For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేసవిలో చర్మ నిగారింపుకోసం....

|

Home made Skin Care Tips for The Hot Summer
వేసవిలో చర్మానికి శత్రువు సూర్య రశ్మి సూర్యుని నుండి పడే అతినీలలోహిత కిరణాలు చర్మంలోని కొజిలాన్ కు తీరని హని కలిగిస్తాయి. ఎండలో మరీ ఎక్కువగా తిరిగే వారికి మచ్చలు, పిగ్మెంటేషన్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. వేసవిలో చర్మం పై తగిన శ్రద్ధ తీసుకొన్నట్లైతే వేడి నుండి, సూర్యరశ్మి నుండి బయట పడవచ్చు.

1. ఎండలో బయట తిరిగి రాగానే శరీరానికి పదినిమిషాలు విశ్రాంతినివ్వాలి. ఆ తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో కడుక్కోవాలి.
2. వేసవిలో అరుదుగా దొరికే కర్బూజ(పుచ్చకాయ)యాపిల్, బొప్పాయి, కమలాపండ్ల గుజ్జుతో ఫేస్ ప్యాక్ వేసుకుని తర్వాత చల్లని నీటితో కడిగితే చర్మానికి మంచి నిగారింపు వస్తుంది.
3. వంటింటి సామాగ్రితోనూ..శెనగపిండిలో గంధం పొడి కలిపి ఎండవేడికి గురైన ముఖం, చేతులు, పాదాలపై రాసి , అరగంట తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. దాంతో శెనగపిండి పేరుకున్న మురికిని తొలగిస్తే, గంధం చర్మానికి చల్లదనం ఇస్తూ కోల్పోయిన మెరుపు తిరిగి సంతరించుకునేలా చేస్తుంది.
4.పాలమీగడలో గంధం కలిపి ఎండకు వాడిన చర్మంపై రాసి, అరగంట తర్వత ముఖాన్ని చల్లని నీటితో కడిగితే కమిలిన చర్మం తిరిగి మామూలుగా మారుతుంది.
5. ఇంటో తాజా కూరగాయలు తరిగేటప్పుడు ..రెండు మూడు ముక్కలు తీసుకుని ముఖానికి, చేతులకు, మోచేతులకు రుద్దాలి. బాగా ఆరిన తర్వాత చన్నీటితో శుభ్రంగా కడగాలి. దాంతో కూరగాయల్లో సహజంగా ఉండే నీరు చర్మాన్ని తేమగా చేసేందుకు సహకరిస్తుంది. చర్మం మృదువుగా అయ్యేలా చేస్తుంది.
6. వేసవిలో మంచినీరు, కొబ్బరినీళ్లు, బార్లీ నీళ్ళు ఎక్కువగా తాగుతుండాలి. పండ్లు తినాలి. ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
7. రసం పిండేసిన నిమ్మతొక్కలపై పంచదార లేదా ఉప్పు వేసి చర్మం తిరిగి ఉత్తేజం అవుతుంది.
8. ఎండలో బయటకు వెళ్ళేటపుడు గొడుగు తప్పని సరిగా తీసుకువెళ్లాలి. ద్విచక్రవాహనాలపై ప్రయాణించేవారు హెల్మెట్‌, గ్లౌసెస్‌ ధరించడం మంచిది.

English summary

Home made Skin Care Tips for The Hot Summer...| వేసవిలో చర్మ నిగారింపుకోసం....

Take a heart and beat the heat this summer, maintaining your beauty and keeping your skin soft, supple and well nourished with these home-made summer skin care recipes...
Story first published:Monday, March 19, 2012, 9:01 [IST]
Desktop Bottom Promotion