Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
చర్మ సంరక్షణలో సౌందర్య సాధానాల ఎంపిక ఎలా...!?

చర్మంపై పెద్దగా తెరచుకున్న గ్రంథుల్ని తగ్గించాలంటే టోనర్ ను వాడాల్సిందే. దీన్ని యాస్ట్రిజెంట్ అంటారు. ఇవి ఆల్కాహాల్ ఉన్నవి. ఆల్కహాల్ రహిగ రకాల్లో లభిస్తాయి. చర్మాన్ని శుభ్రం చేసుకున్నాక టోనర్ లో దూదిని ముంచి ముఖంపై తుడిస్తే తెరచుకున్న గ్రంథులు మూసుకుపోతాయి. వీటిల్లో శాలిసిలిక్, గ్లైకోలిక్ ఆమ్లాలాంటివి ఉంటాయి. కాబట్టి చర్మానికి మేలు. జిడ్డు సహజ చర్మ తత్వం ఉన్నవాళ్లు ఆల్కహాల్ తక్కువ శాతం ఉన్నవి ఎంచుకోవాలి. మిగిలిన వాళ్లు ఎలాంటివి అయినా ఎంచుకోవచ్చు. ఇప్పుడు మాయిశ్చరైజర్లూ పలు రకాల్లో లభిస్తున్నాయి. స్నానం చేశాక తడిపొడిగా ఉన్నప్పుడే వీటిని రాసుకోవాలి.
ఎండ ప్రభావం నుంచి చర్మాన్ని రక్షించాలంటే సన్ స్ర్కీన్ లోషన్ ని వాడొచ్చు. అయితే ఏదో ఒకటి అని కాకుండా మనదేశ చర్మతత్వానికి తగ్గట్లు వాటిని ఎంచుకోవాలి. దాంతో పాటు యూవీ ఎ, యూవీ బి అని రాసున్న ఉత్పత్తులకి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలి. ఇవి కూడా సిలికాన్, యాంటీ ఆక్సిడెంట్లు, లైకో పీన్, క్యారెట్, పండ్లు వంటి సహజ సుగుణాలతో లభిస్తున్నాయి. రసాయనాల మిళితం కూడా ఉంటాయి. అయితే వీటిని మాత్రం ప్రతి మూడు గంటలకోసారి రాసుకుంటూ ఉండాలి. మెరుపు పెంచే మాస్కులు: పలు రకాల్లో లభించే వీటిని ప్రోటీన్ మాస్కులంటారు. బొప్పాయి గుజ్జు ఆధారిత ఉత్తత్తులే కాదు. మరెన్నో రకాల్లో అందుబాటులో ఉంటాయి. ఎవరైనా ప్రయత్నించవచ్చు.
సమతూకంలో లేని చర్మం రంగును ఒకేలా కనిపించేలా చేయడంలో దీని పాత్ర కీలకం. ఇది సాధారణంగా ఆయిల్, వాటర్, ఆయిల్ ఫ్రీ, వాటర్ ఫ్రీ వాటర్ ఫ్రూఫ్ రకాల్లో లభిస్తుంది. ఎండ వల్ల ఎలర్జీ సమస్య ఉన్న వాళ్లు, వాటర్ ఫ్రూఫ్ రకాలను ప్రయత్నించవచ్చు. నూనె ఆధారిత అంటే నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మానికి రాసుకున్నాక నీటి శాతం ఆవిరవుతుంది. దాంతో చర్మం సహజతత్వంతో మెరుస్తుంది. తేమ కూడా అందుతుంది. ఎలర్జీ ఉన్న వాళ్లు, పొడిబారి చర్మతత్వం గలవారు దీన్ని ఎంచుకోవచ్చు. నీటి ఆధారిత అంటే నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది సహజ, కాంబినేషన్ చర్మ తత్వాల వారికి చక్కని ఎంపిక.
జిడ్డు చర్మ తత్వం ఉన్న వారికి ఆయిఫ్రీ, మాత్రమే కాదు వాటర్ ఫ్రీ రకాలు కూడా మంచి ఎంపిక. సాధారణంగా ఆయిల్ ఫ్రీ రకాలు ఎక్కువగా లభిస్తాయి. వీటిల్లో సిలికాన్ శాతం అధికంగా ఉంటుంది. రాసుకోవడం సులభం. మొటిమలు, బ్లాక్ హెడ్స్, ఎలర్జీల్లాంటి సమస్యలు వేధించవు. చర్మం కూడా సహజంగా కనిపిస్తుంది. ఇది వర్షాకాలంలో చక్కని ఎంపిక. అయితే దీని ప్రభావం తక్కువ సమయమే ఉంటుంది. జిడ్డు చర్మ తత్వానికి మరో ప్రత్యామ్నాయం లోషన్లు స్టిక్స్ పొడిబారిన చర్మతత్వానికి నప్పుతాయి. అంతేనా ఇవి ఎక్కువ గంటలు పనిచేస్తాయి.



Click it and Unblock the Notifications