For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మగవారి చర్మం మృదువుగా ఉండాలంటే...

|

Beauty Tips for Men
మనిషి ఫిట్‌ గా ఉండడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎప్పుడైతే మనిషి ఫిట్‌ గా ఉంటాడో అప్పుడు మాత్రమే చూడడానికి అందంగా కనిపిస్తాడు. కాబట్టి మగవారు శరీరం విషయంలో పలు జాగ్రత్తలు తీసుకొంటే ఫిట్‌ గా ఉండడమే కాకుండా, అందంగా కూడా కనిపిస్తారు. మగవారు ఫిట్ నెస్ తో పాటు చర్మ సంరక్షణ పద్దతులు పాటించినట్లైతే వారు అందమైన శరీరాన్ని సొంతం చేసుకొవచ్చు.

స్త్రీ చర్మంతో పోలిస్తే మగవారి చర్మం రఫ్ గా ఉంటుంది. కాబట్టి ఆడవారు ఉపయోగించే క్రీములు ఎంతమాత్రం వారికి ఉపయోగపడవు. ఆడవారి చర్మ సౌందర్యం కోసం ఇదివరికే మహా మహా లేపనాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి అలాగే మగవారికోసం ప్రత్యేకంగా చేయబడిన క్రీములు కూడా బయట దొరుకుతున్నాయి. వీటితో పాటు ఇంటి చిట్కాలతో మగవారు అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు.

సాధారణ పద్దతుల్లో మగవారు షేవింగ్ చేసిన తర్వాత, స్నానమాచరించిన తర్వాత తప్పకుండా మాయిశ్చరయిజర్ రాయాలి. ఇలా చేస్తే చర్మం సహసౌందర్యంగా కనిపిస్తుంది. అలాగే మగవారి చర్మ సంరక్షణలో చర్మం ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడం వల్ల పొడిచర్మంతో నిగారింపునిస్తుంది. మగవారు రెగ్యులర్..రొటీన్ గా చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే స్త్రీ చర్మంలో నున్న తైల గ్రంథుల కంటే మగవారిలో ఉన్న తైలగ్రంథులు చాలా చురుకుగా పనిచేస్తాయి. దాంతో మగవారు ఎల్లప్పుడు బ్లాక్ హెడ్స్ ఆయిల్ స్కిన్ తో ఇబ్బంది పడుతుంటారు.

ఆలివ్ ఆయిల్ ను శరీరానికి పట్టించి బాగా మర్ధన చేసిన తర్వాత నిద్రకు ఉపక్రమించాలి. ఉదయం స్నానం తర్వాత బాదం ఆయిల్ తో మసాజ్ చేసినట్లైతో చర్మం నిగనిగలాడుతుంది. ఇలా వారంలో రెండు సార్లు చేయడం వల్ల చర్మంలో మృతకణాలు తొలగిపోతాయి. అప్పుడే చర్మం మృదువుగా..సున్నితంగా ఉంటుంది. దాంతో పాటు ఎక్కువ నీళ్లును తాగడం..బాడీకి సన్ స్క్రీన్ లోషన్ రాయడం వల్ల చర్మం శాశ్వత నిగారింపునిస్తుంది....

English summary

Beauty tips for Men to keep their skin Smooth and Soft.. | మగవారి చర్మం మెరవాలంటే...

The rugged look is all very well but men are also finding that soft skin is a hit with the ladies!
Story first published:Tuesday, February 14, 2012, 15:56 [IST]
Desktop Bottom Promotion