For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పురుషుల సౌందర్యాన్ని పాడు చేసే 8 చెడు అలవాట్లు...!

|

సౌందర్యం అనేది ఒక్క మహిళలకు మాత్రమే కాదు. మగవారు కూడా తమ సౌందర్యాన్ని ఆహార్యాన్ని కాపాడుకోగల శక్తిని కలిగి ఉన్నారు. సాధారణంగా మేల్ నటులు, సెలబ్రెటీలు మాత్రమే మేకప్ వేసుకొంటారు అనేది వాస్తవమే అయినా.. సాధారణ వ్యక్తులు కూడా తమ సౌందర్యం పెంపొందించుకోవడానికి మేకప్ వేసుకోవచ్చు. చాలా మంది మేకప్పా అని సిగ్గుపడుతారు లేదా మగవారేంటీ.... మేకప్ ఏంటీ అని వెక్కిరిస్తుంటారు. అయితే ప్రస్తుత కాలంలో మహిళలకు ధీటుగా పురుషులు కూడా అందంగా కనబడటానికి కొన్ని కొన్ని మేకప్ చిట్కాలను ఉపయోగిస్తుంటారు. వారు అందంగా కనబడటం కోసం కొన్ని రకాల ఫేయిర్ నెస్ క్రీమును కూడా కొంటుంటారు. అందుకు వారు ఎంత మాత్రం సిగ్గుపడరు. ఈ మాడ్రెన్ యుగంలో కొంత మంది పురుషులు ఫేషియల్స్ మరియు వాక్సింగ్ తో ఉదరభాగంలో నున్న హెయిర్ ను తొలగించుకోవడం వంటి వాటిని కూడా చేయడం మొదలు పెట్టారు. అందరిలో తామూ అందంగా కనబడేందుకు ఇష్టపడుతున్నారు.

చర్మ సౌందర్యాన్ని అందంగా తీర్చిదిద్దుకోవడం ఇంకెంత మాత్రమూ ఆడవాళ్ళకు పరిమితమైన విషయం కాదు. మగవాళ్ళు కూడా ఇప్పుడు మహిళలతో సమానంగా తమను తాము తీర్చిదిద్దుకోవడం మీద శ్రద్ద తీసుకుంటున్నారు. చక్కగా కనిపించడానికి అవసరమైన వివిధ విషయాల మీద వారు దృష్టి పెడుతున్నారు. సాధారణంగా మనం కొన్ని అలవాట్లకు వ్యసనపరులై ఉంటాం. వాటిని మానుకోవడం కూడా చాలా ఇబ్బందిగా ఫీలవుతుంటారు. అయితే వాటిలో కొన్ని హానికలిగించేవి కాకపోయినా వాటిని ఉపయోగించడం మంచిది కాదు. వీటివల్ల మీకు తెలియకుండానే మీ ఆహారపు అలవాట్లు మీ అందాన్ని మార్చేస్తుంది. దీని కోసం మగవాళ్ళు సులభంగా పాటించడానికి వీలైన, సాధారణమైన కొన్ని చిట్కాలు...

పురుషుల సౌందర్యాన్ని పాడు చేసే చెడు అలవాట్లు..!

నిద్ర పోయేటప్పుడు సరైన పొజీషన్ లో పడుకోకుంటే ఒత్తిడికి గురికావల్సి ఉంటుంది. దాంతో పాటు ముఖంలో ముడుతలు ఏర్పడుతాయి. పడుకోనేటప్పుడు బోర్లాపడుకోవడం వల్ల కడుపు లోనికి వత్తిబడుతుంది. ముఖం కూడా దిండుకు నెట్టడం వల్ల ముఖంలో రూపు మార్పలు చాలా ఏర్పడుతాయి. దాంతో ముఖంలో ముడతులు ఏర్పడటానికి అవకాశం ఉంది. మగవారు చర్మ సంరక్షణలో భాగంగా నిద్రపోయే ముందు మాయిశ్చరైజర్ ఉపయోగించకూడదు. ముఖం పొడిభారీ, కఠినమైన చర్మం ఉన్నప్పుడు స్నానానికి అరగంట ముందు మాయిశ్చరైజర్ రాసుకోవాలి.

పురుషుల సౌందర్యాన్ని పాడు చేసే చెడు అలవాట్లు..!

శీతాకాలంలో మగవారి చర్మం అతి త్వరగా ముడతలు ఏర్పడటానికి, పొడిబారడానికి, వృద్యాప్య ఛాయలు ఏర్పడటానికి సోప్స్ ప్రధాన కారణం. ఒక వేళ సోపులను ఉపయోగించిన తర్వాత ఫేస్ క్రీములను అప్లై చేసినా కూడా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే సోప్స్ ఉపయోగించిన తర్వాత చర్మంలోనికి మాయిశ్చరైజ్ కాబడి ఉంటుంది కాబట్టి. అయితే మంచి ముఖ అందానికి ప్రస్తుతం మార్కెట్లో ఫేస్ వాష్ లు, బాడీ వాష్ లో(nivea, old spice, gillette, ఇంకా.. కొన్ని) అందుబాటులో ఉన్నాయి. వాటిని ఉపయోగించడం మంచిది.

పురుషుల సౌందర్యాన్ని పాడు చేసే చెడు అలవాట్లు..!

ఈ విషయాన్ని లక్షల సార్లు వినే ఉంటారు. పొగ తాగేవారు పూర్తిగా విడిచి పెట్టడం వల్ల మంచి ఆరోగ్యంతో పాటు అందం కూడా మీ సొంతం అవుతుంది. పొగత్రాగడం మానకపోతే క్యాన్సర్, బ్యాక్ పెయిన్, నపుంసకత్వం వంటి అనారోగ్యాలే కాకుండా అందవిహీనంగాను మార్చుతుంది. అంతే కాదు ముఖంలో ముడతలు, వృధ్యాప్య ఛాయలు అతిత్వరగా ఏర్పడుతాయి. నోటి దుర్వాసన. వీటన్నింటి నుండి బయటపడాలనుకుంటే తప్పనిసరిగా పొగత్రాగటం ఆపేయాలి.

పురుషుల సౌందర్యాన్ని పాడు చేసే చెడు అలవాట్లు..!

సైంటిఫిక్ పరిశోధనల సైన్స్ జర్నల్ లో ఇలా రాసింది. మన కూర్చునే టాయిలెట్ల సీట్లకంటే మొబైల్ ఫోన్లు అనారోగ్యకరమైనవని. ఎందుకంటే మొబైల్ ఫోన్లను సాధారణంగా ఎప్పుడూ చేతుల్లో పెట్టుకొని, చేతులు మారుస్తుంటాం. తర్వాత రెస్టారెంట్ టేబుల్స్, పబ్లిక్ బాత్ రూమ్ టేబుల్స్ మీద, ఇతరు చేతుల్లోనికి, కార్లో ఇలా ఒక్క చోట కాదు అనేక చోట్ల పెట్టి. తిరిగి వాటిని మనం ఉపయోగిస్తుంటాం. ఫోన్ ఉపయోగించే ముందు ఎవరైనా క్లీన్ చేస్తారా? దాంతో మనం మాట్లాడే ప్రతి సారి బ్యాక్టీరియా ముఖం మీద చేరి అనారోగ్యానికి గురిచేస్తుంది. దాంతో ముఖం మీద, మొటిమలు, మచ్చలు, చర్మం అలర్జీకి గురవౌతుంది. కాబట్టి మొబైల్ ఫోన్లకు యాంటీ బ్యాక్టీరియల్ కవర్లు ఉపయోగించాలి. ఎక్కపడితే అక్కడ పెట్టకుండా జాగ్రత్త తీసుకోవాలి.

పురుషుల సౌందర్యాన్ని పాడు చేసే చెడు అలవాట్లు..!

మెన్స్ హెయిర్ కేర్ సరీగా తీసుకోకపోతే అతి త్వరగా చుండ్రు ఏర్పడే ప్రమాదం ఉంది. చుండ్రు వల్ల తలలో దురుద, దాంతో ముఖం మీద పొట్టపొట్టుగా రాలడం వల్ల మొటిమలు, మచ్చలు, స్కిన్ అలర్జీ ఏర్పడి అందవిహీనంగా మార్చుతాయి. కాబట్టి చుండ్రులేకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. తలలో రుద్దుకొని తిరిగి అదే చేత్తో ముఖం టచ్ చేయకుండా జాగ్రత్తతీసుకోవాలి. చుండ్రులేకుండా డాండ్రఫ్ షాంపూలను వాడటమే కాకుండా సరైన ట్రీట్ మెంట్ కూడా తీసుకోవాలి.

పురుషుల సౌందర్యాన్ని పాడు చేసే చెడు అలవాట్లు..!

సూర్య రశ్మి ఆడవారి చర్మాన్ని మాత్రమే ప్రభావితం చేయవు. మగవారి చర్మాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. దాంతో చర్మ క్యాన్సర్ ఇతర సైడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంది. అందువల్ల బయటకు వెళ్లడానికి అరగంట ముందు సన్ స్క్రీన్ లోషన్ రాయడం అప్లై చేయాలి. ఇది చర్మ సంరక్షించడానికి మరియు ముడతుల బారీన పడకుండా చేస్తుంది.

పురుషుల సౌందర్యాన్ని పాడు చేసే చెడు అలవాట్లు..!

ముఖం మీద ఉన్న నిర్జీవమైన చర్మాన్ని పోగొట్టడానికి క్లెన్సింగ్ చేయాల్సి ఉంటుంది. ముఖం తాజాగా కనబడాలంటే కొద్దిగా ఆలివ్ ఆయిల్ తీసుకి అందులో కొంచెం పంచదార, కొంచెం ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి ముఖానికి మర్ధన చేసి శుభ్రం చేసుకోవాలి.

పురుషుల సౌందర్యాన్ని పాడు చేసే చెడు అలవాట్లు..!

మగవారి షేవింగ్ చేసిన తర్వాత ముఖానికి జెల్ అప్లై చేయడం వల్ల ముఖం మంటగా అనిపించదు. ముఖ్యంగా మరింత అందంగా.. ఫ్రెష్ గా కనబడుతారు.

English summary

8 Habits That Ruin Our Looks | పురుషుల సౌందర్యాన్ని పాడు చేసే చెడు అలవాట్లు..!

We all have certain habits that are hard to get rid of. Some of them seem fairly harmless, but they are not. Without your knowledge these habits are taking a toll on your looks. Read on to know what we’re talking about.
Desktop Bottom Promotion