For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అందరిలో కంటే మీరే స్పెషల్ గా అట్రాక్టివ్ గా కనబడాలనుకుంటున్నారా

|

ఫ్యాషన్ ఎప్పుడైనా మారవచ్చు కాని శైలి ఎప్పుడూ మారదు. అంటే అదే శైలి కొనసాగుతుంది. మీ చుట్టుపక్కల వారు మీ ఆకారాన్ని ఏ చిన్నపాటి మార్పును కూడా గమనించవచ్చు. మీరు మొదటిసారి ఎవరినైనా కలవబోతున్నట్లైతే మీ ఆకర్షణీయమైన అలంకరణ చాలా ముఖ్యం. వారు మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడు, వారు మీరు ధరించిన డ్రెస్సింగ్ స్టైల్ చూసి మిమ్మల్ని అంచనా వేస్తారు. అంటే మీరు మీ మీరు ధరించే దుస్తులపై చాలా దృష్టి పెట్టాలి.

అందం అనేది ధరించే దుస్తులను బట్టి నిర్ణయించే విషయం కానప్పటికీ, మీ వ్యక్తిత్వాన్ని నిర్ణయించడానికి ఇతరులు ఉపయోగించే ఏకైక ఆయుధం మీ దుస్తులు మాత్రమే. కాబట్టి వ్యక్తిత్వంగా మిమ్మల్ని మీరు మార్చుకొనడానికి సహాయపడటానికి కొన్ని ప్రాథమిక చిట్కాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఇవి మిమ్మల్ని ఈ ట్రెండ్ కు తగ్గట్లు సరికొత్తగా, అందంగా మరియు ఆకర్షణీయంగా కనిపించడానికి మీకు సహాయం చేస్తాయి.

ఫార్మల్ షర్ట్

ఫార్మల్ షర్ట్

ఫార్మల్ షర్ట్స్, ముఖ్యంగా తెల్ల చొక్కాల విషయంలో దానికి సూట్ అయ్యే ప్యాంట్స్ లోకి మాత్రమే ధరించాలి. అంటే మీరు అందులో స్టైలిష్ గా కనబడాలంటే మీరు అటువంటి ఫార్మల్ షర్ట్స్ ను ఎట్టి పరిస్థితిలో జీన్ లేదా ఇతర నార్మల్ ఫ్యాంట్స్ తో ఇన్ షర్ట్ లేదా అన్ టక్ చేయకండి. మీర చాలా సాధారణంగా కనబడుతుంటే టైటర్ ఫిట్ కలర్ షర్ట్ ను ఎంచుకోండి.

సాక్సులు ధరించకపోవడం

సాక్సులు ధరించకపోవడం

బీచ్ షూలు మరియు చెప్పులకు మాత్రమే సాక్సులు ధరించరు. పగటి పూట కాళ్ళలో చెమట పట్టడం షూలోకి చేరుతుంది, తర్వాత షూ డ్యామేజ్ అవ్వడంతో పాటు షూ నుండి దుర్వాసన రావడానికి కారణం అవుతుంది. మీకు అప్పర్ పార్ట్ లో షాక్సులు కనబడకూడదనుకుంటే నో షో సాక్సులు ఎంచుకోండి. అలాంటివి మీ పాదాలను కవర్ చేస్తాయి. కానీ మడిమలపైకి కనబడనివ్వవు.

షర్ట్ పొడవు

షర్ట్ పొడవు

క్యాషువల్ షర్ట్స్ అందరికి ఏ కార్యక్రమానికైనా మంచి ఎంపిక. శరీరంలో కొన్ని సమస్యాత్మక ప్రదేశాలను కవర్ చేయడానికి చాలా మంది పురుషులు డ్రెష్ షర్ట్ ను క్యాసువల్స్ గా ఎంపిక చేసుకుంటారు. అయితే డ్రెస్ షర్ట్ ను టక్ చేయడానికి మాత్రమే డిజైన్ చేయబడి ఉంటాయి. అందుకే అవి చాలా పొడవుగా ఉంటాయి. కాబట్టి, మీ అలంకరణ చూడటానికి బిలో ఫార్మల్ గా ఉండాలంటే, షాటర్ షర్ట్స్ ను ఎంపిక చేసుకోండి. అందకు ఒక మెయిన్ రూల్ ఉంది. షర్ట్టైల్స్ మరీ పొడవుగా చేతి మనికట్టుకుమంచి ఉండకూడదు లేదా ప్యాంట్ జోబు కంటే పొడవు తక్కువగా ఉండాలి.

వాచ్

వాచ్

కొంతమంది పురుషులు ఒకేసారి అన్ని రకాల అలంకరణలను(ఫ్యాషన్ బ్యాండ్స్, బ్రాస్లెట్ , ఇతర బ్యాండ్లు) ధరిస్తారు మరియు వాటి ద్వారా వారి అభిరుచిని వ్యక్తం పరుస్తారు. వాచ్, తాడు, బ్రాస్లెట్, బెల్ట్ మరియు కాలర్ పిన్స్ మొదలైనవి ధరించడం ఫ్యాషన్ వ్యక్తీకరించడానికి మాత్రమే, ఇవి చేతిలో ఓవర్ గా కనబడుతాయి. అవన్నీ మీ అందాన్ని తగ్గిస్తాయి. కాబట్టి మీ అందాన్నిపెంచే ఒకటి లేదా రెండు ఉపకరణాలు మాత్రమే ధరించడం తప్పనిసరి.

జీన్స్

జీన్స్

దుస్తులలో ముఖ్యమైన వాటిలో ఒకటి మీరు ధరించే జీన్స్. కాబట్టి మీరు ధరించే జీన్స్ మీ శరీరానికి ఎప్పుడూ సరిపోయేలా ఉండాలి. మీరు చాలా సన్నగా లేదా చాలా పెద్దదిగా ఉంటే, మీరు పెద్ద జీన్స్ కొనడం వల్ల ప్రయోజనం ఉండదు మరియు అది మీ ఆకారాన్ని పూర్తిగా కప్పి ఉంచుతుంది, కాబట్టి మీ శరీరానికి సరిపోయే జీన్స్ ప్యాంట్ సైజ్ ను ఎంపిక చేసి ధరించండి.

అండర్వేర్స్

అండర్వేర్స్

మీ చొక్కా లోపల మరొక టీ షర్టు ధరించడం అంటే చొక్కాలు మరకలు పడకుండా ఉండటానికి మరియు చెమట మరకలు బయటకు కనబడకుండా ఉండటానికి లోపల చొక్కాలు ధరించకండి, మరీ అవి బయటకు కనబడేలా ధరించడం వల్ల పైన ఉన్న షర్ట్ అందం తగ్గించేస్తుంది. కాబట్టి మీరు ధరించే లోదుస్తులు స్పష్టంగా మరియు మీ పై చొక్కాకు తగినట్లుగా ఉండాలి. కాబట్టి ఎల్లప్పుడూ మీ బట్టలపై దృష్టి పెట్టండి మరియు ఇతరులను ఆకర్షించండి.

English summary

Wardrobe Mistakes that Haunting Men

Fashion changes all the time but it’s the style that stays. People notice even the smallest details in one’s appearance, especially when meeting them for the first time. there’s no universal rule on how to “look good” but there are some basic tips that can make men look more trendy and appealing.
Story first published: Saturday, September 28, 2019, 15:20 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more