For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మొటిమలను శాశ్వతంగా మాయంచేసే ఫ్రూట్ ఫేస్ ప్యాక్

|

‘అందమైన ప్రేమరాణి లేత బుగ్గపై చిన్న మొటిమ కూడ ముత్యమేలే' అంటూ ప్రేమికుడు మురిసిపోతాడు. ఒక్క మొటిమ ఉంటే బాగానే ఉంటుంది. మరి ఎక్కువ అయితే ముఖం అంద విహీనంగా తయారవుతుంది. టీనేజ్‌లోకి అడుగిడ్డిన పిల్లలందరూ ఆడ, మగ తేడా లేకుండా ఎదుర్కొనే సమస్య మొటిమల సమస్య. వయస్సులో పాటు శరీరంలో జరిగే హర్మోన్స్‌ మార్పుల వల్ల చిన్నచిన్న మొటిమలు రావడం సాధారణమైన విషయమే అయినప్పటికీ యువత వీటి కారణంగా అనేక ఆందోళనలకు గురవుతుంది. ముఖంపై ఎక్కువగా రావడం కారణంగా చాలా ఇబ్బందిగా ఫీల్‌ అవుతారు. మానసికంగా కృంగదీసే ఈ మొటిమలు ముఖంపై మచ్చలను, గుంటలు ఏర్పడానికి కూడా కారణం అవుతాయి.

ఆరోగ్యం మొత్తానికి పండ్లు చాలా గ్రేట్. పండ్లు తినడం వల్ల మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా, పండ్లను రెగ్యులర్ గా తినడం వల్ల శుద్దమైన చర్మం, మెరిసే చర్మాన్ని పెంపొందించుకోవచ్చు. పండ్లతో మీ ముఖానికి ఫేస్ మాస్క్, లేదా ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. ఇంకా ఫేస్ స్రబ్ గాను, టోనర్ గాను, క్లెన్సర్ గా కూడా పండ్లు బాగా ఉపయోగపడుతాయి. ఫ్రూట్ ఫేషియల్ గురించి మనందరం ఏదో ఒక సందర్భంలో వినే ఉంటాం లేదా చదివే ఉంటాం. ఫ్రూట్ ఫేషియల్ అంత కష్టమైన పనేం కాదు. జస్ట్ అనుసరించే పద్దతి వల్ల చర్మ శుభ్రపడే విధానం మరియు మాయిశ్చరైజ్ చేసే విధానం తెలుసుకుంటే చాలు. ఫ్రెష్ ప్రూట్స్ తో ఫేషియల్ చేసుకొన్నట్లే...

అందుకు నేచురల్ గా దొరికే పండ్లను ఉపయోగిస్తే చాలు.. ఇంట్లోటే ఫ్రూట్ ఫేషియల్ చేసేసుకోవచ్చు. అందుకు స్పా లేదా సలోన్ లకు వెళ్ళి కెమికల్ బేస్డ్ ఫ్రూట్ ఫేస్ ప్యాక్స్ తో అందాన్ని చెరుపుకొనే కొంటే ఇంట్లోనే సహజసిద్దంగా ఫ్రూట్ ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. కొన్ని ఆర్గానిక్ ఫ్రూట్ ఫేస్ ప్యాక్స్ కూడా అన్ని రకాల స్కిన్ టోన్ లకు సరిపోవు. కాబట్టి కొన్ని సింపుల్ ఫ్రెండ్లీ ఫ్రెష్ ఫ్రూట్స్ తో ఇంటి వద్దే ఫేషియల్ చేసుకోవచ్చు.

ఫేస్ ప్యాక్ కోసం ఉపయోగించి బొప్పాయి, బనానా మెత్తగా చేసి కొన్ని వంటింటి పదార్థాలు తేనె, నిమ్మ, పెరుగు వంటి వాటితో మిక్స్ చేసి ప్యాక్ లా వేసుకోవచ్చు. ఇటువంటి ఫేస్ ప్యాక్ లతో మొటిమలు పూర్తిగా దూరం అవుతాయి. చర్మం మీద మొటిమల వల్ల ఏర్పడ్డ రంధ్రాలను పూర్తిగా పూడ్చుకొనేలా చేసి బానానా ఫేస్ ప్యాక్ చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. అలాగే స్ట్రాబెర్రీ, బొప్పాయి కూడా హోం మేడ్ ఫేస్ ప్యాక్ గా వేసుకోవడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగించబడుతాయి. మరి ఇకెందుకు ఆలస్యం మొటిమలను శాశ్వతంగా నిర్మూలించడానికి హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్ లు ఈ క్రింది ఇవ్వబడ్డాయి వాటిని ట్రై చేసి, వ్యత్యాసాన్ని మీరే గమనించండి...

స్ట్రాబెర్రీ ఫేస్ ప్యాక్:

స్ట్రాబెర్రీ ఫేస్ ప్యాక్:

చర్మ సంరక్షణకు ఉపయోగించదగ్గ ఒక బెస్ట్ రెడ్ ఫ్రూట్ ఇది. స్ట్రాబెర్రీ చర్మం మెరిసేలా చేస్దుంది. స్ట్రాబెరీ ముఖానికి అప్లై చేయడం వల్ల మొటిమలను నివారించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అరకప్పు స్ట్రాబెరీలను మెత్తగా పేస్ట్ చేసి, అందులో సోర్ క్రీమ్ ను మిక్స్ చేసి, ముఖానికి అప్లై చేసి 10-15నిముషాలు అలాగే ఉంచి , తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేయడం వల్ల , ఇది చాలా ప్రభావవంతంగా మొటిమలను నివారిస్తుంది.

అరటి ఫేస్ ప్యాక్:

అరటి ఫేస్ ప్యాక్:

ముఖానికి రిఫ్రెషనస్ బనానా అరటిపండును చర్మ సంరక్షణ గ్రేట్ మాయిశ్చరైజర్ అని చెప్పవచ్చు. బనానా మాయిశ్చరైజర్ తో ముఖానికి రిఫ్రెషనస్ వస్తుంది. మొటిమలను తగ్గిస్తుంది. అరటి పండుతో వేసుకొనే ఫేస్ ప్యాక్ ల వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. చర్మానికి కావల్సిన తేమను అందించడమే కాకుండా, ఇది సూర్యుని తాపాన్ని తగ్గిస్తుంది, సూర్యకిరణాలవల్ల కమిలిన చర్మాన్ని తిరిగి పూర్వ స్థితికి తీసుకొస్తుంది. బనానాతో పాటు కొన్ని ఇతర పదార్థాలు తీసుకొని ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. బాగా పండిన బానానాకు ఆలివ్ ఆయిల్, రోజ్ వాటర్, కోకో బాటర్ కలిపి ఫేస్ ప్యాక్ వేసుకొని తర్వాత పాలు లేదా గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకొంటే మెరిసే, తాజా చర్మం మీ సొంతం అవుతుంది.

పుచ్చకాయతో ఫేస్ ప్యాక్:

పుచ్చకాయతో ఫేస్ ప్యాక్:

జ్యూసీ వాటర్ మెలోన్ ఒక మంచి రెడ్ ఫ్రూట్. ఇది ఆరోగ్య పరంగానే కాదు, సౌందర్య పరంగా కూడా ఎక్కువ మేలు చేస్తుంది. పుచ్చకాయను ముక్కలుగా కట్ చేసి ముఖం మీద మసాజ్ చేయాలి. తడి ఆరిన తర్వాత మరో తాజా ముక్కను తీసుకొని మల్లీ మసాజ్ చేయాలి. ఇలా మూడు నాలుగు సార్లు చేసిన తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. దాంతో చర్మం శుభ్రపడటమే కాదు కాంతివంతంగా మారుతుంది.

ఆపిల్ ఫేస్ ప్యాక్:

ఆపిల్ ఫేస్ ప్యాక్:

ముఖ చర్మంలో అన్ని రకాల సమస్యలను నివారించడంలో రెడ్ ఆపిల్ చాలా బెస్ట్. మీ ముఖంలో స్కార్స్ ఉన్నట్లైతే, ఆపిల్ ఫేస్ మాస్క్ తో చెక్ పెట్టవచ్చు. పొట్టుతో సహా ఆపిల్ ముక్కలను మెత్తగా పేస్ట్ చేసి, ఒక స్పూన్ రోజ్ వాటర్ మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. తడి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఆరెంజ్ ఫేస్ ప్యాక్:

ఆరెంజ్ ఫేస్ ప్యాక్:

వృద్ధాప్య ప్రక్రియలో ఆరెంజ్ ఆరెంజ్ లో సి విటమిన్ అధికంగా ఉంటుంది. ఇది చర్మాన్ని బాగా ఉపయోగపడుతుంది. సి విటమిన్ చర్మానికి మంచి మెరుగును అందిస్తుంది. విటమిన్ ఇ, ఎ, సి : కొలాజెన్ ఉత్పత్తికి,మెయింటెన్ చేయటానికి సహాయపడే వీటిని తినే ఆహారం ద్వారా సులువుగా శరీరానికి అందించవచ్చు. ఆరెంజ్ ఫేస్ ప్యాక్ తో మొటిమలను నివారించవచ్చు.

బొప్పాయితో ఫేస్ ప్యాక్:

బొప్పాయితో ఫేస్ ప్యాక్:

బొప్పాయి ఫేస్ ప్యాక్ తో ముఖంలో నున్న మొటిమలను తొలగించి కాంతివంతంగా చేస్తుంది. మొటిమలు ఎక్కువగా ఉన్నట్లైతే ఈ ఫేస్ ప్యాక్ ను ప్రతి రోజూ ఒక వారం పాటు క్రమం తప్పకుండా వేసుకొన్నట్లైతే తప్పకుండా ఫలితం ఉంటుంది.విటమిన్‌ సి ఎక్కువగా ఉంటుంది. నిర్జీవమైన చర్మాన్ని కాంతి వంతంగా చేస్తుంది. బొప్పా యి గుజ్జు తో ఫేస్‌ ప్యాక్‌ కూడా వేసుకోవచ్చు. ప్రతిరోజూ ఒక కప్పు బొప్పాయి ముక్కలు తింటే మంచిది. బొప్పాయిని మెత్తగా చేసి,అందులో పెరుగు లేదా తేనె మిక్స్ చేయాలి ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మాన్ని శుభ్రపరచడంతోపాటు చర్మాన్ని టైట్ చేస్తుంది. మొటిమలను పూర్తిగా నివారిస్తుంది.

చెర్రీ ఫేస్ ప్యాక్:

చెర్రీ ఫేస్ ప్యాక్:

ఎర్రగా ఉండే ఈ చిన్న చెర్రీ పండ్ల వల్ల చర్మ కాంతి రెట్టింపు అవుతుంది. ముఖంలో డార్క్ నెస్ ను తొలగితస్తుంది. చెర్రీఫ్రూట్ ఫేస్ ప్యాక్ మొటిమలతో వచ్చే మచ్చలను కూడా పూర్తిగా మాయం చేస్తుంది. ఒక గుప్పెడు చెర్రీపండ్లను మెత్తగా పేస్ట్ చేసి, అందులో రోజ్ వాటర్ మిక్స్ చేసి ముఖం, మెడకు అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత అరగంట అలాగే వదిలేసి తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

టమోటో ఫేస్ ప్యాక్:

టమోటో ఫేస్ ప్యాక్:

టమోటో వల్ల చర్మానికి చాలా అధికంగానే ప్రయోజనాలున్నాయి. టమోటోను చేత్తోనే బాగా గుజ్జులా నలిపేసి దాన్ని అలాగే ముఖం మరయిు మెడ మీద అప్లై చేసుకోవాలి. ముఖం మీద టమోటో రసం ఎండిన తర్వాత పాలు లేదా చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

రెడ్ ప్లమ్ ఫేస్ ప్యాక్:

రెడ్ ప్లమ్ ఫేస్ ప్యాక్:

ముదురు వర్ణంలో ఉండే ఈ రెడ్ ఫ్రూట్ ను స్కిన్ కేర్ కు నిరభ్యరంతంగా ఉపయోగించవచ్చు. ఈ రెడ్ ప్లమ్ ఫ్రూట్ ను రెండు లేదా మూడు తీసుకొని మిక్సీలో వేసి కొద్దిగా పాలు పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. ఈ బ్యూటీ ట్రీట్మెంట్ ను వారానికొక సారి ఫాలో చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దాంతో ముఖంలో డార్క్ నెస్ మరియు మొటిమలు తొలగిపోతాయి

ద్రాక్షతో ఫేస్ ప్యాక్:

ద్రాక్షతో ఫేస్ ప్యాక్:

స్కిన్ కేర్ కు రెడ్ గ్రేప్ అద్భుతంగా పనిచేస్తుంది. రెడ్ గ్రేప్ జ్యూస్ ను టీజోన్ ప్రదేశంలో అప్లై చేయవచ్చు. దాంతో ముఖంలో జిడ్డు వెంటనే తొలగిపోతుంది. దాంతో ముఖంలో నల్లటి వలయాలు, చారాలను తొలగించుకొని వయస్సు పైబడకుండా కనబడేలా చేస్తుంది.

English summary

Fruit Face Packs To Treat Acne

Acne is one of the most common skin problems that can be hard to deal with. Small white outburst can make your face look dull and scarred. There are many face packs and creams that can be applied to get rid of acne.
Desktop Bottom Promotion