For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిత్యయవ్వనాన్ని ప్రోత్సహించే 14 యాంటీఏజింగ్ ఫుడ్స్

By Super
|

ప్రస్తుత రోజుల్లో అకాల వృద్ధాప్యం సాధారణంగా కనిపించే సమస్యగా ఉంది. అందుకు కారణం బిజీ జీవితాలు. దాంతో సరైన నిద్ర, ఆహారాలు కొరవడుతాయి. దాని ఫలితంగా అనారోగ్యాలు ఎదురౌతాయి. అంతే ఇక ఆరోగ్యాన్ని సరిగా కాపాడుకోకపోవడం వల్ల, మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు వంటి జబ్బులు మనుషులను ఆధోళనకు గురిచేస్తాయి. జీవితం ఎంత కష్టతరమైనా, ఎంత బిజీగా ఉన్నాకూడా ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవడం చాలా ముఖ్యం. అందులో మనం తీసుకొనే ఆహారం ఆరోగ్యకరమైనది అయితే మరికొద్ది రోజు బ్రతకాడానికి అవకాశం ఉంటుంది. అదినిజం. అంతే కాకుండా మంచి ఆహారంతో పాటు చిన్నపాటి వ్యాయామాల వల్ల చిన్న వయస్సులోనే వచ్చే వృద్ధాప్య లక్షణాలను తొలగించుకోవచ్చు.

మనం తీసుకొనే ఆహారాలు, పూర్తిగా ఉపయోగపడేవిగా ఉండాలి. ముఖ్యంగా రసాయనికంగా పండిచిన ఆహారాలకు దూరంగా ఉంటూ, సేంద్రియ సద్దతులో పండించిన వాటికి ప్రాధాన్యత కల్పించడం ఆరోగ్యానికి చాలా ముఖ్యం. తీసుకొనే ఆహారంలో విటమిన్లు, మినిరల్స్, మరియు యాంటీఆక్సిండెంట్లు మరియు ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉండేలా చూసుకోవడం వల్ల ప్రమాదకరమైన వ్యాధుల నుండి మనల్ని మనం రక్షించుకోవచ్చు.

మనం తీసుకొనే ఆహారంలో ఫోటో కెమికల్స్ మనకు తెలియకుండానే అనేక ప్రయోజనాలను మనకు అంధిస్తాయి. దాంతో అకాల వృద్ధాప్యంను నివారించవచ్చు. అనేక చర్మం సమస్యల నుండి బయటపడవచ్చు. మరియు అనారోగ్యాలనుండి ఉపశమనం పొందవచ్చు. యాంటీఏజింగ్ కు అద్భుతంగా ఉపయోగడే కొన్ని ఆహారాల మనకు ఏవిధంగా ఉపయోగపడుతాయో ఒక సారి చూద్దాం..

యాపిల్స్/ద్రాక్ష/చెర్రీస్/స్ట్రాబెర్రీస్:

యాపిల్స్/ద్రాక్ష/చెర్రీస్/స్ట్రాబెర్రీస్:

ఆపిల్స్, ద్రాక్ష, చెర్రీస్, స్ట్రాబెర్రీస్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. ఈ ఫ్రూట్స్ ఇంకా ఎలాజిక్ యాసిడ్స్ కలిగి ఉండి భయంకరమైన క్యాన్సర్ వ్యాధితో పోరాడుతుంది. ఎలాజిక్ ఎంజైమ్ క్యాన్సర్ సెల్స్ ను బ్లాక్ చేసి, క్యాన్సర్ బారీన పడకుండా చేస్తుంది.

క్యాబేజ్ ఫ్యామిలి:

క్యాబేజ్ ఫ్యామిలి:

బ్రాసికా ఫ్యామిలికి చెందిన(క్యాబేజ్, కాలీఫ్లవర్, బ్రొకోలీ, బ్రసెల్ స్ప్రాట్స్)లో అనేక వ్యాధుల నుండి రక్షణ కల్పించే లక్షణాలు పుష్కలంగా ఉన్నట్లు బలమైన ఆధారం ఉంది. బీటాకెరోటిన్, ఇండోలెస్ గ్లూకోయిన్నోలేట్స్ మరియు ఐసోథైయోసైనేట్స్ (ముఖ్యంగా బ్రోకోలీలో)వెజిటేబుల్స్ లో కొన్ని రకాల క్యాన్సర్ నివారించే లక్షణాలు ఉన్నట్లు కనుగొన్నారు.

మిర్చి/ మిరియాలు:

మిర్చి/ మిరియాలు:

పచ్చిమిర్చి సాధారణంగా చాలా మంది మిర్చిని తినరు. కారణం కడుపులో మంట, నొప్పి కలిగిస్తుందని. కానీ, నిపుణుల ప్రకారం,తేలికపాటి మంట, చికాకు ప్రభావంను కలిగించవచ్చు అని నమ్ముతారు. కానీ మద్యం మరియు ఇతర చికాకు నుండి కడుపును కాపాడుతుంది. కడుపులో అల్సర్ మరియు సెల్ డ్యామేజ్ జరగకుండా సహాయపడుతుంది. మరియు వీటిలో విటమిన్ సి మరియు యాంటీఆక్సిడెంట్స్ కలిగిఉన్నాయి. క్యాప్సైసిన్, అనే పోషకాంశం అనామ్లజనకాలు మిర్చి కారంగా ఉండటానికి ప్రధాన కారణం.

సిట్రస్ పండ్లు:

సిట్రస్ పండ్లు:

ఆరెంజ్, స్వీట్ లైమ్, ద్రాక్ష, నిమ్మరసం మొదలగునవన్నీ విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్ మరియు లెమనోనిన్ పుష్కలంగా ఉండి, కార్సినోజెన్స్ (క్యాన్సర్ కారకాలు)మరియు క్యాన్సర్ తో పోరాడే కణాలు విడగొట్టి క్యాన్సర్ కణాల మీద అద్యయనం చేశారు.

వెల్లుల్లి మరియు ఉల్లిపాయ ఫ్యామిలి:

వెల్లుల్లి మరియు ఉల్లిపాయ ఫ్యామిలి:

వెల్లుల్లిలోని అలిసిన్ చెడు ఎడిఎల్ కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిసరైడ్స్ తగ్గిస్తాయి మరియు రక్తంలో మంచి హెడిఎల్ కొటెస్ట్రాల్ ను పెంపొందిస్తాయి. ఇది రక్తపోటు స్థాయిలు తగ్గిపోతాయి, మరియు రోగనిరోధక శక్తి సౌలభ్యం మరియు యాంటీబయాటిక్ లక్షణాలు కలిగి ఉన్నాయి. అల్లియమ్ కాంపౌండ్స్ ను కూడా ఉల్లిపాయలో కనుగొనబడింది. ఇవి గుండే, మరియు కాలేయవ్యాధులను నిరోధించడానికి సహాయపడుతాయి.

గ్రీన్ టీ:

గ్రీన్ టీ:

గ్రీన్ టీలో క్యాన్సర్ వ్యతిరేక ప్రభావం కలిగించు లక్షణాలు ఉన్నాయని పరిశోధనలు సూచించాయి. గ్రీన్ టీలోని పోలిఫినోల్స్ ను (ఒక రకమైన యాంటీఆక్సిండెంట్స్) అధికంగా కలిగి ఉన్నాయి. ఇవి ముఖ్యంగా ఇవి గుండె మరియు కాలేయ వ్యాధి కోసం మంచి ఫలితాలను చూపించినది.

గ్రీన్ లీఫి వెజిటేబుల్స్:

గ్రీన్ లీఫి వెజిటేబుల్స్:

కూరాకు, మెంతి, అమరాంత్, పార్ల్సే, కొత్తిమీర, వంటి వాటిలో అద్భుతమైన బీటాకెరోటీన్ ఉంది. దీన్ని మాత్రమే అంధిచడం కాకుండా, క్యాల్షియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి మరియు పోషకాలను అంధిస్తాయి. కాన్సర్ వ్యతిరేకంగా పనిచేసే గ్లూటాతియోన్ ఒక క్రియాశీల పదార్ధంగా ఉంది.

ఓట్స్:

ఓట్స్:

ఒక అద్భుతమైన హార్ట్ మెడిసిన్ ఇది. అరకప్పు డ్రై ఓట్స్ లేదా ఒక కప్పు ఓట్ మీల్ తీసుకోవడం వల్ల మీ బ్లడ్ కొలెస్ట్రాల్ లో ఒక మంచి ఫలితాన్ని ఉంచుతుంది మరియు రక్తంలోని చెక్కర స్థాయిలను నియంత్రిస్తుంది.

ఆయిల్ ఫిష్:

ఆయిల్ ఫిష్:

మెకరెల్, సాల్మన్, తున, సార్డినిస్, హెరింగ్, లేక్, ట్రౌట్ వంటి సీఫిష్ లో ఓమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా కలిగి ఉంటాయి. ఇవి రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా నిరోధించిచ హార్ట్ అటాక్ రాకుండా కాపాడుతాయి. వీటిలో ఉండే ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మధుమేహం, క్యాన్సర్ మరియు మరియు కీళ్ళ నొప్పులు, సోరియాసిస్ మరియు వ్రణోత్పత్తి ప్రేగు శోథ వంటి నొప్పి తగ్గింపు మరియు స్వీయ రోగనిరోధక వ్యాధులు వ్యతిరేకంగా రక్షించేందుకు సహాయపడుతాయి.

ఆలివ్ /రాప్ విత్తన నూనె:

ఆలివ్ /రాప్ విత్తన నూనె:

ఏదైనా సరే అధికంగా ఫ్యాట్ కలిగినవి చాలా హాని కలుగజేస్తాయి. కానీ సంతృప్త కొవ్వులు స్థానంలో అసంతృప్త కొవ్వులు(ముఖ్యంగా మోనోసాచురేటెడ్ ఫ్యాట్) ఉపయోగకరంగా ఉంటుంది. ఆలివ్ మరియు రాప్ విత్తన నూనె రెండింటిలో రెండు MUFA సమృద్ధిగా ఉంటాయి.

బొప్పాయి/క్యారెట్లు:

బొప్పాయి/క్యారెట్లు:

ఈ, పసుపు వర్ణంలో ఉండే అన్నీ/ ఆరెంజ్ ఫ్రూట్స్ మరియు వెజిటేబుల్స్ ఉదా గుమ్మడి, మామిడి, ఆప్రికాట్స్, స్వీట్ పొటాటోస్, క్వాష్ వంటివాటన్నింటోలో బీటాకెరోటిన్ మరియు విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. జీర్ణక్రియకు సహాయపడే ఎంజైమ్ లో బొప్పాయలో పుష్కలంగా ఉన్నాయి.

సోయా ప్రొడక్ట్స్:

సోయా ప్రొడక్ట్స్:

సోయా బీన్, సోయా ఫ్లోర్, సోయా మిల్క్, మరియు టోఫు ఇవన్నీ లోఫ్యాట్ మరియు క్యాల్షియం రిచ్ ఫుడ్స్. సోయా ఉత్పత్తుల్లో Genistein సమృద్ధిగా ఉంటుంది. ఇది కొన్ని రకాల క్యాన్సర్ల రాకుండా నిరోధిస్తుంది.

టమోటో:

టమోటో:

క్యాన్సర్ నిరోధక ప్రభావాలు కలిగిన కెరోటినాయిడ్ మరియు లౌకోపిన్ కలిగి ఉంది. ఇంకా వీటిలో coumaric acid మరియు క్లోరోజెనిక్ యాసిడ్ అధికంగా ఉండి క్యాన్సర్ కారకాలను శరీరం నుండి బయటకు నెట్టివేయబడుతుంది.

పెరుగు:

పెరుగు:

ప్రత్యక్ష బ్యాక్టీరియాను కలిగి జీర్ణక్రియ కోసం పోరాడే లక్షణాలు పుష్కలంగా ఉన్నట్లు కొన్ని అధ్యయానాలు నిరూపించబడ్డాయి. అంతే కాకుండా ఇందులో క్యాల్షియం పుష్కలంగా ఉండి, వయస్సు పైబడ్డాక బోలు ఎముకల వ్యాధి వ్యతిరేకంగా సహాయపడుతుంది. కాబట్టి ఇటువంటి ఆహారాలను మీ రెగ్యులర్ డైట్ లిస్ట్ లో చేర్చుకొని, యవ్వనంగా ఉండటానికి జాగ్రత్త తీసుకోండి.

English summary

14 Foods that stop ageing

These are not super foods they are part of the same healthy diet we have understood for years. It is how much we understand about them that have changed. Researchers are looking at health benefits of chemicals from plant foods.
Desktop Bottom Promotion