For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వయస్సుతో ముడిపెట్టలేని అందచందాలు...!

|

6 Skin Care Tips for Glowing Skin
స్త్రీ కి అందం మించినది మరొకటి లేదు. అందుకే మహిళలు అందానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తుంటారు. అయితే అందం అనేది ఏ ఒక్కరి సొంతం కాదు. అందాన్ని మనం కావల్సిన రీతిలో మనమే తీర్చిదిద్దుకోవచ్చు. సమయానికి పోషకాహారం తీసుకోవడంతో పాటు, కొన్ని సౌందర్యచిట్కాలను పాటిస్తే వయస్సు పెరిగినప్పటికీ తరగని అందం మన సొంతమవుతుందంటున్నారు సౌందర్యనిపుణులు. ఎలాంటి అందానైనా ఎక్కువ కాలం కాపాడుకోవడానికి ఇంటిలోనే కొంత సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. అలా చేస్తే కళ్లు తిప్పుకోలేని అందం మీ సొంతం అవుతుందనడంలో సందేహం లేదంటున్నారు బ్యూటీ ఎక్స్‌పర్ట్స్.

అందంలో ముఖ్య పాత్రను పోషించేది చర్మం. వయస్సుని తొందరగా గుర్తు పట్టేలా చేసేది చర్మం. చర్మపు ముడుతలవల్లే నిగారింపు, యవ్వనం, అందం మటు మాయమౌతాయి. వయస్సుతో సంబంధం లేకుండా కేవలం తగిన జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్లే ఇలా జరుగుతుంటుంది. కొంతమందిని కొన్ని సందర్భాల్లో చూసి వాళ్ళు అమ్మ, కూతుళ్ళా లేకా అక్కా చెల్లెళ్ళా అని అనుకుంటారు. దానికి కారణం అందానికి తగినటువంటి కేర్‌ తీసుకోవడమే. ఆ జాగ్రత్తలు మీరు తీసుకుంటే మీరూ అందంగా...ఆకర్షనీయంగా కనిపిస్తుంటారు.

1. పచ్చటి పైనాపిల్‌ జ్యూస్‌ను, ఆపిల్‌ జ్యూస్‌ ను తీ సుకోవాలి. మొదట పైనాపిల్‌ జ్యూస్‌ ను తీసుకొని ఫేస్‌ కు అప్లయ్‌ చేయాలి. తర్వాత ఆపిల్‌ జ్యూస్‌ అప్లయ్‌ చేసి పావుగంట ఉంచి కడగితే చర్మం పై ముడుతలు, పగుళ్ళు మటుమాయం అవుతాయి.
2. ముఖం మీద ముడుతలున్నవారు, గింజలు లేని ద్రాక్షను తీసుకొని రెండు భాగాలుగా చేసి వాటిని వేళ్ళతో నలిపి ముడుతలు ఉన్న చోట రాయాలి. ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటిలో ముఖాన్ని కడిగి, బాగా గాలికి ఆరనిచ్చి తర్వాత మార్పును ఇట్టే గుర్తించవచ్చు.
3. కొన్ని రకాల మచ్చలు, గుంటలు ప్లాస్టిక్ సర్జరీ ద్వారా పోగొట్టుకోవచ్చు. అయితే ప్లాస్టిక్ సర్జరీకి ఖర్చు ఎక్కువ కాబట్టి ఇంట్లో వస్తువులను ప్రయత్నించి చూడండి..నిమ్మరసం, బార్లీ పిండి, మినపపిండి కలిపి రాసుకుంటే మచ్చులు, గుంటలు తగ్గుతాయి.
4. కొత్తిమీర, పుదీనా మెత్తగా నూరి చర్మానికి రాస్తే నల్లమచ్చలు పోతాయి. అలాగే తేనె, నిమ్మరసం సమపాళ్ళల్లో తీసుకొని బాగా మిక్స్ చేసి చర్మంపై మచ్చలు, గుంటలు తగ్గుతాయి.
5. కోడిగుడ్డు తెల్లసొన, ఆలివ్‌ ఆయిల్‌ కలిపి ముఖానికి రాసి పూర్తిగా ఆరిపోయిన తరువాత గోరువెచ్చని నీళ్లలో దూది ముంచి నెమ్మదిగా కడుక్కొంటే ముఖం నునుపుదేలుతుంది.
6. బంగాళదుంప ఉడికించి తొక్కు తీసి పాలతోగాని, పుల్లటి పెరుగుతో గాని ముఖానికి పట్టించి పావుగంట తరువాత కడిగేసుకుంటే ముడతలు, మచ్చలు మటుమాయమవుతాయి.

English summary

6 Skin Care Tips for Glowing Skin...! | ముఖంలో గులాబీ మెరుపులు...!


 Beautiful glowing smooth skin is desirable by every woman and appreciated by every man. Genetically, we are wired to be attracted to people with clear skin and a glowing complexion because it's a sign of good health. Here are some tips that will slow down Vata accumulation in the body and will help you stay young and keep your skin beautiful.
Story first published:Tuesday, May 15, 2012, 12:00 [IST]
Desktop Bottom Promotion