For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముఖాన్ని అందవిహీనంగా మార్చిన బ్లాక్ హెడ్స్ ను తొలగించుకోవడం ఇలా....!

|

చర్మ సంరక్షణలో బ్లాక్ హెడ్స్ అనేవి చాలా మంది ఇది ఒక సాధారణ సమస్య. ఈ బ్లాక్ హెడ్స్ తొలగించుకోవడానికి స్ర్కబ్బింగ్ చేయడం లేదా బ్యూటీ పార్లల్ కు వెళ్లడం మరియు బ్లాక్ హెడ్స్ తొలగించుకోవడానికి ఫేషియల్ చేయించుకోవడం వంటివి చేస్తుంటారు. అందుకోసం ఎంత ఖర్చు చేసిన అవి తిరిగి వచ్చేస్తుంటాయి.! ముక్కు మీద బ్లాక్ హెడ్స్ తొలగించుకోవడానికి ఇంట్లోనే స్ర్కబ్బింగ్ చేసుకోవడం ఒక చక్కటి ఉపాయం. కానీ, ఈరకమైన చర్మ సమస్యకు కెమికల్ బ్యూటీ ప్రొడక్ట్స్ ను మాత్రమే ఉపయోగించాలి.

బ్లాక్ హెడ్స్ అంటే ఏమిటి?బ్లాక్ హెడ్స్ అతి చిన్నవిగా కనిపిస్తూ ముఖం మీద ఇబ్బంది కలిగించే సెబమ్ నుండి విడుదలయ్యేటటువంటి అతి చిన్న బ్లాక్డ్ ఫోలిసెల్స్. చర్మమీద ఏర్పడే సెబమ్ కాలుష్యం మరియు గాలిలోని ఆక్సిడేషన్ వల్ల అవి నల్లగా మారుతాయి. అవే బ్లాక్ హెడ్స్ గా రూపాంతరం చెందుతాయి. ఈ బ్లాక్ హెడ్స్ ఎక్కువగా ముక్కు మీద, ముక్కుకు ఇరువైపులా అతి సూక్మంగా మొటిమల రూపంలో ఏర్పడి నల్లగా మారుతాయి.

చాలా రకాల చర్మ సమస్యలను తొలగించుకోవడానికి మనకు లక్కీగా కొన్ని వంటగది వస్తువులున్నాయి. ఈ వస్తువులు అతి సులభంగా మనకు మార్కెట్లో దొరుకుతాయి. అంతే కాదు ఇవి చర్మ సమస్యలకు చాలా ప్రభావవంతమైనవి కూడా..కాబట్టీ బ్యూటీ పార్లర్ కు వెళ్ళి డబ్బు ఖర్చు చేయడం ఎందుకు?బ్లాక్ హెడ్స్ ను తొలగించడానికి ఇంట్లోనే లభించే వస్తువలతో సహజ పద్దతులను ఉపయోగించి ప్రయత్నించి చూడండి. వివిధ రకాల చర్మ సమస్యలకు(బ్లాక్ హెడ్స్ కూడా) తేనె, నిమ్మరసం, ఓట్ మీల్, గుడ్డు, నట్ మెగ్ ఉపయోగించి చికిత్స చేసుకుంటుంటాం. ఇటువంటి వస్తువులు మన వంటగదిలోనివే. కాబట్టీ ఈ ఖర్చులేని ట్రీట్మెంట్ కు ఫిక్స్ అయిపోండి. మరి బ్లాక్ హెడ్స్ మరియు ఇతర చర్మ సమస్యలు ఉపయోగపడే వంటగది వస్తువులేంటో ఒకసారి చూద్దామా....

బ్లాక్ హెడ్స్ తో అందవిహీనంగా కనబడుతున్నారా..!?

నిమ్మకాయ: నిమ్మకాయ నేచురల్ బ్లీచ్. ఇది క్లీనింగ్ వస్తువులా పనిచేస్తుంది. కాబట్టి మీరు నేచురల్ బ్లీచ్ కోసం నిమ్మకాయను ఉపయోగించవచ్చు . లేదా నిమ్మ తొక్కతో బ్లాక్ హెడ్స్ ఉన్న చోటో స్ర్కబ్ చేయడం వల్ల కూడా తొలగించుకోవచ్చు. బ్లాక్ హెడ్స్ ఉన్నచోట నిమ్మరసంతో పాటు తేనె, పంచదార లేదా గుడ్డు వంటివి కూడా మిక్స్ చేసి స్ర్కబ్ చేయవచ్చు.

బ్లాక్ హెడ్స్ తో అందవిహీనంగా కనబడుతున్నారా..!?

జాజికాయ: సహజ పద్దతిలో బ్లాక్ హెడ్స్ తొలగించడానికి పాలలో జాజికాయ పొడిని మిక్స్ చేసి, బ్లాక్ హెడ్స్ ఉన్న చోట స్ర్కబ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని అప్లై చేసిన తర్వాత రెండు మూడు నిముషాలు సర్కులర్ గా రుద్దాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.

బ్లాక్ హెడ్స్ తో అందవిహీనంగా కనబడుతున్నారా..!?

గుడ్డు: బ్లాక్ హెడ్స్ ను తొలగించడంలో గుడ్డు కూడా ఒక మంచి వస్తువు. గుడ్డులోని తెల్ల సొనకు తేనె లేదా నిమ్మరసం కలిపి ఈ ప్యాక్ ను బ్లాక్ హెడ్స్ ఉన్న చోటో అప్లై చేసి ఇరవైనిముషాల తర్వాత స్ర్కబ్ చేసి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

బ్లాక్ హెడ్స్ తో అందవిహీనంగా కనబడుతున్నారా..!?

తేనె: బ్లాక్ హెడ్స్ మొదలుకుని ఇతర చర్మ సమస్యలకు నివారించడానికి చిక్కటి తేనెను ఉపయోగిస్తాం . తేనె యాంటీబ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉన్నది. ఇది చర్మం రంద్రాలను శుభ్రం చేయడానికి బాగా సహాయపడుతుంది.

బ్లాక్ హెడ్స్ తో అందవిహీనంగా కనబడుతున్నారా..!?

ధనియాలు-పసుపు: ఒక చెంచా ధనియాలు, కొద్దిగా పసుపు తీసుకొని మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ కు కొన్ని పాలు లేదా తేనె కలిపి బాగా మిక్స్ చేయాలి . ఈ మిశ్రమాన్ని ముక్కుమీద అప్లై చేసి బాగా రుద్దాలి. దాంతో బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి.

బ్లాక్ హెడ్స్ తో అందవిహీనంగా కనబడుతున్నారా..!?

బేకింగ్ సోడా: ఈ వంటగది వస్తువును చర్మ మరియు కేశ సంరక్షణలో సాధారణంగా ఉపయోగిస్తుంటారు. బేకింగ్ సోడాను చేత్తో తీసుకొని ముక్క మీద అలా మసాజ్ చేయడం వల్ల కూడా బ్లాక్ మెడ్స్ తొలగిపోతాయి.

బ్లాక్ హెడ్స్ తో అందవిహీనంగా కనబడుతున్నారా..!?

అరటి: బాగా పండిన అరటి పండు గుజ్జుతో మీ ముఖానికి మసాజ్ చేయడం కానీ లేదా అరటి పండు తొక్కతో బ్లాక్ హెడ్స్ ఉన్న చోటు స్ర్కబ్ చేయడం వల్ల కానీ బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి.

బ్లాక్ హెడ్స్ తో అందవిహీనంగా కనబడుతున్నారా..!?

ఓట్ మీల్: చర్మాన్ని శుభ్రపరుచుటల ఓట్స్ ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఓట్స్ ను మిక్సీలో వేసి మిక్స్ చేసి ఆ పొడితో ముక్కు మీద రుద్దడం వల్ల బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి.

బ్లాక్ హెడ్స్ తో అందవిహీనంగా కనబడుతున్నారా..!?

పంచదార: పంచదార గుళికలతో ముఖం మీద, బ్లాక్ హెడ్స్ ఉన్న చోట రుద్దడం వల్ల చర్మ శుభ్రపడటంతో పాటు, బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి.

బ్లాక్ హెడ్స్ తో అందవిహీనంగా కనబడుతున్నారా..!?

ఉప్పు: ఉప్పును నిమ్మరసంలో మిక్స్ చేసి బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రదేశంలో అప్లై చేసి పది నిముషాల తర్వాత సున్నితంగా రుద్ది, చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

English summary

Kitchen Ingredients To Treat Blackheads | బ్లాక్ హెడ్స్ తో అందవిహీనంగా కనబడుతున్నారా..!?

Blackheads is a common problem of many people. You can either scrub or go to a parlour and get a facial to get rid of these small blackheads. However, it is expensive to the pocket and blackheads return back! Scrubbing your nose at home is one of the best remedies to get rid of blackheads but, you only use chemical beauty products to treat this skin problem.
Desktop Bottom Promotion