For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నారింజతో నిగారింపైన చర్మ సౌందర్యం....!

వేసవిలో అరుదుగా దొరికేవి నారింజపళ్ళు, పుల్లపుల్లగా తియ్యతియ్యగా ఉండే నారింజ పండ్ల పేరు వింటేనే నోరూరుతుంది. ఈ పండ్లను తినడం వల్ల దాహార్తిని తీరుస్తాయి. అందుకే ఇవి ఎక్కువగా వేసవిలోనే దొరుకుతాయి. ఆరోగ్య

|

Beauty benefits of Oranges
వేసవిలో అరుదుగా దొరికేవి నారింజపళ్ళు, పుల్లపుల్లగా తియ్యతియ్యగా ఉండే నారింజ పండ్ల పేరు వింటేనే నోరూరుతుంది. ఈ పండ్లను తినడం వల్ల దాహార్తిని తీరుస్తాయి. అందుకే ఇవి ఎక్కువగా వేసవిలోనే దొరుకుతాయి. ఆరోగ్యాన్ని, అందాన్ని పెంచే సుగుణాలను తనలో నింపుకున్న నారింజను ఇంగ్లీషులో ఆరెంజ్‌ అని పిలుస్తుంటారు. మరి అందానికి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. అందానికి ప్రతీకలు అమ్మాయిలు. అందాన్ని కాపాడుకోవడానికి ఈతరం అమ్మాయిలు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. జిడ్డు చర్మం, పొడిచర్మ, రకరకాల చర్మ సమస్యలు కలవారు నారింజ పండ్లను తీసుకొంటే చక్కటి చర్మ సౌందర్యం మీ సొంతం అవుతుంది.

అందం కోసం అమ్మాయిలు క్లీనింగ్‌లు, బ్లీచింగ్‌లు, ఫేస్ ప్యాక్‌ లంటూ బ్యూటీపార్లర్‌లకు అంకితం అవుతున్నారు. పార్లర్లను పెంచి పోషించాల్సిన అవసరం లేకుండానే ఇంట్లో ఉన్న వస్తువులతో ఫేస్ ప్యాక్‌లను, మాయిశ్చరైజర్‌లను తయారు చేసుకోవచ్చు. ఇవి తయారు చేసుకోవాలంటే కేవలం మీకు కావలసింది కాసింత ఓపిక, తీరిక... ఇంట్లోనే సురక్షితమైన బ్లీచ్‌ను తయారు చేసుకోవటం ఎలాగో తెలుసుకుందామా...?

1. నారింజఫలాలు తినగా మిగిలిన తొక్కను పడవేయకుండా, వాటిని అలాగే నీడపట్టున ఉంచి ఆరబెట్టాలి. ఇవి మరీ ఒరుగుల్లాగా ఎండిపోతే పొడి చేసుకునేందుకు వీలుకాదు. కాబట్టి.. ఓ మోస్తరుగా మిక్సీలో పొడి చేసుకునేందుకు వీలుగా, పెళుసుగా ఉండేలా ఎండితే సరిపోతుంది.

ఇలా ఎండబెట్టిన నారింజ తొక్కలను పొడిచేసుకుని పొడిగా ఉండే బాటిల్‌లో భద్రపరచుకోవాలి. వీలు దొరికినప్పుడల్లా ఒక టీస్పూన్ నారింజపొడిని తీసుకుని, దానికి తగినన్ని పాలు కలిపి, మెత్తగా పేస్ట్‌లాగా చేసుకోవాలి. దీన్ని ముఖానికి ప్యాక్‌లాగా వేసుకుని, అరగంట తరువాత తీసివేస్తే సరిపోతుంది. ఇది చాలా సహజమైన బ్లీచింగ్‌లాగా పనిచేస్తుంది కాబట్టి, ముఖం కొత్త అందంతో మెరిసిపోతుంది.

2. నారింజ తొక్కను పడేయకుండా… ఎండబెట్టి, పొడి చేసి, సున్నిపిండిలో కలుపుకుంటే మంచిది. ఈ పిండిని స్నానానికి ముందు ఒంటికి రాసుకుని రబ్ చేస్తే… చర్మంపై ఉండే మృతకణాలన్నీ సులభంగా తొలగిపోతాయి. చర్మం మృదువుగా అవటమే కాకుండా, కొత్త మెరుపును సంతరించుకుంటుంది.

3. విటమిన్ సి శాతం ఎక్కువగా ఉన్న నారింజను రోజుకు ఒకటి తీసుకున్నట్లయితే.. చర్మం మంచి నిగారింపును సంతరించుకుంటుంది.

4. యుక్తవయస్సులో ఆడపిల్లల ముఖంపై ఏర్పడే మొటిమలను తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా తయారు చేయడంలో కమలా రసం బాగా ఉపయోగకారి.

5. ప్రతిరోజు కమలా పండ్ల రసం తాగితే వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఉత్సాహంగా, ఆరోగ్యంగా, పుష్టిగా, మంచి శరీర ఛాయతో ఉంటారు.

6. పచ్చి పాలల్లో దూదిని ముంచి దానితో ముఖాన్ని తుడవండి. ఇలా చేయడం వల్ల చర్మం మీద ఉండే దుమ్ము తొలగిపోతుంది.

7. చర్మం తేమగా ఉండాలంటే ఒక కప్పు పెరుగులో టేబుల్ స్పూన్ నారింజరసం, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి 15నిమిషాల తర్వాత కడిగేయండి. తేడా మీకే తెలుస్తుంది.

English summary

Beauty benefits of Oranges...! | బహుగుణాల సౌందర్య రాశి నారింజ...!

Orange peel is one of those miracle solutions that work wonders for your face and complexion. It gets rid of oily skin, unclogs pores, eliminates inflammation, treats acne, removes blemishes, evens skin tone and brings a glow to your face. It is very easy to make orange peel power to store and apply on your face.
Desktop Bottom Promotion