For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మందమైన వెలుగుల్లో మత్తెక్కించే మగువలు!

By B N Sharma
|

Pale Makeup Tips For The 'Twilight' Look!
ఆధునిక మేకప్ తీరుల్లో మహిళలు తెల్లగా వుండే కంటే మందమైన వెలుగుల్లో... పాలిపోయిన తెలుపుగా (పేల్ కలర్), వేంపైర్ లా కనపడటం ఫ్యాషన్ సంతరించుకుంది. చీకటిలో మిణుగురు పురుగులా మెరిసి పోవాలనేదే ఈ వేంపైర్ లుక్ ధ్యేయంగా వుంటుంది. మిణుగురు పురుగు మెరుపులో గ్లామర్ అధికం. పేల్ మేకప్ చేసుకోవాలంటే, మంచి కన్సీలర్ కావాలి. ఇది ముఖంపై గల మేకప్ ను ఆర్టిఫీషియల్ గాచూపదు. అలాగే కన్సీలర్ అనేది ముఖం చర్మపై గల మచ్చలు కప్పేస్తుంది.

ఫౌండేషన్ అధికంగా వేసేకంటే, ముఖ వర్చస్సు అధికం చేయాలి. సన్ క్రీమ్ రాయకుండా ఎండలోకి వెళ్ళకండి. సన్ క్రీమ్ రాసి దానిపై పెరల్ పౌడర్ వేస్తే బాగుంటుంది. పెరల్ పౌడర్ మీ చర్మాని కవసరమైన మెరుపునిస్తుంది. పేల్ గా కనపడాలనుకుంటున్నారు కాబట్టి బుగ్గలకు ఎరుపు రంగు వేయకండి.

రక్త పిశాచి (వేంపైర్) రక్తం లేకుండా తెల్లగా పాలిపోయి వుంటుంది. కనుక ఈ రంగు వాడవద్దు.మీ ముఖంలోని రక్తం లేదా ఎరుపు అంతా కూడా పెదవులలో చూపాలి. పెదవులకు లైట్ రెడ్ వేయండి. శాఖాహార పిశాచిలా కనపడండి. పేల్ మేకప్ లో కళ్ళు ప్రధానం. ఈ అసాధారణ ముఖ వర్చస్సులో కళ్ళు బాగా కనపడాలి. దానికిగాను జెట్ బ్లాక్ మస్కారా కనురెప్పలకు వాడండి. లైనింగ్ అధికంగా చేయకండి. సన్నని పెన్సిల్ తో కనుబొమ్మలు లైట్ బ్లాక్ వేయండి. ఇక మసక చీకట్లలో మత్తెక్కించే పిశాచంలా స్టైల్ గా తిరగండి.

English summary

Pale Makeup Tips For The 'Twilight' Look! | మందమైన వెలుగుల్లో మత్తెక్కించే మగువలు!

A good concealer would be the first step to doing pale makeup. As opposed to a foundation, a concealer does not put a layer of artificial makeup on your face. It will hide all the human flaws in your skin.Vampires have clear skin; no pimples, rashes or dark spots. So you need to cover up any flaws in your skin with a suitable concealer first.
Story first published:Saturday, December 3, 2011, 12:03 [IST]
Desktop Bottom Promotion