For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్యూటీ పార్లర్ అవసరం లేకుండానే చర్మ సౌందర్యాన్ని పెంచే స్ట్రాబెర్రీ..

|

స్ట్రాబెరీ ప్రూట్ ఆరోగ్యానికి మాత్రమే కాదు.. అందాన్నికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. స్ట్రాబ్రెరీలో ఉన్న అద్భుతమైన క్వాలీటీస్ వల్ల చాలా రకాల స్కిన్ కేర్ఉత్పత్తులలో వాడటం మనం గమనించే ఉంటాం. స్ట్రాబెర్రీలో ఉన్న యాంటీఆక్సిడెంట్స్ చర్మ సంరక్షణలో బాగా ఉపయోగపడుతాయి. ఇందులో ఉన్న యాంటీఆక్సిడెంట్స్ చర్మలోని టాక్సిన్ ను తొలగిస్తుంది. డెడ్ స్కిన్ తొలగించి, చర్మాన్ని శుభ్రపరుస్తుంది.

స్ట్రాబెరీ మాస్క్‌ స్ట్రాబెరీలతో ఫేస్‌ మాస్క్‌ వేసుకుంటే ముఖానికి చక్కటి మెరుపు వస్తుంది. ముఖం మీద మచ్చలు తగ్గి ముఖం చంద్రబిండంలా వుంటుంది.చక్కటి నిగారింపు వస్తుంది. అంతేకాదు.దీని వలనఫేస్‌ ప్రెష్‌గా వుంటుంది. పార్లర్స్, సలోన్స్, స్పాల చుట్టూ తిరగడం కంటే ఈ నేచురల్ స్కిన్ కేర్ వల్ల అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. అందుకు స్ట్రాబెరీతో వేసుకొనే కొన్ని ఫేస్ ప్యాక్స్ కొన్ని మీకోసం ...

Strawberry Face Masks For A Smooth Skin

స్ట్రాబెరీ- తేనె ఫేస్ ప్యాక్: ఈ స్ట్రాబెరీ ఫేస్ ప్యాక్ సహజమైన సౌందర్యాన్నిస్తుంది. మూడు టేబుల్ స్పూన్ల స్ట్రాబెర్రీ పేస్ట్ లో ఒక చెంచా తేనె కలిపి బాగా మిక్స్ చేసి, ముఖానికి అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత అరగంట పాటు అలాగే ఉంచుకొని, ఆ తర్వాత చల్లని నీటితో ముఖం శుభ్రపరచుకోవాలి. ఈ స్ట్రాబెరీ తేనె మిశ్రమప్యాక్ ను వారానికి ఒకటి లేదా రెండు సార్లు వేసుకోవడం వల్ల చర్మ ప్రకాశవంతంగా మారుతుంది.

స్ట్రాబెర్రీ- పెరుగు ఫేస్ ప్యాక్: స్ట్రాబెర్రీలను మొత్తగా పేస్ట్ చేసి దానికి రెండు చెంచాల పెరుగును బాగా మిక్స్ చేసి ముఖానికి, మెడకు అప్లై చేయాలి. అరగంట తర్వాత మునివేళ్ళతో బాగా మర్ధన చేసి చల్లటి నీటితో వాష్ చేసుకోవాలి. ముఖాన్ని నీటితో శుభ్రపరచుకొన్న తర్వాత కూడా చేత్తో ముఖమంతా మసాజ్ చేసుకొన్నట్లైతే రక్త ప్రసరణ బాగా జరిగి ముఖం కాంతివంతంగా, తాజాగా , శుభ్రమైన చర్మ సౌందర్యం సొంతమౌతుంది.

స్ట్రాబెర్రీ - నిమ్మరసం: ఇది కూడా ఒక మంచి స్కిన్ కేర్ ఫేస్ మాస్క్. స్ట్రాబెరీ, నిమ్మరసం కాంబినేషన్ చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది. అరకప్పు స్ట్రాబెర్రీ పేస్ట్ ను తీసుకొని, దానికి ఒక చెంచా నిమ్మరసంను మిక్స్ చేసి, ముఖానికి పట్టించి ఇరవై నిముషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల సహజ చర్మ సౌందర్య ఏర్పడుతుంది. నిమ్మరసం చర్మ రంద్రాలను తెరచుకొనేలా చేసి శుభ్రపరుస్తుంది. స్ట్రాబెర్రీ చర్మాన్ని బిగుతా చేసి, యవ్వనంగా ఉంచుతుంది.

స్ట్రాబెర్రీ- కార్న్ ఫ్లోర్: చర్మాన్ని శుభ్రపరచుటలో ఇదొక నేచురల్ ఫేస్ ప్యాక్. అరకప్పు స్ట్రాబెరీ పేస్ట్ లో ఒక టేబుల్ స్పూన్ కార్న్ ఫోర్ ను మిక్స్ చేసి, ముఖానికి పట్టించాలి. పదిహేను నిముషాల తర్వాత క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ లో ముఖం అంతా బాగా మసాజ్ చేసి, మంచినీటితో శుభ్ర చేయాలి. దాంతో ముఖంలో ఏర్పడ్డ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ను తొలగించి ముఖానికి తాజా దనాన్ని అందిస్తుంది.

స్ట్రాబెర్రీ: స్ట్రాబెర్రీ ఫేస్ ఫ్యాక్ ఒక అద్భుతమైన ఫేస్ ప్యాక్. ఏటువంటి పదార్థాన్ని మిక్స్ చేయకుండా ఒక స్ట్రాబెర్రీ మాత్రమే ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల నిర్జీవంగా ఉన్న చర్మం, కాంతివంతంగా మారుతుంది. స్ట్రాబెర్రీని బాగా మెత్తగా చేసి ముఖాన్ని శుభ్రపరుచుకొని, తేమ లేకుండా పొడి వస్త్రంతో తుడిచి ఆ తర్వాత ఈ ప్యాక్ అప్లై చేసి ఇరవై నిముషాల తర్వాత శుభ్రపరచుకోవాలి.

English summary

Strawberry Face Masks For A Smooth Skin | సున్నితమైన చర్మ సౌందర్యానికి స్ట్రాబెర్రీ ఫేస్ ఫ్యాక్..

You will find strawberry in the ingredients list of many skin creams. Strawberry is used for many skin treatments due to its great qualities. A strawberry is good for the face because it is rich in antioxidants. These antioxidants release all the toxins from our skin and remove the harmful free radicals. Instead of going to the salons for expensive skin treatments, use these natural skin care ways to enhance your beauty. Here are some face masks using strawberries that you can use to have a smooth, radiant and flawless skin.
Desktop Bottom Promotion