For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వర్షాకాలంలో చర్మ సౌందర్యాన్ని కాపాడే చిట్కాలు...!

|

Tips to Take Care of Skin in Monsoon ...!
వర్షాకాలంలో చలి, వాతావరణం కారణంగా మన చర్మం పగిలి, పెళుసుబారడం, మంట పెట్టడం, దురదపెట్టడం, లాంటి సమస్యలు తలెత్తుతాయి. వీటి పరిష్కారం కోసం వేజలీన్ వంటి క్రీములు ఎక్కువగా పూస్తుంటారు కానీ ఇవి సమస్యకు పరిష్కారం కాదు. చలికాలంలో చర్మం పగులకుండా ఉండాలంటే ముందుగా మనం ఒళ్లు రుద్దుకునేందకోసం సబ్బులను వాడటం మానేయాలి. రోజూ ఒళ్లంతా కాస్త మంచి నూనెను రాసుకుని ఆ తర్వాత శనగపిండితో ఒంటిని రుద్దుకుంటూ స్నానం చేయాలి. మరీ అంతగా అవసరమనుకుంటే ఓ నాలుగయిదు రోజులకు ఓ సారి సబ్బును వాడితే సరిపోతుంది.

చలికాలంలో శనగపిండిని వాడితే ప్రయోజనాలు: ప్రధానంగా మన చర్మం పాడవ్వదు. సబ్బుల వాడకం, తద్వారా ఆయా పరిశ్రమల నుంచి ఉత్పన్నమయ్యే కాలుష్యం తగ్గిపోతాయి. పగిలిన చర్మ కోసం వాడే క్రీముల వంటి వాటి వాడకం తగ్గిపోతుంది. చర్మం ఆరోగ్యంగా ఉండటమే గాక డబ్బులు కూడా ఆదా అవుతాయి. పర్యావరణానికి అనుకూలంగా ఉండే శనగపిండితో స్నానం విధానాన్ని అసహ్యించుకోకూడదు. అలాగే చలికాలంలో దొరికే అన్ని రకాల పళ్లను, కాయగూరలను తినడం ద్వారా కూడా చర్మాన్ని చక్కగా ఉంచుకోవచ్చు మరి.

పొడిచర్మం కలవారు చర్మాన్ని శుభ్రపరచుకునేటప్పుడు.. పాలల్లో వెజిటబుల్ ఆయిల్‌ ను వేసి బాగా కలిపి కాటన్‌ తో చర్మంపై రుద్దుకోవాలి. మృదువైన చర్మం కలిగినవారైతే, ఆరెంజ్ జ్యూస్‌ లో తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇరవై నిమిషాలపాటు అలాగే ఉంచి ఆ తరువాత చల్లటి నీటితో కడగాలి. ఇంకో పద్ధతిలో... పెరుగు, పసుపు, తేనె కలిపిన మిశ్రమాన్ని ముఖంపై మర్ధనా చేసి, పదిహేను నిమిషాల తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

మాస్క్ వేసుకునేటప్పుడు... పొడిచర్మం వారు తేనె, రోజ్‌ వాటర్‌, పాలపొడి కలిపి ముఖానికి పట్టించాలి. ఇరవై నిమిషాలుంచి కడిగేయాలి. ఈ చర్మం గలవారు గుడ్డు సొనను కూడా ముఖానికి అప్లై చేయవచ్చు. ఇలా చేస్తే చర్మం పొడిగా ఉండదు. ఇంకా... అరటిపండు, యాపిల్‌, బొప్పాయి వంటి పండ్ల గుజ్జును ముఖానికి పట్టించి ఇరవై నిమిషాలు ఆరనిచ్చి నీటితో కడిగినా ఫలితం ఉంటుంది.

మసాజ్ ఆయిల్, గంధం పొడి, రోజ్ వాటర్, తేనె కలిపిన మిశ్రమంతో బాడీ మసాజ్‌ చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే... చర్మం పొడిబారకుండా, మృదువుగా ఉంటుంది. కొంతమందికి చర్మం పగిలినట్టుగా ఉంటుంది. ఇలాంటివారు సబ్బుతో స్నానం చేయడం పూర్తిగా మానాలి. సున్నిపిండి ఉపయోగిస్తే మంచిది. ప్రతి రోజూ స్నానం చేసిన తర్వాత వెనిగర్‌ కలిపిన నీళ్ళను శరీరంపై పోసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు.

English summary

Tips to Take Care of Skin in Monsoon ...! | చర్మ సౌందర్యాన్ని కాపాడే చిట్కాలు...!

Monsoon is the time when our skin behaves little bit different thus it is extremely essential that we should take care of our skin during the rainy season in order to look fabulous. The high humidity cannot be allowing our skin to breathe and helps dust particles to stick to skin more.
Story first published:Monday, July 30, 2012, 12:20 [IST]
Desktop Bottom Promotion