బేబీ ఆయిల్ పిల్లలకే కాదు..పెద్దలకు కూడా అద్భుతమైన ప్రయోజనం..!

By Sindhu
Subscribe to Boldsky

బేబీ ఆయిల్: పిల్లలు మృదువైన చర్మం పొందడానికి బేబీ ఆయిల్ ను ఉపయోగిస్తారు. అయితే బేబీ ఆయిల్ ను పిల్లలకు మాత్రమే ఉపయోగించాలని ఎక్కడా చెప్పలేదు. ఇది చాలా మృదువైనది మరియు ఇందులో కొన్ని కెమికల్స్ తో తయారు చేయబడినది. పెద్దల కోసం తయారు చేసే కాస్మోటిక్స్ కంటే ఇది చాలా ఉత్తమమైనది. బేబీ ఆయిల్ వల్ల అనేక ఉపయోగాలున్నాయి. బేబీ ఆయిల్ చర్మాన్ని మృదువుగా ఉంచడమే కాదు ఇది చర్మానికి మేకప్ వల్ల ఎటువంటి నష్టం కలిగించకుండా మేకప్ తొలగించడంతో సహా అనేక ఉపయోగాలున్నాయి. బేబీ ఆయిల్ వల్ల మరో అద్భుతమైన ప్రయోజనం కమిలిన చర్మానికి మేలు చేస్తుంది. మరియు చేతి వేలి ఉంగరాలు వేళ్ళకు బిగుసుకుపోయినప్పుడు ఈ బేబీ ఆయిల్ ను ఉపయోగించవచ్చు. మరియు బేబి ఆయిల్ వల్ల చర్మనుండి వెలువడే లేటక్స్ పెయింట్స్ ను తొలగించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది.

బేబీ ఆయిల్ ను బహుముఖంగా ఉపయోగించేటటువంటి అంశం. అందుకే బాత్రూమ్ షెల్ఫ్ లో బేబీ ఆయిల్ బాటిల్ ను బాత్ రూమ్ లో ఉంచడం మంచిది. బేబీ ఆయిల్ మీ బ్యూటీ విషయంలో అనేక ప్రయోజనాలు సాధించడానికి కొన్ని మార్గాలున్నాయి. అవి క్రింద ఇవ్వబడ్డాయి. అందం విషయంలో బేబీ ఆయిల్ ఎలా ఉపయోగపడుతుందో ఒక సారి పరిశీలించండి...

మాయిశ్చరైజర్: బేబీ ఆయిల్ అద్భుతమైన మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. చర్మాన్ని సున్నితంగా మరియు నునుపుగా మార్చుతుంది. ఇది శీతాకాలంలో పొడిబారిన మరియు చీలిన చర్మానికి మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కాబట్టి స్నానానికి వెళ్ళే పది నిముషాల ముందు బేబీ ఆయిల్ ను బాడీకి మసాజ్ చేసుకొనొ తర్వాత స్నానం చేసుకోవచ్చు.

మేకప్ రిమూవర్: చర్మానికి ఎటువంటి హాని కలిగించకుండా బేబీ ఆయిల్ తో మేకప్ ను తొలగించుకోవచ్చు. ఇది చర్మ రంధ్రాలను మూసుకొనే లా చేయదు. ఒక కాటన్ బాల్ ను తీసుకొని దాని మీద బేబీ ఆయిల్ ను వేసి, దాంతో ముఖాన్నంతటిని శుభ్రం చేసుకోవడం వల్ల మేకప్ ను సులభంగా తొలగించుకోవచ్చు. ఇలా బేబీ ఆయిల్ ను ముఖానికి అంతా రాసిన తర్వాత ఒక పొడి టవల్ ను తీసుకొని శుభ్రంగా తుడిచేసుకోవాలి.

మసాజ్ ఆయిల్: కందిన లేదా కమిలిన చర్మానికి బేబీ ఆయిల్ చాలా అద్భుతమైనది. కాబట్టి, ఇది మసాజ్ ఆయిల్ గా ఉపయోగించడానికి ఫర్ ఫెక్ట్ ఆయిల్ గా గుర్తించవచ్చు. ఇది మీ చర్మం మరియు మీ చేతులు మధ్య ఘర్షణను తగ్గిస్తుంది. ఇది మీ శరీరం మీద ఉన్న చర్మాన్ని మృదువైన మరియు suppleచేస్తుంది.

షేవింగ్: బ్యూటీ బెనిఫిట్స్ లో బేబీ ఆయిల్ ను అందానికి మాత్రమే పరిమితం చేయలేదు. ఇది షేవింగ్ క్రీమ్ గా కూడా ఉపయోగించి చర్మాన్ని సున్నితంగా ఉంచి కాళ్ళు, చేతుల మీద హేయిర్ ను సులభంగా తొలగించడానికి ఉపయోగించవచ్చు. దీన్ని ఉపయోగించడం చాలా సులభం. దీన్ని ఉపయోగించిన తర్వాత చర్మాన్ని సున్నితంగా మృదువుగా ఉంచుతుంది. అంతే కాదు రేజర్ బర్న్ ను నిరోధిస్తుంది.

బాత్ ఆయిల్: బేబీ ఆయిల్ బాత్ ఆయిల్ గా ఎక్స్ లెంట్ గా పనిచేస్తుంది. కొన్ని చుక్కల బేబీ ఆయిల్ ను స్నానం చేసే నీటిలో లేదా మీ ఫెర్ఫ్యూమ్ లో మిక్స్ చేసి శరీరానికి స్ప్రే చేసుకోవడం వల్ల ఆ రోజంతా ఉత్సాహంగా..ప్రశాంతంగా ఉంటారు.

వెచ్చగా ఉంచుతుంది: బేబీ ఆయిల్ ను వింటర్ లో ఎక్కువగా ఉపయోగిస్తారు. శీతాకాలంలో బేబీ ఆయిల్ తో మీ శరీరానికి మర్ధనా లేదా మసాజ్ చేసుకోవడం వల్ల ఇది మీ శరీరాన్ని వెచ్చగా మరియు టోస్టీగా ఉంచుతుంది. ఈ ఆయిల్ చర్మ రంధ్రాలను మూసుకొనేలా చేస్తాయి. మరియు దాంతో శరీరంలో ని వేడి కోల్పోదు. ఇంకా శీతాకాలంలో ఇది చర్మం పొడి బారడం లేదా పొరలుగా కావడాన్ని నిరోధిస్తుంది.

స్ట్రెచ్ మార్క్: స్ట్రెచ్ మార్క్స్ తొలగించడంలో బేబీ ఆయిల్ చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. మహిళలు గర్భం ధరించినప్పుటు వారి పొట్టమీద చారలు ఏర్పడకుండా నునుపైన మరియు క్లియర్ స్కిన్ పొందడానికి బేబీ ఆయిల్ ను శరీరం మీద పొట్ట మీద మసాజ్ చేసుకోవాలి. కాబట్టి బేబీ ఆయిల్ వల్ల పెద్దలకు కూడా ఇన్ని రకాల బ్యూటీ బెనిఫిట్స్ అంధించేటప్పుడు బేబీ కలిగే వరకూ వేచిఉండటం ఎందుకు? మీరు కూడా ఇప్పటి నుండే ఉపయోగించడాన్ని మొదలు పెట్టండి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Different Ways To Use Baby Oil | బేబీ ఆయిల్ పెద్దల చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేస్తుందా?

    Baby oil is used on infants to maintain their soft skin. But nowhere does it say that its use is restricted only to babies. Since it is mild and has very few chemicals, it is much better than the cosmetics made for adults.
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more