For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

10 గ్రూమింగ్ టిప్స్- ఇవి మిమ్మల్ని తప్పక మరింత ఆకర్షణీయం గా కనపడేటట్లు చేస్తాయి

By Super
|

గ్రూమింగ్ రోటీన్.. చాలా మంది అబ్బాయిలు ఈ మాట వినగానే సంతోషం తో కేకలు పెట్టరు, కానీ అంత మాత్రం చేత దాని ప్రాముఖ్యత తగ్గిపోదు. "మీరు మీరుగా ఉండండి" అనో లేదా " సంతోషంగా ఉండండి, ఆకర్షణీయం గా ఉండండి" అనో చెప్పాడంతో సరిపోదు.

మీరు నిజంగా ఆకర్షణీయం గా కనిపించాలనుకుంటే కింద ఇచ్చిన గ్రూమింగ్ కి సంబంధించిన చిట్కాలు చూసి అవి మీ జీవన శైలో భాగం చేసుకోండి.

ఒక జత జీన్స్ శక్తి ని ఎప్పుడూ తక్కువ అంచనా వెయ్యొద్దు

ఒక జత జీన్స్ శక్తి ని ఎప్పుడూ తక్కువ అంచనా వెయ్యొద్దు

మేము నిజం గా స్కిన్నీ జీన్స్ గురించి మాట్లాడట్లేదు. స్లిమ్మర్ జీన్స్- మీ శరీరానికి అనుగుణం గా ఉండి రక్త ప్రసరణ కి ఆటంకం కలిగించని వాటి గురించి మేము చెప్తున్నది. ఇలాంటి జీన్స్ ధరించడం వల్ల మీరు సన్నగా మరియు పొడుగ్గా కనిపిస్తారు.

ఇలాంటి జీన్స్ ఎన్నుకోవడానికి ట్రిక్ ఏమిటో తెలుసా??? కాస్త సైజు లో పెద్దది తీసుకుని మీ టైలర్ దగ్గరకెళ్ళి మీ నడుము కొలత కి తగ్గట్లు మార్చండి. ఇలా చెయ్యడం వల్ల అధ్భుతమైన ఫిట్టింగ్ వస్తుంది-స్లిం మరియు శరీరానికి సరిగ్గా అమరుతుంది.

కనుబొమ్మలని కాస్త తీర్చిదిద్దుకోవడం మీ డేటింగ్ లైఫ్ లో అధ్భుతాలు చేస్తుంది.

కనుబొమ్మలని కాస్త తీర్చిదిద్దుకోవడం మీ డేటింగ్ లైఫ్ లో అధ్భుతాలు చేస్తుంది.

కనుబొమ్మలెప్పుడూ రెండు విడివిడిగా ఉండాలి.అలా అన్నామని సెలూంకి వెళ్ళడమో, వ్యాక్సింగ్ లేదా త్రెడ్డింగ్ అపాయింట్మెంటో తీసుకోక్కర్లేదు.కానీ రెండు కనుబొమ్మలూ కలిసిపోయి ఒక్కటిగా పొదలాగ కనిపిస్తున్న మీ కనుబొమ్మలని ట్వీజర్స్ సహాయంతో మీ గర్ల్ ఫ్రెండ్ ని తీర్చిదిద్దమనండి . కుదరకపోతే అప్పుడు సెలూన్ కి వెళ్ళి చేయించుకోండి.

మీరు గడ్డం పెంచుకోలేకపోతే గడ్డం పెంచవద్దు

మీరు గడ్డం పెంచుకోలేకపోతే గడ్డం పెంచవద్దు

నిజం చెప్పాలంటే పాచ్ లు పాచ్ లు గా కనిపిస్తున్న ముఖం మీది జుట్టు ఏ మగాడికీ మంచి చెయ్యలేదు,మీరు ఏడో తరగతిలో ఉన్నప్పుడు కొంచం పెరిగిన మీ గడ్డాన్ని ట్రిం చేసుకోవడానికి రేజర్ ఉపయోగించాలని తొందరపడ్డ రోజులని గుర్తు చెయ్యడం తప్ప.

క్లాసిక్ బ్రూట్ లేదా ఓల్డ్ స్పైస్ యాక్స్ డియోడరెంట్ కంటే 10 రెట్లు నయం. నిజం!!

క్లాసిక్ బ్రూట్ లేదా ఓల్డ్ స్పైస్ యాక్స్ డియోడరెంట్ కంటే 10 రెట్లు నయం. నిజం!!

యుక్తవయసులోకి అడుగిడుతున్న మగ పిల్లవాడు పరిపూర్ణ మగ వాడిగా కనపడటానికి పడే కష్టం లా ఉంటుంది యాక్స్ వాసన. మీ గ్రూమింగ్ వనరుల్లో యాక్స్ ఒక పనికిరాని వస్తువు.పైగా క్లాసిక్స్ అయిన ఓల్డ్ స్పైస్ లేదా బ్రూట్ లని మించి మ్యాన్లీ గా ఏదీ ఉండదు.

5.డేటింగ్ కి వెళ్ళే ముందు నోస్ హెయిర్ ని ట్రిం చేసుకోండి

ఏదోం కాస్త పెరిగాయి అనిపించచ్చు కానీ నన్ను నమ్మండి-మిమ్మల్ని కనుక బాయ్ ఫ్రెండ్ గా చేసుకుందాము అనుకుంటే అమ్మాయిలు ఇలాంటి చిన్న చిన్న వాటిని కూడా గమనిస్తారు.నోస్ హెయిర్ ని తొలగించడానికి ట్రిమ్మర్ ని వాడండి అంతే కానీ గట్టిగా లాగే ప్రయత్నం చెయ్యకండి, మీకు జీవితం లో ఎప్పుడూ అనుభవించని నెప్పి ని పొందాలి అనుకుంటే తప్ప.

.డేటింగ్ కి వెళ్ళే ముందు నోస్ హెయిర్ ని ట్రిం చేసుకోండి

.డేటింగ్ కి వెళ్ళే ముందు నోస్ హెయిర్ ని ట్రిం చేసుకోండి

ఏదోం కాస్త పెరిగాయి అనిపించచ్చు కానీ నన్ను నమ్మండి-మిమ్మల్ని కనుక బాయ్ ఫ్రెండ్ గా చేసుకుందాము అనుకుంటే అమ్మాయిలు ఇలాంటి చిన్న చిన్న వాటిని కూడా గమనిస్తారు.నోస్ హెయిర్ ని తొలగించడానికి ట్రిమ్మర్ ని వాడండి అంతే కానీ గట్టిగా లాగే ప్రయత్నం చెయ్యకండి, మీకు జీవితం లో ఎప్పుడూ అనుభవించని నెప్పి ని పొందాలి అనుకుంటే తప్ప.

మెడ మీద పెరిగిన రోమాలు...మీరు మౌంటెన్ మ్యాన్ కాదు కదా

మెడ మీద పెరిగిన రోమాలు...మీరు మౌంటెన్ మ్యాన్ కాదు కదా

మీ మెడ మీద పెరిగిన ఆ వికారమైన రోమాలని ఎందుకు షేవింగ్ చేసి తొలగించాలో వివరించాల్సిరావడం నిజంగా బాధాకరం.మెడ మీద పెరిగే రోమాలు చాలా అసహ్యకరంగా కనిపిస్తాయి.పైగా మీరు రివటలా అప్పుడే యుక్త వయసులోకి వస్తున్న పిల్లాడిలా కనపడతారు.అందువల్ల తప్పక ఆ రోమాలని తొలగించుకోవాలి. అలాగే మీ మెడ వెనుక వెంట్రుకలనిఈ మర్చిపోవద్దు.

బ్యాక్నే నిజం, దీనికి వెంటనే చికిత్స చెయ్యాలి

బ్యాక్నే నిజం, దీనికి వెంటనే చికిత్స చెయ్యాలి

వీపు మీద వచ్చే యాక్నే ని బ్యాక్నే అంటారు. ఇది వస్తే కనుక మీరు రోజూ వాడే సబ్బు కి బదులు టీ ట్రీ ఆయిల్ ఉన్న బాడీ వాష్ వాడండి.ఇలా తగ్గకపోతే వెంటనే చర్మ వ్యాధుల డాక్టర్ ని సంప్రదించండి.

ఎప్పుడూ మీ గడ్డాన్ని పొడిగా ఉన్నప్పుడే కత్తిరించండి

ఎప్పుడూ మీ గడ్డాన్ని పొడిగా ఉన్నప్పుడే కత్తిరించండి

జుట్టు తడిగా ఉన్నప్పుడు పొడుగ్గా ఉంటుంది.తడిగా ఉన్నప్పుడు ట్రిం చేస్తే ఆరిన తరువాత అది క్లోజ్ షేవ్ అవ్వదు.అందుచేత గడ్డాన్ని పొడిగా ఉన్నప్పుడే ట్రిం చెయ్యాలనడం సబబే కదా

మీ మొహం మీద సబ్బు వాడకాన్ని ఆపండి

మీ మొహం మీద సబ్బు వాడకాన్ని ఆపండి

మీ మొహాన్ని సబ్బు లేదా ఫేస్ వాష్ తో కడిగిన తరువాత బిగుతు గా లేదా పొరలు పొరలుగా అనిపిస్తే వెంటనే మీరు వాడే సబ్బు లేదా ఫెస్ వాష్ వాడకాన్ని ఆపెయ్యండి.చాలా కేసుల్లో సబ్బు వాడకం వల్లే ఇలా అవుతుంది.మీది కనుక సాధారణ చర్మం అయితే నార్మల్ ఫేస్ వాష్ కి మారండి.ఆయిలీ అయితే ఆయిలీ ఫేస్ వాష్ వాడండి.కాకపోతే రోజూ మీ మొహాన్ని మాయిశ్చరైజ్ చెయ్యడం మర్చిపోవద్దు.అబ్బాయిలం కదా అని మొహానికి మాయిశ్చరైజర్ వాడకం మానద్దు.అబ్బాయి అమ్మాయి సంబంధం లేదు దీనికి.చర్మం, దాని మీద స్వేద గ్రంధులు ఉన్న ప్రతీ ఒక్కరూ తమ మొహం కడుక్కుని మాయిశ్చరైజర్ రాసుకోవాలి.ఇదీ రూల్ అన్నమాట.

మొటిమ వస్తే కనుక గిల్లద్దు

మొటిమ వస్తే కనుక గిల్లద్దు

మొటిమ ని గిల్లి దానిలో ఉన్న దానిని బయటకి తీసెస్తే ఉన్న తృప్తి వేరు. కానీ చెయ్యద్దు. గిల్లడం వల్ల మొటిమ తగ్గాకా మచ్చ ఏర్పడుతుంది.మొటిమ ని గిల్లినప్పుడు దానిలో ఉన్న రశి చర్మం లో కి వెనక్కి వెళ్ళి మరింత హానికరమైన చర్మ ఇన్ ఫెక్షన్ లు వచ్చే అవకాశం ఉంది. ఇది మొటిమలకంటే మరింత జటిలమైన సమస్య.


English summary

10 Extremely Simple Grooming Tips That Will Definitely Make You Look More Attractive

Let’s face it—having a grooming routine is something most guys don’t give two hoots about—but that doesn’t diminish its importance. We can tell you ‘to be yourself’ and ‘be happy to be attractive’, but that won’t make the cut!