For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పపాయ(బొప్పాయ) ఫేస్ ప్యాక్ తో మొటిమలు మాయం..!

|

Papaya Face Pack for Face Pimples...!
‘అందమైన ప్రేమరాణి లేత బుగ్గపై చిన్న మొటిమ కూడ ముత్యమేలే' అంటూ ప్రేమికుడు మురిసిపోతాడు. ఒక్క మొటిమ ఉంటే బాగానే ఉంటుంది. మరి ఎక్కువ అయితే ముఖం అంద విహీనంగా తయారవుతుంది. టీనేజ్‌లోకి అడుగిడ్డిన పిల్లలందరూ ఆడ, మగ తేడా లేకుండా ఎదుర్కొనే సమస్య మొటిమల సమస్య. వయస్సులో పాటు శరీరంలో జరిగే హర్మోన్స్‌ మార్పుల వల్ల చిన్నచిన్న మొటిమలు రావడం సాధారణమైన విషయమే అయినప్పటికీ యువత వీటి కారణంగా అనేక ఆందోళనలకు గురవుతుంది. ముఖంపై ఎక్కువగా రావడం కారణంగా చాలా ఇబ్బందిగా ఫీల్‌ అవుతారు. మానసికంగా కృంగదీసే ఈ మొటిమలు ముఖంపై మచ్చలను, గుంటలు ఏర్పడానికి కూడా కారణం అవుతాయి. మొటిమలు లేని అందమైన ముఖారవిందం మీ సొంతం చేసుకోవాలంటే చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చాలు...

అయితే అలాంటి చిన్న చిన్న చిట్కాలను మునపటి ఆర్టికల్స్ లో చదివేవుంటారు. అలాగే రకరకాల క్రీములు, ఫేస్ ప్యాక్ లు, పూతలు ప్రయత్నం చేసి ఉంటారు. అందుకోసం మార్కెట్ లో కూడా రకరకాలుగా క్రీములు కూడా అందుబాటులో ఉన్నాయి. అవి కూడ ప్రయోజన లేనప్పుడు మరొ చక్కటి ఉపాయం మీ కోసం..ఈ చిట్కాల ఖచ్చితంగా మీ ముఖంలో నున్న మొటిమలను తొలగించి కాంతివంతంగా చేస్తుంది. మొటిమలు ఎక్కువగా ఉన్నట్లైతే ఈ ఫేస్ ప్యాక్ ను ప్రతి రోజూ ఒక వారం పాటు క్రమం తప్పకుండా వేసుకొన్నట్లైతే తప్పకుండా ఫలితం ఉంటుంది.

అందుకు కావల్సిన పదార్థాలు బాగా పండిని పపాయ, చెక్క(మసాలా దినుసు), పుదీనా ఆకులు లేదా తులసి ఆకులు లేదా, వేప ఆకులు. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో బాగా పండిన పపాయ ముక్కలను వేసి బాగా గుజ్జులా తయారు చేసుకోవాలి. అందులో రెండు చెంచాల చెక్క పొడి వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత అందులో తులసి లేదా, పుదీనా లేదా వేపాకులను ఏదో ఒక్కదాన్ని మొత్తని పేస్ట్ లా చేసుకొని పపాయ పేస్ట్ లో మిక్స్ చేయాలి. అవసరం అనిపిస్తే కొద్దిగా నీళ్ళు వేసుకోవచ్చు.

ఈ మూడింటిని బాగా మిక్స్ చేసిన తర్వాత ఉదయాన్నే ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేసి తర్వాత తడిని పూర్తిగా టిష్యూ పేపర్ తో తొలగించాలి. తర్వాత ఈ ఫేస్ ప్యాక్ ను మొటిమలు ఎక్కువగా ఉన్న ప్రదేశంలో పూర్తిగా అప్లై చేయాలి. అరగంట సేపు అలాగే ఉంచి ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. అలాగే రాత్రి పడకోబోయే ముందు ముఖాన్ని మంచినీళ్ళతో కడిగి ఏదే మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. మళ్ళీ మరుసటి రోజు ఉదయం ఈ ఫేస్ ప్యాక్ ను అప్లై చేయాలి. ఇలా వారం రోజుల పాటు క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

English summary

Papaya Face Pack for Face Pimples...! | పపాయ ఫేస్ ప్యాక్ తో మొటిమలు మాయం..!

There are so many face pack for face pimples available in the market. But here I am suggesting a method as a package to remove face pimples. This package may help to remove all most all sorts of pimples. Use this face pack for pimples daily for one week if you have severe pimples.
Story first published:Tuesday, August 21, 2012, 13:53 [IST]
Desktop Bottom Promotion