For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మగవాళ్లు ఫ్రెష్ లుక్ కోసం కంపల్సరీ అప్లై చేయాల్సిన ఫేస్ ప్యాక్..!

ఆడవాళ్ల కంటే మగవాళ్ల చర్మం 15 శాతం ఎక్కువ ఆయిలీగా ఉంటుంది. అలాగే ఎక్కువగా బయటతిరడం, రేజర్స్ ఉపయోగించడం వల్ల వాళ్ల చర్మం కాస్త రఫ్ గా, గరుకుగా ఉంటుంది.

By Swathi
|

మగవాళ్లు చర్మ సంరక్షణ నిర్లక్ష్యం చేస్తారు. కానీ ఫ్రెష్ గా కనిపించాలని ట్రై చేస్తుంటారు. తమ స్కిన్ ఎప్పుడైతే నిర్జీవంగా మారిపోయి ఉంటుందో అప్పుడు అలర్ట్ అవుతారు. చర్మ సంరక్షణపై కేర్ తీసుకోవాలని భావిస్తారు. అలానే మీరు కూడా భావిస్తే.. లెమన్ ఫేస్ ప్యాక్ ని ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే.

This Lemon Face Mask For Men Will Keep Dirt Off & Face Fresh, Try It!

ఆడవాళ్లు వేసుకునే ఫేస్ ప్యాక్స్ అబ్బాయిలు వేసుకోవడం వల్ల పెద్దగా ఫలితాన్ని పొందలేకపోవచ్చు. అదీకాక ఆడవాళ్ల కంటే మగవాళ్ల చర్మం 15 శాతం ఎక్కువ ఆయిలీగా ఉంటుంది. అలాగే ఎక్కువగా బయటతిరడం, రేజర్స్ ఉపయోగించడం వల్ల వాళ్ల చర్మం కాస్త రఫ్ గా, గరుకుగా మారి ఉంటుంది.

మగవాళ్ల ముఖంపై చర్మం చాలా మందంగా ఉండటం, సెన్సిటివ్ గా ఉండకపోవడం వల్ల మహిళలు ఉపయోగించే అన్ని పదార్థాలు ఉపయోగించరాదు. మగవాళ్లకు చాలా స్ట్రాంగ్ ఎక్స్ ఫోలియేటర్ అవసరమవుతుంది. ఇది స్కిన్ లేయర్ లోపలికి వెళ్లి దుమ్ము, ధూళిని తొలగిస్తుంది.

మ‌గ‌వాళ్ల ఫోర్‌హెడ్‌పై 5గీత‌లుంటే వందేళ్లు..! మరి గీతలే లేకపోతే ??మ‌గ‌వాళ్ల ఫోర్‌హెడ్‌పై 5గీత‌లుంటే వందేళ్లు..! మరి గీతలే లేకపోతే ??

ఇప్పుడు ట్రై చేయబోయే హెర్బల్ మాస్క్ చర్మంలో పేరుకున్న దుమ్ముని తొలగగిస్తుంది. చర్మాన్ని క్లెన్స్ చేస్తుంది. ఫ్రీరాడికల్స్ ని న్యూట్రలైజ్ చేస్తుంది. ఈ హెర్బల్ మాస్క్ లో ముఖ్యమైన పదార్థం నిమ్మరసం. ఇందులో విటమిన్ సి ఉంటుంది. ఇది కొల్లాజెన్ ని మెరుగుపరుస్తుంది, సిట్రిక్ యాసిడ్ చర్మ రంధ్రాలను సన్నగా మారుస్తుంది. పొటాషియం చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. స్కిన్ డ్యామేజ్ అవడానికి కారణమయ్యే ఫ్రీరాడికల్స్ కి వ్యతిరేకంగా పోరాడుతుంది.

స్టెప్ 1

స్టెప్ 1

ఒక కప్పు నీటిని వేడిచేయాలి. అందులో ఒక టేబుల్ స్పూన్ గ్రీన్ టీ ఆకులు వేయాలి. 5 నిమిషాలు సన్నని మంటపై వేడి చేయాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. గ్రీన్ టీలో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల యాక్నేకి కారణమయ్యే బ్యాక్టీరియాని నాశనం చేయడంతో పాటు, ముడతలను నివారిస్తుంది.

స్టెప్ 2

స్టెప్ 2

బాగా పండిన ఒక టమోటాను గుజ్జు చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇందులో ఉండే బీటా కెరోటిన్ చర్మంలో ట్యాన్ తొలగించి చర్మాన్ని బ్రైట్ గా మారుస్తుంది.

స్టెప్ 3

స్టెప్ 3

ఒక టేబుల్ స్పూన్ బరకగా పిండి చేసిన బియ్యం పిండి కలపాలి. పిండి బరకగా ఉంటే.. చర్మాన్ని ఎక్స్ ఫోలియేట్ చేయడానికి సహాయపడుతుంది. దీనివల్ల డెడ్ స్కిన్ లేయర్స్ తొలగిపోతాయి.

స్టెప్ 4

స్టెప్ 4

అర టీస్పూన్ నిమ్మరసంను ఈ మాస్క్ లో కలపాలి. ఫోర్క్ ఉపయోగించి.. అన్ని పదార్థాలను కలపాలి. బాగా పేస్ట్ చేసుకోవాలి.

స్టెప్ 5

స్టెప్ 5

ముందుగా చర్మానికి ఆవిరి పట్టుకోవాలి. ఇలా ఆవిరి పట్టుకోవడం వల్ల చర్మ రంధ్రాలు ఓపెన్ అవుతాయి. అప్పుడు మాస్క్ అప్లై చేయడం వల్ల చర్మ లేయర్స్ లోపలికి వెళ్తాయి.

స్టెప్ 6

స్టెప్ 6

చేతి వేలితో ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేయాలి. 15 నుంచి 30 నిమిషాలపాటు మాస్క్ ముఖంపైనే ఉండేలా జాగ్రత్తపడాలి.

స్టెప్ 7

స్టెప్ 7

చర్మం బిగుతుగా మారిన తర్వాత కొన్ని నీటిని ముఖంపై చిలకరించుకోవాలి. తర్వాత గుండ్రంగా స్క్రబ్ చేస్తూ.. శుభ్రం చేసుకుంటే.. చర్మంలోపల పేరుకున్న దుమ్ము తొలగిపోతుంది. 2నిమిషాలపాటు స్క్రబ్ చేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. తర్వాత చల్లటినీటితో కడుక్కోవాలి.

స్టెప్ 8

స్టెప్ 8

ముఖం శుభ్రం చేసుకున్న తర్వాత ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ ని చర్మానికి అప్లై చేయాలి.

English summary

This Lemon Face Mask For Men Will Keep Dirt Off & Face Fresh, Try It!

This Lemon Face Mask For Men Will Keep Dirt Off & Face Fresh, Try It. Grooming tips for men involve more than just using a soap and shaving cream!
Desktop Bottom Promotion