For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రకృతి సిద్దమైనటువంటి సబ్బులతో కాంతివంతమైన చర్మం...

|

సాధారణంగా టీవీలో చూస్తూనే ఉంటాం. వివిధ రకాల ప్రకటనల్లో సౌందర్య సాధనాలైన సబ్బులను చూసి వాటికి ఆకర్షింపబడి. వాటికోసం ఎంత ఖర్చైనా సరే వెచ్చించడానికి వెనకాడరు. అయితే ప్రకటనల్లో చూపించే బార్ సోప్ కంటే సహజంగా తయారు చేసుకొనేటటువంటి సోప్స్ చాలా స్వచ్చమైనటువంటివి.

Skin Care With Natural Handmade Soaps..!

ప్రకృతి సిద్దమైనటువంటి సహజ సబ్బులను తయారు చేయడానికి ముఖ్యంగా మూడు రకాలైనటువంటి పదార్థాలు అవసరం ఉంటుంది. అందులో మొదటిది సహజమైనటువంటి కూరగాయల నుండి తయారు చేసినటువంటి నూనెలు, కొబ్బరి కొబ్బరి నూనె, పామాయిల్, ఆలివ్ ఆయిల్. ఇక రెండవది సువాసనలు వెదజల్లే టటువంటి నూనెలు. ఇక చివరది ప్రకృతి ప్రసాదించినటువంటి పుష్పాలు, మొగ్గలు, ఆకులు, హెర్బ్స్ మరియు విత్తనాలు వీటన్నింటి సమ్మేళనంతో తయారు చేసేటివే సహజ సిద్దమైనటటువంటి సబ్బు. వీటితో తయారు చేయునప్పుడు వేరే ఏ ఇతర రసాయనాలను కలపకుండా స్వచ్చంగా తయారు చేస్తారు.

మనకు రెగ్యులర్ గా మార్కెట్లో దొరికేటటువంటి సోప్స్ (సబ్బుల)ల్లో ఎక్కువ రసాయనాలు కలపి తయారు చేయబడి ఉంటాయి. ముఖ్యంగా డిటర్జెంట్ సోప్స్ లో పెట్రోలియం, మోటర్ ఆయిల్, ఆల్క్ హాల్ మరియు గ్యాసోలైన్ వంటి కఠినమైన పదార్థాలను ఉపయోగించడం వల్ల చర్మం దెబ్బతింటుంది. మన శరీరంలోని పెద్ద అవయవం చర్మం. వాతావరణం, శారీరక మార్పులకి అనుగుణంగా చర్మం కూడా మారుతూ వుంటుంది, చలి కాలంలో తేమ శాతం తక్కువ అవటం వల్ల చర్మం పొడి బారిపోయి దురద, నల్ల బడటం వంటి మార్పులు చెందుతుంది. ఇది సబ్బు వాడకం వల్ల ఇంకా ఎండి పోవుటకు అవకాశం ఉన్నందువల్ల క్షారశాతం ఎక్కువ వున్న సబ్బులు అత్యవసరమయినప్పుడు మాత్రమే వాడితే మంచిది.

చర్మానికి సహజంగానే ఆమ్లశాతం PH 4.5-6 వరకూ వుంటుంది, దీని వల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నించి చర్మం రక్షింపబడుతుంది. సరయిన సబ్బు వాడకం వల్ల చర్మంలోని తేమని నిలబెట్టుకొని దురదల వంటి సమస్యలు లేకుండా కాపాడుకోవచ్చు .ఇక ఎటువంటి సబ్బులు చర్మానికి ఉపయోగకరమో తెలుసుకుందాం. ఆమ్లతత్త్వం, క్షారతత్త్వం కాని సబ్బులు సహజంగా తయారయ్యేటటువంటి సబ్బులేంటో వాటి ఉపయోగాలేంటో చూద్దాం....

నేచ్యురల్ హ్యాడ్ మేడ్ సోప్స్:
పొడి చర్మం గలవారికి : సహజమైనటువంటి సబ్బులు ‘మేకపాలతో' తయారు చేస్తారు. ఆలివ్ నూనె, సన్ ఫ్లవర్ నూనె మరియు తేనెటీగలను మైనపు వంటి వాటితో తయారు చేసే సబ్బులు. ఇవి మీ శరీరంలో ఒక మృదువైన నున్నని నురుగును సృష్టిస్తుంది. ఈ సబ్బుల్లో షియా లేదా కోకో వెన్నను కలపడం వల్ల ఇది శరీరానికి ఒక ఔషదంగాను, మాయిశ్చరైజర్ గాను ఉపయోగపడుతుంది. మరి మేక పాల సబ్బులు ? ఇవి మొటిమలు మరియు చిన్న చిన్న మచ్హలు లాంటి వాటికి మందులాగ పనిచేస్తుంది.

వయస్సు పైబడిన వారికి: వయస్సు పై బడే వారికి గోధుమలతో తాయరు చేసే పిండి, అవకాడో మరియు ఆర్గాన్ ఆయిల్ తో తయారు చేసినటువంటి సబ్బులు బాగా ఉపయోగపడుతాయి. చర్మంలో బ్యాక్టీరియాతో పోరాడటానికి, చర్మం సున్నితంగా తయారవడానికి ఇది బాగా పనిచేస్తుంది.

జిడ్డు చర్మానికి : జిడ్డు చర్మతత్వం కలవారు సహజమైనటువంటి లావెండర్, చమోమిలే మరియు థీమో టీ ట్రీ ఆయిల్ వంటితో తయారు చేసిన సబ్బులను ఉపయోగించడం వల్ల జిడ్డు చర్మం ప్రకాశవంతంగా కనిపిస్తుంది. చర్మంలోని ఎక్కువ జిడ్డును తొలగించడానికి ఆకుపచ్చ మట్టి లేదా పింక్ మట్టితో తయారు చేసినటువంటి సబ్బులను ఉపయోగించాలి.

ఈ సహజసిద్దంగా తయారైనటు వంటి సబ్బుల ఉపయోగాలు: సహజంగా తయారైనటువంటి సబ్బుల్లో డెడ్ సీ మట్టిని ఉపయోగిస్తారు. ఈ మట్టిలో ఇరవై ఒక్క రకాలైనటువంటి ఖనిజాలు కలిగి వుంటాయి.అంతే కాదు ఇందులో ఇంకా ఆరోగ్యకరమైన ప్రకాశించే చర్మానికి అవసరైమనటువంటి బి6 , బి12 మరియు ఇ విటమిన్లు ఇందులో పుష్కలంగా ఉంటాయి.వీటిని ఉపయోగించడం వల్ల చర్మం పొడబారనీయకుండా ఎప్పుడు తేమగా ఉంచేందుకు ఉపయోగపడుతుంది. గ్లిసరిన్ మరియు మాయిచ్హరైజింగ్ సబ్బులు చర్మన్ని పొడిబారనియకుండా ఉంచడానికి, విటమిన్ సబ్బులు మన శరీరంలొ విటమిన్లు పూరించటనికి -ప్రొటీన్ సబ్బులు మన చర్మంలొ ప్రొటీన్ లను పూరించటానికి .కెఫీన్ సబ్బులు స్నానం తర్వాత ఫ్రెష్ గా ఉండటానికి. సన్ స్ర్కీన్ సబ్బులు మన చర్మం ఎండలో నల్లబడకుండా ఉండటానికి ఇన్ని రకాలుగా ఉపయోగపడుతున్నాయి.

English summary

Skin Care With Natural Handmade Soaps..! | ప్రకృతి సిద్దమైనటువంటి సబ్బులతో సహజసౌందర్యం

Every time we switch on the TV, we can't help being the recipients of innumerable ads of soaps for fairness, soft skin, and even soaps that act as a deodorant. And of late, the new rage is "Natural, handmade soaps". So how is it any different from a regular bar of soap?
 All natural soaps are made from a combination of three ingredients - firstly, natural vegetable oils like coconut, palm or olive oil; secondly natural fragrance oils and finally, some garnishing like flowers, buds, leaves, herbs and grains to enhance the look.
Story first published: Monday, June 18, 2012, 12:35 [IST]
Desktop Bottom Promotion