For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Beauty Tips : ఈ చిట్కాలతో ‘అనుష్క’లాంటి అందం మీ సొంతం...!

|

అందం విషయంలో అందరూ ఎక్కువగా ఫేస్ ఎక్కువగా ప్రియారిటీ ఇస్తారు. అయితే అందం అంటే కాళ్లకు కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఉదాహరణకు బాలీవుడ్ అందాల భామ, పొడుగు కాళ్ల సుందరి దీపికా పదుకొనే కాళ్లు అత్యంత పొడవుగా, ఆకర్షణీయంగా ఉంటాయి.

కానీ నెంబర్ వన్ విషయానికొచ్చేసరికి అనుష్క శర్మ.. దీపికాను డామినేట్ చేసేస్తుంది. అందుకే బాలీవుడ్ లో అందరూ అనుష్క శర్మను 'సెక్సీ లెగ్'బ్యూటీగా పిలుస్తారు. షారుఖ్ ఖాన్ తో కలిసి తొలిచిత్రంలో నటించినప్పుడే అనుష్క శర్మ నటన మరియు పొడవాటి కాళ్ల గురించి చర్చ జరిగింది.

అప్పటి నుండి చాలా మంది అందమైన మరియు టోన్ లెగ్స్ విషయానికొచ్చేసరికి అనుష్కశర్మ పేరు ప్రముఖంగా వినిపించేది. అయితే హైట్ తక్కువగా ఉన్న వారు అనుష్క లాగా కాళ్లు పొడిగించలేకపోయినప్పటికీ.. అనుష్క మాదిరి అందమైన మరియు టోన్ కాళ్లను పొందొచ్చు.

అందుకోసం సులభమైన హోమ్ రెమెడీస్ మేము మీ కోసం తీసుకొచ్చాం. కాబట్టి వేల రూపాయల ఖర్చు లేకుండా మీ ఇంటి వద్దే మీ లెగ్స్ బ్యూటిఫుల్ గా మార్చేసుకోండి... అదెలాగో ఇప్పుడే చూసెయ్యండి...

గైస్! మీ గడ్డం తరచూ దురద పెడుతోందా.. అయితే ఇలా చేయండి...గైస్! మీ గడ్డం తరచూ దురద పెడుతోందా.. అయితే ఇలా చేయండి...

వెనిగర్..

వెనిగర్..

మార్కెట్లో లభించే వెనిగర్ తో మీరు మీ కాళ్లపై ఉన్న నల్లదనాన్ని సులభంగా తొలగించొచ్చు. చెరకు మరియు యాపిల్ నుండి తయారు చేసిన వెనిగర్ ను నీటితో కలిపి మీ పాదాలపై రాస్తే.. అక్కడ ఉండే నల్లదనం పోయి తెల్లగా మారుతుంది. అంతే కాదు మీ చర్మాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

ఎలా వాడాలంటే..

ఎలా వాడాలంటే..

* ముందుగా ఒక బాత్ టబ్ లో కొద్దిగా నీరు, రెండు స్పూన్ల వైట్ వెనిగర్ తీసుకోవాలి.

* తర్వాత మరో రెండు స్పూన్ల మౌత్ వాష్ (ఏదైనా బ్లీచ్ కలిగిన మౌత్ వాష్) అందులో పోయాలి.

* ఈ మిశ్రమాన్ని దాదాపు 15 నిమిషాల పాటు మీ పాదాలపై ఉంచాలి.

* అప్పుడు ఇది మీ చర్మశుద్ధి సమస్యను తొలగిస్తుంది.

* అంతేకాదు చెమట కారణంగా పాదాల నుండి వచ్చే వాసన కూడా తొలగిపోతుంది.

హనీ అండ్ రైస్..

హనీ అండ్ రైస్..

* హనీ(తేనే) మరియు బియ్యం(రైస్) మిశ్రమం వల్ల కూడా మీ స్కిన్ డి-టాన్ అవుతుంది.

* బియ్యపు పిండి మరియు తేనే మిశ్రమం వల్ల మీ పాదాలు తెల్లగా మారతాయి. ఇది మీ కాళ్లను మెరిసేలా చేయడంలో ఒక ప్రభావవంతమైన మార్గం.

మీ పాదాలపై..

మీ పాదాలపై..

* ముందుగా తేనే మరియు బియ్యపు పిండి తీసుకోవాలి.

* ఒక గిన్నెలో బియ్యపు పిండి మరియు తేనేను వేసి బాగా కలపాలి.

* అందులో నిమ్మకాయను సగం కోసేసి అందులోని రసాన్ని వేయాలి.

* ఈ స్క్రబ్ ను కనీసం 20 నిమిషాల పాటు మీ పాదాలపై ఉంచాలి.

* మీరు ఈ స్క్రబ్ ను వర్తింపజేయడం ద్వారా మీ ముఖ్యమైన పనిని కూడా పూర్తి చేయొచ్చు.

* ఇది మీ పాదాలను చాలా మ్రుదువుగా చేసి.. అక్కడ ఉండే నల్లదనాన్ని తొలగిస్తుంది.

బ్రెడ్ అండ్ మిల్క్..

బ్రెడ్ అండ్ మిల్క్..

సాధారణంగా బ్రెడ్ అండ్ మిల్క్ అనేవి మన ఆకలిని తీరుస్తాయి. కానీ ఇవి మన చర్మాన్ని కూడా మెరుగుపరుస్తాయి. ఇవి అవాంఛిత వెంట్రుకలను తొలగించడంలో కూడా సహాయపడతాయి.

* ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల పాలు, బ్రెడ్ స్లైస్ తీసుకోండి. అవి స్మూత్ గా మారినప్పుడు, పాలతో మెత్తగా పిండిని కలపండి. ఇది బాగా మెత్తగా అయ్యాక, దీనికి మీరు అవసరమనుకుంటే కొబ్బరి బురాను కూడా జోడించవచ్చు. ఆ తర్వాత దాన్ని పాలలో ముంచి మీ పాదాలకు రాయండి. దీని వల్ల మీ చర్మం స్మూత్ గా మరియు డి-టాన్ గా మారుతుంది.

పసుపు, పాలు, పిండి..

పసుపు, పాలు, పిండి..

పాలు, పసుపు, పిండి కలిపిన మిశ్రమాన్ని కలిపి స్నానం చేసే ముందు మీ పాదాలకు రాస్తే అద్భుతమైన ఫలితం వస్తుంది. దీని వల్ల క్రమంగా పాదాల జుట్టు పెరుగుదల తగ్గడం ప్రారంభమవుతుంది. మీ చర్మం కూడా ప్రకాశిస్తుంది. మీరు గ్రాము పిండికి బదులుగా గోధుమ పిండి లేదా రాగి పిండిని కూడా జోడించవచ్చు. ఇవన్నీ మీ కాళ్లను అందంగా మరియు సెక్సీగా చేయడానికి సహజ మార్గాలు.

English summary

Tips to make your legs beautiful and tone like Anushka Sharma

Here are these tips to make your legs beautiful and tone like Anushka Sharma. Take a look
Story first published: Saturday, February 20, 2021, 13:19 [IST]