For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముడుతల కోసం ఇంటిలో తయారు చేసుకొనే క్రీములు

By Lakshmi Perumalla
|

మనకి వయస్సు పెరుగుతున్న కొద్ది మన చర్మం స్థితిస్థాపకత కోల్పోవడం జరుగుతుంది. చర్మం స్థితిస్థాపకత కోల్పోతే ధృడంగా లేదా చెక్కుచెదరకుండా ఉండదు. అందువలన ముడుతలు,డార్క్ సర్కిల్స్,ఫైన్ లైన్లు వంటి వాటికీ కారణం అవుతుందని అంగీకరిస్తున్నాము. సాదారణంగా మహిళలకు వృద్ధాప్య చిహ్నాలు వచ్చాయని పీడకలలు వస్తూ ఉంటాయి. వారు ముడుతలు మరియు వృద్ధాప్యం చిహ్నాలను నివారించేందుకు క్రీములు మరియు అందం ఉత్పత్తులను టన్నుల కొద్ది మరియు మిలియన్ల కొద్ది ఉపయోగిస్తూ ఉంటారు. ముడుతలు,కర్లింగ్ చర్మం మరియు ఫైన్ లైన్లు తగ్గించేందుకు అనేక క్రీములు ఉన్నాయి.

ఏ చర్మ రకానికి అయిన రసాయన ఆధారిత సౌందర్య సాధనాలు సమర్థవంతమైనవి కాదు. ఎందుకంటే అంటువ్యాధులు,దద్దుర్లు మరియు మచ్చల వంటి ప్రతికూల ప్రభావాలకు కారణం కావచ్చు. ముడుతలు మరియు వయస్సు మీద పడిన ఇతర చిహ్నాల కొరకు ఇంట్లో తయారు చేసిన క్రీములు ఉపయోగించటం అనేది ఒక మంచి ఎంపిక అని చెప్పవచ్చు. ఇంట్లో తయారుచేసే క్రీములు సహజమైన ఉత్పత్తులను ఉపయోగించి తయారుచేయుట వలన ఏ విధంగానూ హానికరం కాదు. అవి శాశ్వత ప్రభావం కలిగి ఉంటాయి. ఏ చర్మ రకానికి అయిన ముడుతల కొరకు సహజమైన మరియు ఇంట్లో తయారుచేసే క్రీములు అందుబాటులో ఉన్నాయి.

అనేక మంది మహిళలకు ముడుతలు మరియు వృద్ధాప్యం చిహ్నాలు తగ్గించడానికి ఉపయోగకరమైన కొన్ని హోమ్మేడ్ క్రీములు ఉన్నాయి.

గుడ్డు మరియు క్రీమ్ మాస్క్

గుడ్డు మరియు క్రీమ్ మాస్క్

గుడ్డులో చర్మం బిగించి, ముడుతలను తగ్గించే బోయోటిన్,ప్రోటీన్లు మరియు విటమిన్లు వంటివి ఉన్నాయి. పచ్చసొన యాంటీ వృద్ధాప్యం లక్షణాలను కలిగి ఉంది. క్రీమ్ చర్మంను మృదువుగా మరియు ప్రకాశవంతమైన తయారుచేస్తుంది. ఈ మాస్క్ తయారుచేయటానికి ఒక గుడ్డును అర కప్పు క్రీమ్ లో కలపాలి. ఈ మిశ్రమానికి కొన్ని చుక్కల నిమ్మరసంను జోడించండి. మాస్క్ వేసుకొని 15 నిమిషాలు ఉంచండి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయాలి. ఈ ప్యాక్ క్రమంగా ఉపయోగిస్తే చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది.

అరటిపండు మరియు క్యారట్ మాస్క్

అరటిపండు మరియు క్యారట్ మాస్క్

ఈ కాంబినేషన్ కొద్దిగా విచిత్రంగా ఉంటుంది. కానీ చర్మంపై అద్భుతంగా పనిచేస్తుంది. అరటిపండు మరియు క్యారట్ రెండు కూడా చర్మంను బిగించి ముడుతలను తగ్గించేందుకు అవసరమైన ఖనిజాలను కలిగి ఉన్నాయి. ఈ ప్యాక్ తయారుచేయటానికి ఒక అరటిపండు మరియు ఒక క్యారట్ ను తీసుకోని పేస్ట్ గా చేయాలి. బాగా కలిపి ముఖం మీద రాయాలి. ఈ మాస్క్ ను 15 నిమిషాలు ఉంచి తర్వాత వెచ్చని నీటితో కడగాలి.

రోజ్ వాటర్ ప్రక్షాళన

రోజ్ వాటర్ ప్రక్షాళన

చర్మం మీద మలినాలు మరియు ధూళి ఎక్కువగా ఉండుట వలన ముడుతలు మరియు ఫైన్ లైన్లు వస్తాయి. ప్రతి రోజు రాత్రి పడుకొనే ముందు రోజ్ వాటర్ తో మీ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. రోజ్ వాటర్ చర్మం పునరుత్పత్తి మరియు కళ్ళు కింద వాపు మరియు డార్క్ సర్కిల్స్ వంటి వాటిని తగ్గిస్తుంది. ఒక కాటన్ బాల్ తీసుకోని రోజ్ వాటర్ లో ముంచి వలయాకార కదలికలతో ముఖాన్ని శుభ్రం చేయాలి. మర్దన చేయుట వలన చర్మంలో రక్త ప్రసరణ పెరుగుతుంది.

బంగాళాదుంప స్క్రబ్

బంగాళాదుంప స్క్రబ్

బంగాళాదుంప అద్భుతమైన బ్లీచింగ్ మరియు యాంటీ వృద్ధాప్యం లక్షణాలను కలిగి ఉంది. ప్రతి రోజు మీ ముఖాన్ని బంగాళాదుంప స్క్రబ్ తో శుభ్రం చేస్తే చర్మం లేత గోధుమ రంగులోకి మారటం తగ్గుట,ముడుతలు మరియు ఫైన్ లైన్స్ తొలగించడానికి సహాయపడుతుంది. అలాగే బంగాళాదుంపను ఒక మాస్క్ గా కూడా ఉపయోగించవచ్చు.ఒక బంగాళదుంప గుజ్జు మరియు దానికి కొన్ని చుక్కల నిమ్మరసంను జోడించండి. ముఖం మీద రాసి 5-10 నిమిషాలు ఉంచండి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయండి. బంగాళాదుంప సాధారణ అప్లికేషన్ చర్మం కోసం ఉపయోగకరంగా ఉంటుంది.

పెరుగు మాస్క్

పెరుగు మాస్క్

పెరుగు చర్మం కణజాలాలు,కణాల రిపేరు మరియు పునర్నిర్మాణానికి అవసరమైన విటమిన్లు కలిగి ఉంటుంది. పెరుగును రోజూ తింటే చర్మం కోసం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పెరుగు మాస్క్ తయారుచేయటానికి ఒక కప్పు పెరుగులో కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి. నిమ్మరసం ముఖాన్ని శుభ్రపరుస్తుంది. అలాగే పెరుగు ముడుతలను తగ్గిస్తుంది. ఈ ప్యాక్ వేసుకొని 20 నిమిషాలు ఉంచండి. తర్వాత వెచ్చని నీటితో కడగాలి. మంచి ఫలితాల కోసం క్రమం తప్పకుండా ఈ హోమ్మేడ్ చికిత్సలను ఉపయోగించండి.

English summary

Homemade creams for wrinkles

As we grow old, our skin tends to lose elasticity. The skin becomes lose and does not remain stiff or intact. Agreeing also causes wrinkles, dark circles and fine lines. Women get nightmares of having aging signs.
Desktop Bottom Promotion