For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Rajుnikanth Birthday : స్టైలీష్ గా కనిపించాలంటే.. తలైవా స్టైల్ టిప్స్ ఫాలో అవ్వండి...!

|

దక్షిణాది సినిమా హీరోల్లో స్టైలీష్ గా కనిపించే హీరో అంటే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు రజనీకాంత్. తలైవా తెరపై స్టైల్ గా నటిస్తుంటే అభిమానులందరూ తనను పిచ్చగా ఫాలో అయ్యేవారు.

ఇప్పటికీ తనని ఆరాధ్య దైవంగా భావించే వారు చాలా మందే ఉన్నారు. ప్రతి సినిమాలోనూ ప్రత్యేకంగా కనిపించడం రజనీకాంత్ స్టైల్. వయసు మీద పడుతున్న కొద్దీ తనలో స్టైల్ పెరుగుతుందే తప్ప ఏ మాత్రం తగ్గడం లేదు. ఎందుకంటే స్టైల్ ల ఆయనకు ఆయనే సాటి.. ఆయనకెవరు లేరుపోటీ. సిగరెట్ గాల్లోకి ఎగరేసి సరిగ్గా నోట్లో పడేయడం.. దాన్ని అగ్గిపుల్లతో మరింత స్టైలీష్ గా వెలిగించుకోవడం లాంటి స్టైల్స్ అందరినీ తెగ ఆకట్టుకుంటాయి.

దక్షిణ భారతదేశంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత రజనీకాంత్ ఒక్కడికే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది. మరో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. రజనీకాంత్ కు మన దేశంలోనే కాదు.. విదేశాల్లో కూడా వీరాభిమానులు ఉన్నారు.

అందుకే చాలా మంది రజనీకాంత్ మాదిరిగా స్టైలీష్ గా కనిపించాలని ఆశిస్తుంటారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 12వ తేదీ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా తన స్టిల్స్ పై ఓ లుక్కేద్దాం.. అలాగే తన బర్త్ డే సందర్భంగా రజనీ ఫేమస్ స్టైల్స్ పై ఓ లుక్కేద్దాం.. అలాగే తన స్టైల్ కు సంబంధించిన కొన్ని చిట్కాలేంటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం...

తలైవా లుక్స్..

తలైవా లుక్స్..

‘పుట్టుకతో వచ్చింది.. చచ్చేదాకా పోదు' అని నరసింహ సినిమాలో రజనీ చెప్పినట్టు ఆయన స్టైల్ ఇప్పటికీ అలాగే చెక్కు చెదరకుండా ఉంది. అందుకే తను లుక్స్ కి సంబంధించి ఏదైనా ఇప్పటికీ మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. అంతేకాదు సినిమా సినిమాకీ తలైవా వయసు తగ్గుతున్నా ఇప్పటికీ తనకు అభిమానులు ఏ మాత్రం క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.

ఏడు పదుల వయసులో..

ఏడు పదుల వయసులో..

ఏడు పదుల వయసులోనూ తాను ఆరోగ్యంగా, చురుకుగా, ఉత్సాహంగా ఉండటానికి.. సినిమాల్లో స్టైలీష్ గా కనబడేందుకు కారణం ఏంటంటే.. తన మనసును అనునిత్యం ప్రశాంతంగా ఉంచుకోవడమేనని రజనీ చెబుతుంటారు.

బట్టతల కనబడకుండా..

బట్టతల కనబడకుండా..

సూపర్ స్టార్ రజనీకాంత్ బాబా సినిమాలో రౌడీ స్టార్ గా కనిపించారు. ఈ స్టైల్ లో బట్టతల కనబడకుండా కవరింగ్ చేసుకోవచ్చు. అంతేకాదు తలకు కట్టిన కలర్ ఫుల్ స్కార్ఫ్ మరియు ఫ్రెంచ్ కట్ లో గడ్డం పర్ ఫెక్ట్ రౌడీ లుక్ ను అందిస్తోంది.

సింపుల్ లుక్..

సింపుల్ లుక్..

రజనీకాంత్ స్టైలీష్ గానే కాదు.. సింపుల్ లుక్స్ లోనూ అందంగా.. హ్యాండ్సమ్ గా కనిపిస్తాడు. చంద్రముఖి సినిమాలో తను ఒక సైకాలజిస్టుగా చాలా సింపుల్ లుక్ లో కనిపిస్తాడు. ఇందులో క్లాస్ గా కనిపించే కళ్లద్దాలు, అందమైన బెల్ట్, జీన్స్ ప్యాంటులో కనిపించి స్టైలీష్ గా డీసెంట్ గా ఉన్నారు.

పడయప్పా స్టైల్..

పడయప్పా స్టైల్..

రజనీకాంత్ నరసింహ సినిమాలో తమిళనాడులో చాలా ఫేమస్ అయిన పడయప్పా అవతారంలో చాలా అందంగా కనిపించేవాడు. ఇందుకోసం మీరు మంచి జిబ్బా పైజమా వేసుకుని, భుజంపై పొడవాటి కండువా వేసుకుంటే మీరు కూడా తలైవా మాదిరిగా ట్రెడిషనల్ లుక్ తో అందంగా కనబడొచ్చు.

హాలీవుడ్ స్టైల్..

హాలీవుడ్ స్టైల్..

శివాజీ సినిమా రజనీకాంత్ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా మరింత ఇనుమడింపజేసింది. ఈ సినిమాలో రజనీ హెయిర్ స్టైల్ మరియు ఫేస్ మేకప్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇందులోని సిల్వర్ కలర్ హెయిర్ రజనీకి బాగా సెట్ అయ్యింది. మీరు కూడా నల్లగా కనిపిస్తుంటే.. మీరు ఇలాంటి హెయిర్ స్టైల్ సూట్ అవుతుందేమో ఒకసారి ట్రై చెయ్యండి.

వెరైటీ లుక్స్..

వెరైటీ లుక్స్..

రజనీకాంత్ ప్రతి సినిమాలో వెరైటీ లుక్ లో కనిపించడంలో అందరి కంటే ఒకడుగు ముందే ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. అదే శివాజీ సినిమాలో మరో లుక్ లో చాలా స్టైలీష్ గా కనిపించాడు. ఇందులో ఓ పాటలో ఎక్కువ గడ్డం, పొడవాటి జుట్టుతో పాటు సంప్రదాయ దుస్తుల్లో ఓ విభిన్న రూపంలో కనిపించి ప్రేక్షకులందరినీ ఆకర్షిస్తాడు.

రజనీకాంత్ పుట్టినరోజు ఎప్పుడు, ఎక్కడ జన్మించారు?

సూపర్ స్టార్ రజనీకాంత్ 1950 సంవత్సరంలో డిసెంబర్ 12వ తేదీన కర్నాటకలోని మైసూరు ప్రాంతంలో జన్మించారు. 2021లో 71వ పడిలోకి అడుగుపెట్టారు. రజనీకాంత్ అసలు పేరు శివాజీ రావు గైక్వాడ్. ఈయన తమిళ నాడు ఉత్తమ నటుడిగా కూడా ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు.

English summary

Rajinikanth Birthday : Follow these style tips from thalaiva

Here are these style tips from thaliva. Take a look