For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరూ ఛార్మిలా..ఛార్మింగ్ గా కనబడాలంటే...

|

Charming Skin...Daily Skin Care Tips
నేటి తరం మహిళలు తమ అందాన్ని మరింత ద్విగుణీకతం చేసుకునేందుకు బ్యూటీ పార్లర్ ను ఆశ్రయిస్తున్నారు. అయితే బ్యూటీ పార్లర్ కు వెళ్ళాక కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు సౌందర్య నిపుణులు. మనచుట్టూ రకరకాల మనుషులుఎందరో ఉంటారు. కానీ వాళ్ళలో కొందరే అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తారు. వాళ్ళ బ్యూటీ సీక్రెట్ ఏమిటి? ఫిజికల్ గా శరీరాకృతి బాగుండటం, మంచి రంగు, చక్కటి జుట్టు, ఎత్తుకు తగ్గ లావుతో మంచి పర్సనాలిటీ ఇలా చాలానే కారణాలు చెప్తారు. ఫీచర్స్ తో వచ్చేది నాచురల్ బ్యూటీ. అయితే ఫిజికల్ గా కొంత వరకూ ఆకట్టుకున్నా, ఇంకొందరు వేసుకున్న దుస్తుల వల్ల అందం వచ్చిందని, హెయిర్ స్టైల్ వల్ల అందం పెరిగిందని, మేకప్ తో బ్యూటీ వచ్చిందని, ఇలా రకరకాల కారణాలు చెప్తారు. వీటినీ కాదనలేం. నాచురల్ బ్యూటీ కి అలంకరణ తోడైతే అదనపు ఆకర్షణ, లేదా ఎట్రాక్షన్ వస్తుంది. ఇది ఒక ప్లస్ పాయింటే

కానీ గమ్మత్తు ఏమిటంటే, ఫీచర్స్ బాగుండటం, చక్కగా తయారవడం కంటే కూడా మరో రెండు కారణాలతో అందం వస్తుంది. అందులో ఒకటి మన ప్రవర్తన. మంచితనం, నిజాయితీలతో ముఖంలో బ్యూటీ వస్తుంది. ఇక రెండోది తెలివితేటలు. కాస్త వైజ్ గా, మెచ్యూరిటీతో నడచుకోవడం వల్ల ముఖానికి గ్లో వస్తుంది. బ్యూటీ పెరుగుతుంది. ముఖం ఛార్మింగ్ గా ఉంటుంది. మరి ఆ చిట్కాలేంటో మీరూ చూడండి...

1. పాల మీగడలో పసుపు కలిపి రోజూ చర్మానికి రాసుకొని సున్నితంగా మర్థన చేసి పదినిమిషాల తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో ముఖం కడుక్కోవాలి.
2. నిమ్మకాయ రసం, తులసి ఆకుల రసం సమపాళ్ళలో కలిపి రోజూ రెండుసార్లు ముఖానికి పట్టించి గోరువెచ్చటి నీళ్ళతో ముఖం శుభ్రం చేసుకోవాలి.
3. పచ్చిపాలలో పసుపు కలిపి దానిలో దూది పింజల్ని నాన బెట్టండి. తర్వాత ఆ పాలు ఫ్రిజ్‌ లో ఉంచండి. రోజూ ఒక దూది పింజను తీసుకుని నల్లని చర్మం పై రుద్దుతూ చక్కగా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. పచ్చిపాలు,పసుపు మిశ్రమం చర్మంలో నునుపు కలిగించడంతోపాటు నలుపు రంగును దూరం చేస్తుంది.
4. శనగపిండి, నెయ్యి, పసుపు మిక్స్ చేసి చర్మంపై రాసి, కొద్దిగా ఆరాక చేత్తో మృదువుగా గుండ్రంగా మసాజ్‌ చేయాలి. ఇలా చేస్తే మీ పొడిబారిన చర్మం పై ఉన్న మురికి తొలగిపోతుంది. దీనితో పాటు నలుపు తగ్గిపోయి ఛామన చాయతో కాంతి వంతంగా ఉంటుంది.
5. ప్రతి రోజూ స్నానం చేయడానికి పది పదిహేను నిమిషాల ముందు శరీరానికి శనగపిండి, పచ్చిపాలు పసుపు కలిపిన మిశ్రమాన్ని పట్టించాలి. ఆ తర్వాత స్నానం చేయాలి.
6. ప్రతిరోజూ గంధం పొడిని, పసుపు, రోజ్‌ వాటర్‌ మిశ్రమాన్ని ముఖానికి పట్టించండి. ప్రతి రోజూ చర్మానికి తేనె పూతగా రాయడం వల్ల చర్మం నిగారిస్తుంది.

English summary

Charming Skin...Daily Skin Care Tips... | ఛార్మింగ్ స్కిన్ బ్యూటి సీక్రెట్....

Daily skin & facial care makes us look more charming and beautiful. By following some easy tips, you can look younger and more beautiful without spending too much of extra time and money.
Story first published:Thursday, February 23, 2012, 11:48 [IST]
Desktop Bottom Promotion