Latest Updates
-
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్‌లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.!
వేసవిలో ఉల్లాసంగా.....ఉత్సాహంగా...ఫ్రెష్ గా కనబడాలంటే...!

1. వాడేసిన నిమ్మడిప్పలు కొద్దిగా నీటితో బాగా ఉడికించి, చల్లారిన తర్వాత గట్టిగా పిండి రసం తీసి, అందులో అరచెంచాడు లావెండర్ కలుపుకుని, శరీరానికి లైట్ గా రాసుకుంటే ఎండవల్ల కలిగే ఇబ్బందులు తగ్గడమే కాక, చమట వాసన, చెమట పొక్కులు రాకుండా అరికడుతుంది. రోజంతా తాజాగా ఉంచుతుంది.
2. ఎండాకాలం అంతా తరిగిన ఉల్లిపాయ ముక్క దగ్గర ఉంచుకుంటూ, అడ పాదడపా వాసన చూస్తూవుంటే వడదెబ్బ తగలదు. అలాగే, చేతి రుమాలులో చిటికెడు బియ్యపు గింజలు హారతి కర్పూరంతో కలిపి మూటకట్టి వాసన పీలుస్తూ ఉంటే, వేడి వల్ల కలిగే జలుబు రాకుండా చేస్తుంది.
3. ఈ కాలంలో పల్చటి నూలు వస్త్రాలు వాడడం ఎంతైనా మంచిది. కొందరు ఎండ తాపం తట్టుకోలేక బట్టలు తడిపి వస్త్రాలు వాడడం ఎంతైనా సేద తీరుతూ ఉంటారు. ఇది మరీ ప్రమాదం. ఎండవున్నంత సేపూ, శరీరానికి తడి ఎంత తగలకుండా ఉంటే అంత మంచిది.
4. వేసవిలో చాలా మందికి ముఖం మీద, వీపు మీదా ఎక్కువగా చెమటకా యలు వచ్చి దురద, మంట కలిగిస్తాయి. వీటితో ఎంతో అస్థిమితం అయిపోతాం. అటువంటప్పుడు, కొబ్బరి నీరు శరీరానికి లేపనం చేసుకుంటే చెమటకాయలు, దురదా మానిపోతాయి. ఇవేవీ లేకుండా ఉన్నప్పటికీ రాసుకోవడం వల్ల ముందు ముందు ఈ బాధ రాకుండా ఉంటుంది.
5. అలాగే వేసవి తాటి ముంజలకి సీజన్. ఈ సీజన్ లో వీలైనన్ని తాటిముంజలు తినడం మంచిది. ఎండదెబ్బ తగలకుండా కాపాడుతుంది. ఇక శరీరానికి కూడా లేపనం చేసుకుంటూ ఉంటే శరీరం కాంతివంతంగా, మృదువుగా ఉంటుంది.



Click it and Unblock the Notifications
