For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మిమ్మల్నిమరింత అందంగా మార్చేనేచురల్ బ్యూటీ టిప్స్

|

సాధారణంగా చాలా సింపుల్ గా ఉండే బ్యూటి టిప్స్ గా చాలా ఉన్నాయి. అటువంటి సింపుల్ చిట్కాలను మీ అమ్మమ్మలు, అమ్మలు, స్నేహితుల నుండి తెలుసుకొనే ఉంటారు . ఈ అన్నిరకాల బ్యూటీ టిప్స్ అన్నీ కూడా చర్మం సంరక్షణలో, చర్మాన్ని అందంగా ఉంచుకోవడంలో ఒక భాగం. అందంగా కనబడుటకు నేచురల్ బ్యూటీ లుక్ పొందుటకు వాటిలో, కనీసం ఒకటో రెండో మీరు ఖచ్చితంగా ఉపయోగించే ఉంటారు. కళ్ళకు మేకప్ మరయిు టోనర్స్ వంటివి మార్కెట్లో అందుబాటులో ఉంటాయి, కానీ నిపుణులు మాత్ర నేచురల్ వస్తువులు ఇండియన్ మహిళలకు చాలా ఉత్తమం అని భావిస్తారు.

అలాగే ఈ ప్రపంచంలో, మన ఇండియన్ మహిళలను బెస్ట్ గా ఉంటారని, అందులోనే ఎటువంటి మేకప్ లేకుండా, అందంగా ఉంటారని భావిస్తారు. మరి అంతటి అందాన్ని పొందాలంటే, కొన్ని స్పెషల్ అండ్ బ్యూటీఫుల్ నేచురల్ బ్యూటీ టిప్స్ ను ఎలా అనుసరించాలో తెలుసుకోవాలి .

ఇవి నేచరల్ గా బ్యూటిఫుల్ గా ఉండటానికి సహాయపడుతుంది, బోల్డ్ స్కై మీకోసం అటువంటి నేచురల్ బ్యూటీ టిప్స్ ను కొన్నింటిని అంధిస్తోంది. అందాన్ని మెరుగుపరుచుకోవాలన్నా, మొటిమలు నివారించాలన్నా లేదా ముఖంలో ప్రకాశవంతంగా మార్చుకోవాలన్నా లేదా ముఖంలో స్కార్స్ నివారించాలన్నా మేకప్ మీద ఆధారపడకుండి నేచురల్ గా మార్గాలను అనుసరించండి

మీ బ్యూటీఫుల్ లుక్ కోసం, నేచురల్ బ్యూటీ టిప్స్ :

ఫేస్ ప్యాక్:

ఫేస్ ప్యాక్:

మీ చర్మం డ్రై స్కిన్? అయితే ఈ నేచురల్ బ్యూటీ టిప్ ను ప్రయత్నించండి. ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అరకప్పు ఓట్స్ పొడిలో, రెండు చెంచాలా తేనె, ఒక టీస్పూన్ సన్ ఫ్లవర్ ఆయిల్ మరియు అరచెంచా వెనిలా ఎక్సాక్ట్ వేసి మిక్స్ చేయాలి. తర్వాత అందులో కొద్దిగా నీళ్ళు కలిపి మెత్తగా పేస్ట్ చేసి ముఖానికి అప్లై చేసి, 15నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

మొటిమలను నేచురల్ గా నివారించడం:

మొటిమలను నేచురల్ గా నివారించడం:

వీటిని నివారించాలంటే, బేకింగ్ సోడాను వాటర్ తో మిక్స్ చేసి, మెత్తని పేస్ట్ లా తయారుచేయాలి. చాలా చిన్న మొత్తంలో మెంటిమల మీద అప్లై చేయాలి. తర్వత శుభ్రంగా ఉన్న క్లాత్ తో కవర్ చేయాలి. రాత్రంతా అలాగే ఉంచి, తర్వాత రోజు ఉదయం శుభ్రం చేసుకోవాలి. ఇది మొటిమల నివారణకు ఒక ఉత్తమ నేచురల్ బ్యూటీ టిప్ .

బ్లాక్ హెడ్స్ నివారణ:

బ్లాక్ హెడ్స్ నివారణ:

నిమ్మరసం మరియు కొబ్బరి నూనె సమంగా తీసుకొని మిక్స్ చేసి తర్వాత ఈ మిశ్రమాన్ని బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రదేశంలో అప్లై చేసి, సర్కులర్ మోషన్ లో మసాజ్ చేయాలి . ఆ ప్రదేశంలో కాస్త మెత్తగా అనిపించినప్పుడు, దానికి మీద గోరువెచ్చని కంప్రెస్ అప్లై చేసి, బ్లాక్ హెడ్స్ ను తొలగించాలి.

నేచురల్ మాయిశ్చరైజర్:

నేచురల్ మాయిశ్చరైజర్:

మీకోసం ఇది ఒక బెస్ట్ నేచురల్ బ్యూటీ టిప్. వెజిటేబుల్ ఆయిల్ ను ఉపయోగించి మీ చర్మాన్ని సాఫ్ట్ గా మార్చుకోవచ్చు మరియు మంచి షైనింగ్ పొందవచ్చు. వెజిటేబుల్ ఆయిల్ ను చర్మానికి మసాజ్ చేసి, అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

నేచురల్ ఎక్స్ ఫ్లోయేట్:

నేచురల్ ఎక్స్ ఫ్లోయేట్:

మీ చర్మాన్ని రెగ్యులర్ గా ఎక్స్ ప్లోయేట్ చేయడం వల్ల, మీ చర్మం డెడ్ స్కిన్ సెల్స్ నివారిస్తుంది. అయితే, ప్రతి రోజూ ఎక్స్ ఫ్లోయేట్ చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి, ఈ నేచురల్ బ్యూటీ టిప్ ను ప్రయత్నించండి, గోరువెచ్చని నీటిలో బేకింగ్ సోడా మిక్స్ చేసి ఆ నీటితో ముఖంను శుభ్రం చేసుకోవాలి. ముఖాన్ని నిధానంగ స్ర్కబ్ చేసి, పది నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

నేచురల్ స్పా:

నేచురల్ స్పా:

ఈ నేచురల్ స్పా మీకు వారానికి ఒక సారి అయినా అవసరం అవుతుంది. కాబట్టి, అందాన్ని కోరుకొనే మహిళలు ఈ నేచురల్ బ్యూటీ టిప్ ను ప్రయత్నించవచ్చు . ఒక కప్పు ఓట్స్ పొడిలో, ఒక కప్పు ఉప్పు, రెండు చెంచాలా వెజిటేబుల్ ఆియల్ మరియు 3చెంచాలా వెనీలా ఎక్సాక్స్ట్ మిక్స్ చేసి ఈ మొత్తం మిశ్రమాన్ని మీ బాతింగ్ టబ్ లో మిక్స్ చేయాలి. తర్వాత బాత్ టబ్ లో స్నానం చేయాలి.

నవ్వు:

నవ్వు:

మీరు అనుసరించాల్సిన ఒక బెస్ట్ నేచురల్ బ్యూటీ టిప్, మీ పళ్ళను శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతి రోజూ రెండు సార్లు బ్రష్ చేసుకోవడం వల్ల ఇది మరకలను నివారించడానికి సహాయపడుతుంది. అలాగే దంతాల మీద మరకలకు కారణం అయ్యే బెవరేజస్ కు దూరంగా ఉండాలి.

హోం మేడ్ కండీషనర్:

హోం మేడ్ కండీషనర్:

ఈ నేచరల్ బ్యూటీ టిప్, మిమ్మల్ని అందంగా ఉంచడానికి చాలా సింపుల్ గా ఉంటుంది. అందుకు మీరు చేయాల్సిందల్లా ఒక చెంచా తేనె మరియు 2 చెంచాలా ఫ్రెష్ క్రీమ్ మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేసి, తడి ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి.

ముడుతలను నివారణ:

ముడుతలను నివారణ:

మీ ముఖంలో ముడుతలను కనబడనీయకుండా చేయండి,అందుకు మీరు ఆముదం నూనెను మీ ముఖం మీద అప్లై చేయాలి . ఇది ముడుతలను నివారించడానికి మరియు చర్మాన్ని సున్నితంగా మార్చడానికి సహాయపడుతుంది. అలాగే ఇది వృద్ధాప్య ప్రక్రియను నిధానం చేయడానిక సహాయపడుతుంది.

చర్మానికి న్యూరిష్ చేయడం:

చర్మానికి న్యూరిష్ చేయడం:

మీ చర్మాన్ని న్యూరిష్ చేయడానికి ప్రోటీన్ మాస్క్ చాలా అద్భుతంగా సహాయపడుతుంది. కాబట్టి, ఈ సింపుల్ మరియు నేచురల్ బ్యూటీ టిప్ ను ప్రయత్నించాలి. ఒక చెంచా ఉద్దిపప్పు మరియు 6బాదంలను నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయం, వాటిని మెత్తగా పేస్ట్ లా తయారుచేసి, మీ ముఖం మీద ఈ మాస్క్ ను అప్లై చేయాలి. తడి ఆరిన తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ మాస్క్ మీ చర్మాన్ని న్యూరిష్ చేస్తుంది.

పిగ్మెంటేషన్ :

పిగ్మెంటేషన్ :

పిగ్మెంట్ చర్మానికి తాజాగా ఉండే పొటాటోను స్లైస్ గా కట్ చేసి ముఖం మీద స్ర్కబ్ చేయాలి. ఈ పొటాటో జ్యూస్ చర్మాన్ని టైట్ చేస్తుంది, మరియు మరింత అందంగా కబడేలా చేస్తుంది.

సన్ స్క్రీన్ లోషన్:

సన్ స్క్రీన్ లోషన్:

నేచురల్ గా అందుబాటులో ఉండే కీరదోసరసం, గ్లిసరిన్ మరియు రోజ్ వాటర్ ను మిక్స్ చేయాలి . ఇది అత్యంత సింపుల్ నేచురల్ బ్యూటీ టిప్ . బయట వెళ్ళడానికి ఒక గంట ముందు దీన్ని మీ ముఖానికి అప్లై చేయాలి.

చర్మం ప్రకాశవంతంగా:

చర్మం ప్రకాశవంతంగా:

పచ్చికొబ్బరిని మెత్తగా పేస్ చేసి, అందునుండి పాలను పిండువకోవాలి. ఈ పాలను మీ ముఖం మరియు పెదాలన మీద అప్లై చేసి నిధానంగా సర్కురల్ మోషన్లో రుద్దాలి. ఇది ఫర్ ఫెక్ట్ నేచురల్ గ్లోను అంధిస్తుంది.

ఎఫెక్టివ్ బాడీ స్ర్కబ్ ను ఉపయోగించాలి . ఆలివ్ ఆయిల్ మిరయు

ఎఫెక్టివ్ బాడీ స్ర్కబ్ ను ఉపయోగించాలి . ఆలివ్ ఆయిల్ మిరయు

బాడీ స్ర్కబ్: ఉప్పు సమయంగా తీసుకొని రెండింటిని మిక్స్ చేసి శరీరం మొత్తం స్ర్కబ్ చేయాలి . ఇది చాలా తక్కువ ధర మరియు శరీరానికి చాలా మన్నికైనది.

షేవింగ్ లెగ్స్:

షేవింగ్ లెగ్స్:

మీ కాళ్ళు మరింత అందంగా కనబడాలంటే, షేవింగ్ క్రీమ్ లేదా సోఫులను ఉపయోగించి కాళ్ళను అందంగా ఉంచుకుంటారు. అయితే నేచురల్ బ్యూటీ టిప్ ప్రయత్నించండి. కొబ్బరి నూనెను మీ కాళ్ళకు పట్టించి మసాజ్ చేసి, తర్వాత షేవ్ చేయడం వల్ల ఫర్ ఫెక్ట్ గ్లో అంధిస్తుంది.

English summary

Natural Beauty Tips For A Beautiful You

There are some of the most simpliest beauty tips you would have heard from your mum and grand mum and even from your friends. In all those beauty tips you would have heard from all your folks, you would have tried at least one or two of them to make sure that you looked all naturally beautiful.
Desktop Bottom Promotion