ఆరెంజ్ తో ఫ్రెష్ నెస్ -గ్లోయింగ్ స్కిన్

By Sindhu
Subscribe to Boldsky

ఆరోగ్యాన్ని, అందాన్ని పెంచే సుగుణాలను తనలో నింపుకున్న నారింజను ఇంగ్లీషులో ఆరెంజ్‌ అని పిలుస్తుంటారు. పిల్లలు పెద్దలు ఇష్టంగా తినే పండ్లలో ఆరెంజ్ ఒకటి. దీనిలో పుష్కలంగా ఉండే సి విటమిన్ చర్మానికి నిగారింపు ఇస్తుంది. ఆరంజ్ లో ఫైబర్ శాతం ఎక్కువ కాబట్టి జ్యూస్ లా కాకుండా తొనలతో తినడమే మంచిది. తినడానికే కాదు, బ్యూటీ కేర్ కోసం కూడా ఆరంజ్ ఫ్రూట్ ని ఉపయోగించవచ్చు. అదెలాగో చూద్దాం....

Orange Peel and Powder for Freshness Glowing Skin

1. ఆరెంజ్ గుజ్జుని తేనెలో కలిపి ఫేషియల్ చేసుకోవచ్చు. ఆరెంజ్ గుజ్జుకి శాండిల్ ఉడ్ పౌడర్, ముల్తానీ మట్టిసమపాళ్లలో కలిపి ఫేస్ కి ప్యాక్ చెయ్యాలి. ముఖ కాంతి పెరగడమే కాదు. గోల్డెన్ ఫేషియల్ చేసిన గ్లో వస్తుంది.

2. ఆరెంజ్ తొక్క ఎండ బెట్టి పౌడర్ చేసి కొద్దిగా పాలను కలపి పేస్ట్ లా తయారు చేసి ముఖానికి పట్టించాలి. ఇరవై నిమిషాలు ఉంచి గోరు వెచ్చని నీటితో శుభ్రపరచుకోవాలి. ఇది బ్లీచ్ లా పనిచేస్తుంది.

3. బియ్యం, పెసరపప్పు, శనగపప్పు, సమబాగంలో తీసుకొని మరువం, తులసి ఆకులు, వేపాకులకు ఆరెంజ్ తొక్క పౌడర్ కలిపి సున్నిపిండిగా తయారు చేసుకోవచ్చు. ఇది చర్మం సున్నితత్వానికి ముఖం గ్లో పెరగానికి ఉపయోగపడుతుంది.

4. ప్రయాణంలో అలసిన ముఖం మీద అప్పుడే ఒలిచిన ఆరెంజ్ తొక్కలతో స్ప్రే చేస్తే, నిముషాల్లో వడలిపోయినట్లుగా ఉన్నముఖం ప్రెష్ గా కనిపిస్తుంది. ఇది మంచి క్లెన్సింగ్ గా కూడా ఉపయోగపడుతుంది.

5. ఆరెంజ్ పండ్లు తినగా మిగిలిన తొక్కను పడవేయకుండా, వాటిని అలాగే నీడపట్టున ఉంచి ఆరబెట్టాలి. ఇవి మరీ ఒరుగుల్లాగా ఎండిపోతే పొడి చేసుకునేందుకు వీలుకాదు. కాబట్టి.. ఓ మోస్తరుగా మిక్సీలో పొడి చేసుకునేందుకు వీలుగా, పెళుసుగా ఉండేలా ఎండితే సరిపోతుంది.

ఇలా ఎండబెట్టిన నారింజ తొక్కలను పొడిచేసుకుని పొడిగా ఉండే బాటిల్‌లో భద్రపరచుకోవాలి. వీలు దొరికినప్పుడల్లా ఒక టీస్పూన్ నారింజపొడిని తీసుకుని, దానికి తగినన్ని పాలు కలిపి, మెత్తగా పేస్ట్‌లాగా చేసుకోవాలి. దీన్ని ముఖానికి ప్యాక్‌లాగా వేసుకుని, అరగంట తరువాత తీసివేస్తే సరిపోతుంది. ఇది చాలా సహజమైన బ్లీచింగ్‌లాగా పనిచేస్తుంది కాబట్టి, ముఖం కొత్త అందంతో మెరిసిపోతుంది.

6. నారింజ తొక్కను పడేయకుండా... ఎండబెట్టి, పొడి చేసి, సున్నిపిండిలో కలుపుకుంటే మంచిది. ఈ పిండిని స్నానానికి ముందు ఒంటికి రాసుకుని రబ్ చేస్తే... చర్మంపై ఉండే మృతకణాలన్నీ సులభంగా తొలగిపోతాయి. చర్మం మృదువుగా అవటమే కాకుండా, కొత్త మెరుపును సంతరించుకుంటుంది.

7. విటమిన్ సి శాతం ఎక్కువగా ఉన్న నారింజను రోజుకు ఒకటి తీసుకున్నట్లయితే.. చర్మం మంచి నిగారింపును సంతరించుకుంటుంది.

8. యుక్తవయస్సులో ఆడపిల్లల ముఖంపై ఏర్పడే మొటిమలను తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా తయారు చేయడంలో కమలా రసం బాగా ఉపయోగకారి.

9. ప్రతిరోజు కమలా పండ్ల రసం తాగితే వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఉత్సాహంగా, ఆరోగ్యంగా, పుష్టిగా, మంచి శరీర ఛాయతో ఉంటారు.

10. సాధరణంగా చుండ్రు సమస్య ఉన్నవారు ఆరెంజ్ పౌడర్ ను నీళ్లతో పేస్ట్లా కలిపి తలకు పట్టించి అరగంట తర్వాత స్నానం చేయాలి. వారానికి సారి ఇలా చేస్తే క్రమంగా చుండ్రు సమస్యే ఉండదు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Orange Peel and Powder for Freshness Glowing Skin | ఆరెంజ్ తో ఫ్రెష్ నెస్ స్కిన్...!

    Orange is one fruit that can do wonders to your skin. It has astringent and toning properties that can make your skin healthier and fairer. Orange has a good amount of vitamin C that can improve your skin texture as well as makes it glow. This citrus fruit also helps your skin in restoring collagen tissue;
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more