For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుడ్డుతో వెరీ గుడ్ గ్లామర్!

By B N Sharma
|
Beauty

చలికాలంలో ప్రతి వారికి చర్మం పొడి ఆరిపోతూ వుంటుంది. అనేక లోషన్ లు, క్రీములు రాస్తూనే వుంటాం. అయితే, సహజంగా మీ చర్మం తేమను పొంది ఆరోగ్యంగా ఆకర్షణీయంగా కనపడాలంటే కింది చిట్కాలు పరిశీలించండి.
- రెండు టేబుల్ స్పూన్ల గుడ్డుసొనలో ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్, ఓ స్పూన్ నిమ్మకాయ రసం కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి దట్టంగా పట్టించాలి. ఇరవై నిమిషాల తర్వాత నులి వెచ్చని నీరుతో శుభ్రపరిస్తే, మీ చర్మం మెత్తగా మారి కాంతివంతంగా తయారవుతుంది.

- బీట్‌రూట్ రసాన్ని పడుకునే ముందు పెదవులపై పలుచగా రాసి, అయిదు లేదా ఆరు నిమిషాల సేపు సున్నితంగా మర్దన చేస్తే పెదవులు కాంతివంతం అవుతాయి.

- చేతులకు వ్యాక్సింగ్ చేసుకున్న తరువాత ఒక టేబుల్ స్పూను గుడ్డుసొనలో, ఒక టీ స్పూన్ తేనె కలిపి చేతులకు రాసుకోండి. ఇరవై నిమిషాల తర్వాత కడిగేయండి. దీనివలన చర్మంమీద ఉన్న నల్లని బ్లాక్‌హెడ్స్ పోయి మీ చర్మం కాంతులీనుతూ అందంగా మారుతుంది.

- హెన్నా పౌడర్ లో గుడ్డుసొన కలిపి జుట్టుకు రాస్తే, జుట్టు మెత్తగా, మృదువుగా మారుతుంది. అంతే కాకుండా కండీషనర్‌గా కూడా ఉపయోగపడుతుంది.

- రెండు నుండి మూడు గుడ్లను బాగా గిలక్కొట్టి తలంతా పట్టించి, షుమారు పదిహేను నిమిషాలయ్యాక గోరు వెచ్చని నీటితో కడిగేయండి. మీ నల్లని జుట్టు పట్టు లా మారుతుంది. వెంట్రుకల కొనలు చిట్లకుండా ఆకర్షణీయంగాను ఉంటాయి.

English summary

Benefits of Egg Beauty Care! | గుడ్డుతో వెరీ గుడ్ గ్లామర్!

Egg plays a prominent Role in the beauty care products manufacture. However, raw egg can be used at home for various beauty applications. It can be mixed with various other things and If you apply that mixture to your skin, hair, etc. it yields good results in beautifying your body.
Story first published:Sunday, January 8, 2012, 11:42 [IST]
Desktop Bottom Promotion