For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు యవ్వనంగా కనిపించేందుకు ఈ చిట్కాలను పాటించండి..

వృద్ధాప్యంతో పోరాడే విషయంలో దినచర్యను రూపొందించుకుని, దానిని అనుసరించడం చేయాలి.

|

వృద్ధాప్యం అనేది మన జీవితంలోని అత్యంత చేదు నిజం. జుట్టు తెల్లగా మారడంతో పాటు మీ ముఖంపై ముడతలు మరియు వయసు పెరుగుతున్నట్లు, లేదా మీ వయసు పెరిగినట్లు సూచించే అనేక సంకేతాలు కనబడతాయి.

Secret Anti-aging Rituals For Men To Look Younger

వయసు పెరిగి ముఖంపై ముడతలు, జుట్టు తెల్లగా మారడాన్ని ఎవ్వరూ జీర్ణించుకోలేరు. కాని ఇది అనివార్యం. అందుకే మీరు మీ వయసు కంటే 10 సంవత్సరాలు తక్కువగా కనిపించేందుకు ఈ చిట్కాలను పాటించండి.. మీరు కూడా హీరోల మాదిరిగా తయారు కండి.. అందరి కంటే యవ్వనంగా కనిపించండి. ఆనందంగా జీవించండి..

1) రోజుకు రెండుసార్లు ఫేస్ వాష్..

1) రోజుకు రెండుసార్లు ఫేస్ వాష్..

వృద్ధాప్యంతో పోరాడే విషయంలో దినచర్యను రూపొందించుకుని, దానిని అనుసరించడం చేయాలి. అంతేకాదు దానికి కట్టుబడి ఉండటం చాలా ముఖ్యం. మంచి ఫేష్ వాష్ తో రోజుకు రెండుసార్లు ముఖాన్ని కడగండి. ఇది చర్మాన్ని శుభ్రంగా ఉంచుతుంది. మీ ముఖంపై ఉన్న గీతలను తగ్గిస్తుంది. మీ చర్మంప్రకారం మంచి ఫేస్ వాష్ ను ఎంచుకోండి.

2) సన్ స్క్రీన్ ను వాడండి..

2) సన్ స్క్రీన్ ను వాడండి..

అధికంగా సూర్యరశ్మి రావడం వల్ల పరిపక్వ చర్మం వృద్ధాప్యం, మచ్చలు మరియు చర్మ క్యాన్సర్ వంటి సమస్యలకు దారి తీస్తుంది. వృద్ధాప్య ప్రక్రియ సూర్యరశ్మి కారణంగా మొదలవుతుంది. ఎందుకంటే అవి కొల్లాజెన్ ను విచ్ఛిన్నం చేస్తాయి. అలాగే కొత్త కణాలు పెరగకుండా నిరోధిస్తాయి. దీన్ని నివారించడానికి సులభమైన మార్గం సన్ స్క్రీన్. కనీసం SPF 20 లేదా అంతకంటే ఎక్కువ సన్ స్క్రీన్ ను వాడండి.

3) బట్టలపై శ్రద్ధ వహించండి..

3) బట్టలపై శ్రద్ధ వహించండి..

వదులుగా ఉండే బట్టలు ధరించడం మానుకోండి. అలాగే మీకు సరిపోని బట్టలను అస్సలు ధరించవద్దు. మీ వ్యక్తిత్వాన్ని పెంచే షర్ట్స్ ను కొనండి. వాటినే వేసుకోండి. మీరు ఎక్కువ బరువు ఉంటే మీ బట్టలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మీరు మీ కొవ్వును వదులుగా ఉన్న బట్టలతో దాచి పెట్టాలనుకుంటే అది మీరు చేసే పెద్ద తప్పు అవుతుంది. ఇది మిమ్మల్ని ఓల్డ్ గా కనిపించేలా చేస్తుంది. అందుకే అందంగా మరియు స్మార్ట్ గా కనిపించేందుకు బిగువైన బట్టలు ధరించడం చాలా ముఖ్యం.

4) చక్కెరను తగ్గించండి..

4) చక్కెరను తగ్గించండి..

ఎక్కువ చక్కెరను తినడం వల్ల చర్మంపై ముడతలు రావడం మొదలవుతుంది. సోడా, మిఠాయి, డజర్ట్స్ ముఖ్యంగా చక్కెర ఎక్కువగా ఉన్న ఆహారాలను దూరంగా ఉండండి. వీటితో పాటు రసాలు, ప్రోటీన్ బార్లు, ధాన్యాలు మొదలైన వాటితో తయారు చేసిన వాటిలో చక్కెర శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు యవ్వనంగా కనిపించేందుకు ఇలాంటివి తగ్గించుకోండి.

5) చర్మ సంరక్షణ..

5) చర్మ సంరక్షణ..

మీ చర్మ సంరక్షణ కోసం ఎలాంటి క్రీమ్ లను ఉపయోగించొద్దు. మీ చర్మాన్ని శుభ్రపరచడం, ఎక్స్ ఫోలియేటింగ్, హైడ్రేటింగ్ మరియు చర్మ రక్షణకు సంబంధించిన దినచర్యను అనుసరించండి. పురుషుల చర్మం మహిళల చర్మం కంటే భిన్నంగా ఉంటుంది. కాబట్టి మీరు మీ చర్మ సమస్యలను అర్థం చేసుకోవాలి. మహిళల చర్మ సంరక్షణ ఉత్పత్తులను అస్సలు ఉపయోగించొద్దు. మీ ముఖం నుండి తేమ చెక్కు చెదరకుండా ఉండటానికి గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడగాలి.

6) నిద్ర, వ్యాయామం, ఆహారం..

6) నిద్ర, వ్యాయామం, ఆహారం..

నిద్ర, వ్యాయామం మరియు ఆహారం ఈ మూడు విషయాలు మీ చర్మం మరియు ఆరోగ్యాన్ని బాగా మెరుగుపరుస్తాయి. సరైన సమయానికి నిద్ర లేవకపోవడం లేదా సరైన సమయానికి నిద్ర పోకపోవడం, వ్యాయామం లేకపోవడం మరియు తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల మీ ముఖంలో వృద్ధాప్య ఛాయలు చాలా వేగంగా వచ్చేస్తాయి. అందుకే మనం తినే ఆహారం మరియు తాగే ప్రతిదీ మన శరీరంలో కనిపిస్తుంది. తప్పుడు జీవనశైలి మీ ఆరోగ్యానికి నష్టకరమని రుజువు చేస్తుంది. మద్యం సేవించడం మరియు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత జిడ్డుగల ఆహారం తినడం వల్ల మీరు త్వరగా వృద్ధాప్యం పొందవచ్చు. అందుకే వీలైనంత మేరకు వీటిని తగ్గించండి.

English summary

Secret Anti-aging Rituals For Men To Look Younger

Aging is an inevitable part of life. So, here are some tips for all the men out there who wish to look 10 years younger than their actual age
Desktop Bottom Promotion