొందాలో మీకు తెలుసా?

స్మోకీ కళ్లు..

స్మోకీ కళ్లు..

అనుష్క శర్మ లాగా నాటకీయమైన రూపం మీకు కావాలనుకుంటే, అందమైన పెదవులతో పాటు తీవ్రమైన స్మోకీ కళ్ల కోసం ప్రయత్నించండి. భారీ లెహెంగాలు, చీరలు, కాక్టెయిల్ గౌన్ల కోసం నాటకీయ స్మోకీ కళ్ల వల్ల మీ చుట్టూ ఉన్న వారిలో మీరు మరింత ప్రత్యేకంగా కనిపిస్తారు.

ఫ్రెష్ లుక్స్ కోసం..

ఫ్రెష్ లుక్స్ కోసం..

స్నేహితులు, బంధువుల పెళ్లి అనగానే బోలెడు పనులుంటాయి. పెళ్లికి బంధు మిత్రులను ఆహ్వానించడం దగ్గరి నుండి ఇంకా ఎన్నో కార్యక్రమాలలో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ సమయంలో కచ్చితంగా ఎండలో తిరగాల్సిందే. ఇలాంటప్పుడు ట్యాన్ ప్రభావం వల్ల ముఖం నల్లగా మారిపోయే అవకాశముంది. అందుకే పెళ్లికి కొన్ని నెలల ముందు నుంచి సన్ స్క్రీన్ లోషన్ వాడటం వంటివి చేస్తే మీ చర్మం నల్లబడకుండా కాపాడుకోవచ్చు.

కాంతివంతమైన మోము కోసం..

కాంతివంతమైన మోము కోసం..

అనుష్క శర్మ లాగా మీకు కూడా మీ మోము కూడా కాంతివంతంగా కనిపించాలంటే వీటిని తప్పనిసరిగా మీ వద్ద ఉంచుకోండి. ముఖ్యంగా కొన్ని మేకప్ ఉత్పత్తులను మీ ఎమర్జెన్సీ కిట్ లో ఉంచుకోవాలి. మీ స్నేహితురాలు లేదా బంధువులకు లేదా సోదరికి మీ ఎమర్జెన్సీ కిట్ బాధ్యత అప్పగించండి.

కొత్త షూ కొరుకుతుందా? ఈ ఇంటి చిట్కాలను వెంటనే ప్రయత్నించండి..

ఎమర్జెన్సీ కిట్ లో..

ఎమర్జెన్సీ కిట్ లో..

మీరు వెళ్లే పెళ్లి వంటి కార్యక్రమాలకు వెళ్లే సమయంలో మీ దగ్గర ఉండే ఎమర్జెన్సీ కిట్ లో లాంగ్ లాస్టింగ్ లిప్ స్టిక్, కాంపాక్ట్ పౌడర్, కన్సీలర్, మేకప్ రిమూవర్, వ్యాసిలిన్, నెయిల్ పాలిష్ వంటివి కచ్చితంగా ఉంచుకోవాలి.

బెస్ట్ హెయిర్ స్టైల్ కోసం..

బెస్ట్ హెయిర్ స్టైల్ కోసం..

పెళ్లిళ్లలో చక్కటి హెయిర్ స్టైల్ తో కనిపించేందుకు కూడా మీ మేకప్ కిట్ లో మరికొన్ని వస్తువులను అందుబాటులో ఉంచుకోవాలి. అవేంటంటే పక్క పిన్నులు, హెయిర్ స్ప్రే, దువ్వెన, హెయిర్ క్లిప్స్ వంటి వాటిని అందుబాటులో ఉంచుకోవాలి.

ఒత్తిడి వల్ల..

ఒత్తిడి వల్ల..

పెళ్లిళ్లలో మేకప్ అంటే అందానికి సంబంధించిన విషయమే కాదు. ఇతర ఎమర్జెన్సీ వస్తువులను కూడా అందుబాటులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే పెళ్లి సమయంలో ఒత్తిడి వల్ల ఏదైనా జరిగే అవకాశం ఉంది.

ఇవి కూడా..

ఇవి కూడా..

మీ కిట్ లో మీ నోటి నుండి దుర్వాసన రాకుండా ఫ్రెష్ మింట్, ఫ్రెష్ వైప్స్ వంటి వాటిని కూడా అందుబాటులో ఉంచుకోవాలి. అలాగే పెర్ఫ్యూమ్స్, బ్యాండెయిడ్ వంటివి తప్పనిసరిగా ఉంచుకోవాలి.

All Images Credited to Twitter Anushka Sharma

English summary

Make-Up Looks Of Anushka Sharma To Steal For Your Wedding

Here is the make up looks of anushka sharma to steal for your wedding. Take a look