For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముఖకవలికలతోనే మనస్సులోని హావభావాలు...

|

How to Improve glamour in the Face
సాధారణంగా కొంతమంది ముఖకవలికలతో మనసులోని భావాలు తెలియజేస్తారు. ఎదుటివాళ్ళు ముందుగా చూసేది ముఖాన్నేగదా. తర్వాతే మరేదైనా. అంతేకాదు ముఖం చూస్తే మనిషి ఆరోగ్యస్థితి కూడా తెలుసుకోవచ్చు. కనుక మన ముఖం ప్రసన్నంగా వుండేలా జాగ్రత్తపడాలి. దాన్ని వీలైనంత అందంగా వుండేలా చూసుకోవాలి.

ముఖంలో ముడతలు, ఎత్తుపళ్ళు, మచ్చలు, మొటిమలు, కళ్ళకింద నల్లటి చారికలు లాంటివి ముఖ సౌందర్యాన్ని తగ్గిస్తాయి. కనుక అలాంటివాటిని తొలగించుకు నేందుకు ప్రయత్నించాలి. ముఖాన్ని, చర్మాన్ని సంరక్షించుకోవాలి. ఆరోగ్య వంతమైన వదనం కోసం కొన్ని జాగత్తలు తీసుకోవాలి. అందుకోసం పాటించాల్సిన జాగ్రత్తలేంటో ఇప్పుడు చూద్దాం.

1. తాజా బొప్పాయిలో కొబ్బరిపాలు కలిపి, చర్మానికి రాసుకుంటే చర్మం మృదువుగా శాటిన్ లా మెత్తగా మారుతుంది.
2. మరీ వేడి నీటితో స్నానం చేయటం మంచి పద్దతి కాదు. ఇలా చెయటం వల్ల చర్మం మరింత పొడిగా మారుతుంది.
3. స్నానం చేసే ముందుగా చేతులు శుభ్రంగా కడుకొన్న తర్వాతే ముఖం కడుక్కోవాలి. బయటినుండి వచ్చిన తర్వాత ముఖం కడుక్కునేటప్పుడు చేతులు, మెడ కూడా శుభ్రం చేసుకోవాలి.
4. తరచుగా దొరికే కీరదోసకాయ రసంలో దూదిని ముంచి రోజుకి రెండు సార్లు రాసుకుంటే చర్మానికి మెరుపు వస్తుంది.
5. వీలైనన్ని తాజా పళ్ళూ, కూరగాయలను ఆహారంలో తీసుకోండి. రోజులో వీలైనంత మంచినీరు తాగడానికి ప్రయత్నించండి.
6. చర్మం పై పొరను పరిశుభ్రపరచడానికి ఒక మెరుపులాంటి ఛాయను ఇవ్వడానికి మాయిశ్చరైజింగ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎప్పుడో ఎవరో చెప్పినప్పుడు అని కాకుండా క్రమం తప్పకుండా మాయిశ్చరైజ్ చేసుకోవాలి.

English summary

How to Improve glamour in the Face... | ముఖవర్ఛస్సును పెంచుకోవడం ఎలా..

To have beautiful, glowing, young and healthy looking skin you should follow a daily skin care routine. However it is not enough to just regularly apply a moisturizer. To optimize your skin care and get the best possible results you need to addapt your skin care products and routine to your skin type. This lens offers recommendations on skin care by skin type.
Story first published:Thursday, March 1, 2012, 11:51 [IST]
Desktop Bottom Promotion