For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Mother’s Day Special:అమ్మ మరింత అందంగా కనిపించాలంటే.. ఇవి ఫాలో అవ్వండి...

|

అమ్మగా మారడం.. అమ్మతనం కోసం ఎంత కష్టపడాలో ఏ తల్లిని చూసినా.. అడిగినా మనకు అర్థమవుతుంది.

తన బిడ్డ పుట్టినప్పుటి నుండి పెరిగి పెద్దయ్యేంత వరకు, ఇంటి పనులు చేయడం, వంట చేయడం నుండి ఆఫీసు పని అంటూ ప్రతిరోజూ అనేక పనులు అమ్మ అవలీలగా చేసేస్తుంది. ఏ తల్లి అయినా తమ కష్టాలను ఇష్టంగా భావించి ప్రతి పనిని పూర్తి చేసేస్తారు.

ఇలా ప్రతిరోజూ పనుల్లో పడిపోయి బిజీగా ఉండే అమ్మలు తమ అందంపై అస్సలు శ్రద్ధ చూపరు. అందరిలాగా ఆకర్షణీయంగా కనిపించాలని ఉన్నా సమయం దొరక్క వాయిదా వేసుకుంటూ ఉంటారు లేదా అందంపై అస్సలు శ్రద్ధ అనేదే తగ్గించుకుంటారు.

అయితే ఈ మదర్స్ డే సందర్భంగా మీ అమ్మను మరింత అందంగా కనిపించేలా చేసేందుకు మేం కొన్ని చిట్కాలను తీసుకొచ్చాం. అందంగా కనిపించడం వల్ల మానసిక స్థితి మరియు శక్తి కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ మదర్స్ డే సమయంలో బిజీగా ఉండే అమ్మలందరి కోసం కొన్ని సులభమైన మరియు ప్రభావవంతమైన చిట్కాలతో మీ ముందుకొచ్చాం. ఇవి మీ సమయాన్ని ఆదా చేయడంలో సహాయపడటమే కాకుండా మీ చర్మాన్ని సైతం మెరిసిపోయేలా చేస్తారు. ఈ సందర్భంగా అందమైన చిట్కాలేంటో చూసెద్దాం రండి...

Mother's Day 2022:ఈ మదర్స్ డే వేళ అమ్మకు మరచిపోలేని అనుభూతిని అందివ్వండి...

CTM రోటీన్..

CTM రోటీన్..

మీరోజు రోజువారీగా మీ స్కిన్ ను క్లీన్ చేసుకోవడం, టోన్ చేయడం మరియు తేమగా మార్చడం వంటివి చేస్తే, అది మీ చర్మాన్ని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా మరియు మెరుస్తూ ఉండేలా చేస్తుంది. అయితే మీరు మీ చర్మం రకాన్ని బట్టి ఉత్పత్తులను ఎంచుకోవాల్సి ఉంటుంది.

నిమ్మకాయ సహాయం..

నిమ్మకాయ సహాయం..

నిమ్మరసం మన చర్మం మెరిసేలా చేయడంతో పాటు ముఖంపై ఉండే మొటిమలు, నల్ల మచ్చలు మరియు చిన్న మచ్చల చికిత్సలో సహాయపడుతుంది. అయినప్పటికీ, మీ చర్మానికి నిమ్మ రసాన్ని పూయడానికి సమయం వెచ్చించడం అనేది చాలా మంది తల్లులకు కష్టంగా ఉంటుంది. అలాంటి సమయంలో మీరు కిచెన్లో ఉన్నప్పుడే మీ చర్మంపై నిమ్మకాయను రాసేయొచ్చు. నిమ్మకాయతో పాటు మీరు కలబందను కూడా వాడొచ్చు. ముఖ్యంగా వేసవికాలంలో వీటిని వాడితే కచ్చితంగా మంచి ఫలితం వస్తుంది.

CC క్రీమ్ తో..

CC క్రీమ్ తో..

అమ్మగారికి మేకప్ వేయడానికి ముందుగా తన చర్మం మృదువైన మరియు కచ్చితమైన బేస్ కలిగి ఉండటం చాలా ముఖ్యం. అయితే, దీని కోసం మీరు పూర్తి ఈ ప్రక్రియను అనుసరించాలి. ప్రైమింగ్ మరియు ఫౌండేషన్‌ని ఉపయోగించడానికి మీకు ఖచ్చితంగా చాలా సమయం కావాలి. కాబట్టి, దీన్ని నివారించడానికి మరియు సమయాన్ని ఆదా చేయడానికి, మీరు ప్రైమర్‌ను దాటవేసి, సిసి క్రీమ్‌తో పాటు ఫౌండేషన్‌ను అప్లై చేయొచ్చు.

Mother's Day 2022:మనందరి తొలి గురువు అయిన తల్లికి మరచిపోలేని బహుమతిలిచ్చేయండి...

బ్రైట్ లిప్‌స్టిక్..

బ్రైట్ లిప్‌స్టిక్..

ప్రకాశవంతమైన షేడ్ లిప్‌స్టిక్ మీ రూపాన్ని అలాగే మీ విశ్వాసాన్ని తక్షణమే పెంచుతుంది. మీరు అధికారిక సమావేశానికి హాజరైనా లేదా పార్టీకి వెళ్తున్నా, ప్రకాశవంతమైన లిప్‌స్టిక్‌ను ధరించండి. ఇలా చేయడం వల్ల మీరు మేకప్‌పై ఎక్కువ సమయం వృథా చేయాల్సిన అవసరం ఉండదు.

కన్సీలర్ వాడొచ్చు..

కన్సీలర్ వాడొచ్చు..

మీరు ఆఫీసులో జూమ్ మీటింగులో హాజరయ్యేందుకు రాత్రంతా మేల్కొన్నా లేదా మీ బీబే అర్ధరాత్రి ఏడుపు ప్రారంభించినా, బిజీగా ఉండే తల్లి నిద్ర విషయంలో రాజీ పడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో మీ కళ్లు కచ్చితంగా ప్రమాదానికి గురవుతాయి. అంతేకాదు మీ కళ్ల కింద బ్లాక్ సర్కిల్స్ కూడా సాధారణంగా ఏర్పడతాయి. అయితే వాటిని నివారించేందుకు మీరు కన్సీలర్ ను వాడొచ్చు.

రాత్రి పూట..

రాత్రి పూట..

బిజీగా ఉండే ప్రతి ఒక్క తల్లికి ఈ చిట్కా ఉపయోగపడుతుంది. మీరు మరుసటి రోజు ఉదయాన్నే ఎక్కడికైనా వెళ్లాల్సి ఉన్నా లేదా మీరు అకస్మాత్తుగా ఆన్ లైన్ మీటింగు హాజరవ్వాల్సి ఉన్నా ముందు రోజు రాత్రే మీ జుట్టును కడుక్కోండి. ముఖ్యంగా తేలికగా తడిగా ఉన్న జుట్టులో మెత్తని బన్నులా తయారు చేసి నిద్రపోండి. ఆ మరుసటి రోజు, మీ జుట్టు అందమైన, మ్రుదువైన కర్ల్స్ కలిగి ఉంటుంది.

షాంపూ వాడండి..

షాంపూ వాడండి..

బిజీగా ఉండే తల్లులందరూ, రోజంతా అనేక పనులు చేయాల్సి ఉంటుంది. కాబట్టి క్రమం తప్పకుండా కురులను శుభ్రం చేసుకోవాలంటే కష్టంగా ఉంటుంది. అంతేకాదు ప్రతిరోజూ జుట్టును కడగడం కూడా మంచిది కాదు అయితే మీరు బయటకు వెళ్తున్నట్లయితే, మీ జుట్టును ఏ సమయంలోనైనా శుభ్రంగా మరియు పొడిగా మార్చడానికి డ్రై షాంపూ ఉత్తమ ఎంపిక. కాబట్టి ఈ సమయంలో మీ జుట్టుకు సరిపోయే డ్రై షాంపూని వాడండి.

English summary

Mother's Day Special: Easy and Effective Beauty Tips For Busy Moms in Telugu

Mothers Day 2022 special: Here are some easy and effective beauty tips for busy mom. Take a look.
Story first published:Friday, May 6, 2022, 15:34 [IST]
Desktop Bottom Promotion