For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ అందానికి తూట్లు పొడుస్తున్నది ఎవరు..?

|

Modern Youth believing Advertisements
ప్రకృతి నియమాలకు పూర్తి వ్యతిరేకమైన జీవన విధానాలకు నేటి ఆధునిక మనిషి అలవాటు పడిపోయాడు. వికృత పోకడలను అనుసరిస్తున్న నేటి 'మోడ్రన్ యువత ' వారి సౌందర్యానికి వారే అవరోధంగా నిలుస్తున్నారు.

కృత్రిమ సౌందర్య సాధనాలవైపు మొగ్గు చూపి ముఖ వర్చస్సును కళా విహీనం చేసుకుంటున్నారు. రసాయనాలతో తయారవుతున్న కృత్రిమ సౌందర్య సాధనాలు ముఖ కాంతిని దెబ్బతీయంటంతో పాటు చర్మవ్యాధులకు దారితీస్తున్నాయి.

మా ప్రుడక్ట్ స్వల్ప వ్యవధిలోనే మీ అందాన్ని రెట్టింపు చేస్తుందంటూ పలు సంస్థలు గుప్పిస్తున్న ప్రకటనలను నమ్మి మోసపోతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. 'సొమ్ము పోయే.. అందము పాయే' అన్న రీతిలో కృత్రిమ సౌందర్యం కోసం ఆరాటపడి అసలకే ఎసరు తెచ్చుకుంటున్నారు.

'అందం' కోసం ఆరాటపడి మొదటికే మోసం తెచ్చుకోవద్దంటూ వైద్యులు హెచ్చరిస్తున్నారు. సహజసిద్ధమైన సౌందర్య విధానాలను అనుసరిస్తూ ప్రకృతిలోని సారన్ని ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు.

కేవలం ఐదు వారాల్లోనే మీ ముఖ కాంతి రెట్టింపవుతుందటు ఓ సంస్థ గుప్పించిన వాణిజ్య ప్రకటనను నమ్మిన రాజు (పేరు మార్చబడింది) నిలువునా బలయ్యాడు. వందల్లో డబ్బు వెచ్చించి సౌందర్య ఉత్పత్తులను కోనుగోలు చేసిన రాజును 'సైడ్ ఎఫెక్ట్స్' చుట్టుముట్టాయి. నున్నగా ఉండే రాజు ముఖం పై నల్లటి మచ్చలతో కూడిన గుంటలు వ్యాప్తి చెందాయి. సౌందర్యం కో్సం అతిగా ఆరాటపడిన తనకు తగిన శాస్తే జరిగిదంటూ ప్రకృతి వైద్యాన్ని ఆశ్రయించాడు.

English summary

Modern Youth believing Advertisements | మీ అందానికి తూట్లు పొడుస్తున్నది ఎవరు..?

Believing commercial advertisements by the modern youth and using fairness products to improve their face beauty.
Story first published:Monday, October 31, 2011, 10:09 [IST]
Desktop Bottom Promotion