For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మెగాస్టార్ చిరంజీవి న్యూ లుక్ ట్రిక్ తెలిస్తే షాక్ అవుతారు...

|

చిరంజీవి సెకండ్ ఇన్సింగ్స్ ఫుల్ జోష్ లో ఉంది. రాజకీయాల తర్వాత తాను పూర్తిగా సినిమాలపై ఫోకస్ పెట్టిన విషయం మనందరికీ తెలిసిందే. అంతేకాదు కొన్ని నెలల క్రితం అభిమానుల కోసం సోషల్ మీడియాలో ఖాతాలను కూడా ఓపెన్ చేశాడు.

అంతేకాదు లాక్ డౌన్ సమయంలో అందరికీ సలహాలు, సూచనలు చెబుతూ కరోనా గురించి అందరికీ అవగాహన కల్పించారు. కల్పిస్తున్నారు కూడా. ఆ వీడియోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అవి బాగా వైరల్ అయిపోయాయి.

అంతేకాదు తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను, షూటింగులో తన మేకప్, అలాగే కొత్త సినిమాలో ఎలాంటి కొత్త లుక్ లో కనిపించబోతున్నాడో సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటున్నాడు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి గుండు లుక్(Urban Monk Look)లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు...

ఈ ఫొటోను మరియు మేకింగ్ వీడియోను మెగాస్టార్ ఇన్ స్టాగ్రామ్ లో అలా షేర్ చేయగానే.. అది కాస్త వైరల్ గా మారిపోయింది. చిరంజీవి ఏ సినిమా కోసం ఇలా కొత్త అవతారమెత్తాడు... మెగాస్టార్ 152వ సినిమా 'ఆచార్య' కోసమే ఇలా మీసాలు, గడ్డం లేకుండా.. అర్బన్ మాంక్ లుక్ లో కనిపించనున్నారా అనే విషయాలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈ విషయం గురించి చిరంజీవి తన గుండు లుక్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటో చెప్పి అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఈ సందర్భంగా అభిమానులు ఎంతగానో ఇష్టపడే చిరంజీవి పాపులర్ లుక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం...

నిజమైన రూపం..

నిజమైన రూపం..

ఇన్ స్టాగ్రామ్ లో గుండు లుక్ వీడియో షేర్ చేసిన చిరంజీవి ఇలా అన్నారు. ‘ఏ రూపాన్ని అయినా నిజమని నమ్మేలా చేసే ఇండస్ట్రీలోని టెక్నీషియన్లందరికీ ధన్యవాదాలు. మ్యాజిక్ ఆఫ్ సినిమాకు హ్యాట్సాఫ్' అన్నారు. అలా తన అర్బన్ మాంక్ లుక్ వెనుక ఉన్న అసలు రహస్యాన్ని బయటపెట్టేశారు. కానీ ఈ కొత్త అవతారం ఏ సినిమా కోసం అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.

న్యూ లుక్..

న్యూ లుక్..

ఇటీవలే సోషల్ మీడియాలో అకౌంట్లు ఓపెన్ చేసిన చిరు అతి కొద్ది కాలంలోనే ఫాలోయర్లను పెంచుకున్నాడు. ఇటీవలే ‘అమ్మ కోసం అమ్మ నేర్పిన వంట' అంటూ చేపల కర్రీ వీడియోను షేర్ చేస్తే, అది కాస్త బాగా వైరల్ అయ్యింది. తాజాగా మరో వీడియోను కూడా ఇన్ స్టాగ్రాములో షేర్ చేశాడు. ఇందులో ఇంతవరకు ఎప్పటికీ కనబడని లుక్ లో కనబడ్డాడు. తొలిసారి మీసాలు, గడ్డం లేకుండా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

మ్యాజిక్ చేశారు..

మ్యాజిక్ చేశారు..

సినిమాలో ఉండే మ్యాజిక్ ఎందరికీ కిక్ ఇస్తుంది. లేనిది ఉన్నట్టుగా.. ఉన్నది లేనట్టుగా చూపించడం సినిమాలకు చాలా సహజమైన విషయం. అందుకు తాజా ఉదాహరణ చిరంజీవి న్యూ లుక్. ఇటీవలే గుండు లుక్ లో ఉన్న వీడియోను షేర్ చేసి అభిమానులను ఆశ్చర్యపరచిన చిరంజీవి తన తర్వాతి చిత్రానికి సంబంధించిన లుక్ అని చెప్పేశాడు.

గుండు చేయించుకోలేదని..

గుండు చేయించుకోలేదని..

అయితే దీని గురించి మీడియాలో.. సోషల్ మీడియాలో చిరంజీవి నిజంగానే గుండు చేయించుకున్నారని.. ఏవో మొక్కులు తీర్చుకోవడానికి తలనీలాలు సమర్పించాడని ఏవేవో ప్రచారాలు జరిగాయి. దీంతో వాటికి పుల్ స్టాప్ పెట్టడానికి స్వయంగా చిరంజీవినే అర్బన్ మాక్ లుక్ మేకింగ్ వీడియోను షేర్ చేయడమే కాదు.. ఆ లుక్ కోసం కష్టపడిన టెక్నీషియన్లందరికీ దన్యవాదాలు తెలిపారు.

సైరాలో జులపాల జుట్టుతో..

సైరాలో జులపాల జుట్టుతో..

అంతకుముందు సైరా నరసింహరెడ్డి సినిమాలో జులపాల జుట్టుతో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆ సినిమా పోస్టర్ రిలీజ్ చేసిన సమయంలో కూడా అది బాగా వైరల్ అయ్యింది. అంతేకాదు ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది.

పాలిటిక్స్ లో ఉన్నప్పుడు..

పాలిటిక్స్ లో ఉన్నప్పుడు..

అయితే చిరంజీవి రాజకీయాల్లో ఉన్నప్పుడు చాలా సింపుల్ గా కనిపించేవాడు. ఎలాంటి స్టిల్స్ లేకుండా చాలా నిరాడంబరంగా ఉండేవాడు. కేవలం బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ తో సాధారణ హెయిర్ స్టైల్ తో కనిపించాడు.

రీ ఎంట్రీతో స్టైలిష్ గా...

రీ ఎంట్రీతో స్టైలిష్ గా...

అయితే రాజకీయాలకు ఎప్పుడైతే గుడ్ బై చెప్పి, సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడో.. అప్పటినుండి మళ్లీ తన న్యూ లుక్స్ తో అందరినీ అలరిస్తున్నారు. అంతేకాదు తన భాష, వేషంతో పాటు ఎన్నో మార్పులు చేశారు. అవన్నీ అభిమానులందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి కూడా..

English summary

Megastar Chiranjeevi Impressed Us With His New Look

Here we discussing about megastar chiranjeevi impressed us with his new look. Take a look