For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Mango Face Packs:మామిడితో ముఖ సౌందర్యాన్ని మరింత పెంచుకోవచ్చు.. అదెలాగో చూసెయ్యండి...

ఈ సమ్మర్లో మ్యాంగో ఫేస్ ప్యాక్ ను ట్రై చేయండి.. మీ అందాన్ని మరింత పెంచుకోండి

|

సమ్మర్లో ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా తినేది మామిడి పండు. పండ్లలో మామిడికి మహారాజా అనే పేరు కూడా ఉంది. ఎండాకాలంలో ఇవి చాలా ఎక్కువగా లభిస్తాయి.

Mango Face Packs You Need To Try This Summer In Telugu

ఈ పండ్ల తినడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయని మనందరికీ తెలిసిందే. అలాగే మామిడి పచ్చడి ఆహారంలోనూ అందరికీ అద్భుతంగా పని చేస్తుంది.

Mango Face Packs You Need To Try This Summer In Telugu

ఇలా మామిడి పండు కేవలం ఆహారం, ఆరోగ్యానికే కాకుండా.. మన అందాన్ని పెంచడంలో కూడా సహాయపడుతుందట.

Mango Face Packs You Need To Try This Summer In Telugu

మామిడి పండుతో మన ముఖ సౌందర్యాన్ని మరింత మెరుగుపరుచుకోవచ్చని బ్యూటీ నిపుణులు చెబుతున్నారు. ఈ సందర్భంగా మామిడి పండ్లతో మరింత అందాన్ని పెంచుకోవాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడే చూసెయ్యండి.. సమ్మర్లోనూ అందరికంటే అందంగా మారిపోండి...

KL Rahul's Girlfriend:అతియా శెట్టి అందాల రహస్యాలేంటో తెలుసా...KL Rahul's Girlfriend:అతియా శెట్టి అందాల రహస్యాలేంటో తెలుసా...

ముఖానికి నిగారింపు..

ముఖానికి నిగారింపు..

ఎండాకాలంలో ఎక్కువగా లభించే మామిడి పండ్లలో బీటా-కెరోటిన్, విటమిన్ ఎలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మంలోని మ్రుతకణాలను తొలగించడంతో పాటు మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. దీంతో మన ఫేసుపై పింపుల్స్, ముడతలు వంటివి కనిపించవు. దీంతో మన ముఖానికి నిగారింపు వస్తుంది.

మొటిమలు తగ్గాలంటే..

మొటిమలు తగ్గాలంటే..

మనలో చాలా మందికి ఎండ వేడికి లేదా ఇంకా ఏదైనా ఇతర కారణాల వల్ల ముఖంపై మొటిమలు, మచ్చలు వంటివి వస్తూ ఉంటాయి. అయితే ఎండాకాలంలో వీటికి చెక్ చెప్పేందుకు మామిడిపండ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

20 నిమిషాల పాటు..

20 నిమిషాల పాటు..

ముందుగా ఒక పాత్రలో కొద్దిగా మామిడి పండ్ల గుజ్జు, రెండు టీ స్పూన్ల పెరుగు, రెండు టేబుల్ టీ స్పూన్ల తేనేను వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని ఇరవై నిమిషాల వరకు వేచి ఉండాలి. ఆ తర్వాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల మీ ముఖంపై వచ్చిన మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి.

సున్నితమైన చర్మం..

సున్నితమైన చర్మం..

ఒక పాత్రలో ఒక టేబుల్ స్పూన్ మామిడి గుజ్జు, ఒక టీ స్పూన్ తేనే, ఒక టీ స్పూన్ బియ్యపు పిండి, ఒక టేబుల్ స్పూన్ పాలను వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని అరగంట పాటు వేచి ఉండాలి. ఆ తర్వాత చల్లని నీటితో ఫేసును శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వారానికి రెండు లేదా మూడుసార్లు చేయడం వల్ల చర్మంలోని మ్రుతకణాలన్నీ తొలగిపోయి చర్మం సున్నితంగా మారుతుంది.

ముడతలు పోవాలంటే..

ముడతలు పోవాలంటే..

ఒక కప్పులో మామిడి గుజ్జు, రెండు టేబుల్ స్పూన్ల అవొకాడో గుజ్జు, ఒక టేబుల్ స్పూన్ తేనే వేసి బాగా కలుపుకోవాలి. ఈ ప్యాక్ ను ఫేసుకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపరచుకోవాలి. ఇలా చేయడం వల్ల మామిడిలో ఉండే గుణాలు కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించి చర్మం ముడతలు పడకుండా అడ్డుకుంటుంది.

చర్మం మెరిసిపోవాలంటే..

చర్మం మెరిసిపోవాలంటే..

ఒక కప్పులో మామిడి గుజ్జు, రెండు టేబుల్ స్పూన్ల గోధుమ పిండి, ఒక టీ స్పూన్ తేనే వేసి బాగా కలపాలి. అలా తయారైన ప్యాక్ ను ఫేసుకు రాసుకుని అరగంట తర్వాత ముఖాన్ని నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఫేసులో పేరుకుపోయిన మలినాలు, ఇతర కణాలన్నీ చనిపోయి, మన చర్మానికి నిగారింపు వస్తుంది.

మెరిసే చర్మం మీ సొంతం..

మెరిసే చర్మం మీ సొంతం..

ఒక పాత్రలో ఒక స్పూన్ మామిడి గుజ్జు, సగం స్పూన్ పాలు, ఒక టీ స్పూన్ తేనేను వేసి బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత ఆ ప్యాక్ ను ముఖానికి రాసుకోవాలి. సరిగ్గా అరగంట తర్వాత కూల్ వాటర్ తో ఫేసును క్లీన్ చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి. మెరిసే చర్మం కూడా వచ్చేస్తుంది.

English summary

Mango Face Packs You Need To Try This Summer In Telugu

Mango Face Packs You Need To Try This Summer In Telugu
Story first published:Friday, April 22, 2022, 18:00 [IST]
Desktop Bottom Promotion