For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ వేసవికి మీ చర్మాన్ని కూల్ గా ఉంచే కూల్ పెప్పర్ మింట్..!

|

మన మౌత్ ఫ్రెషనర్ గామరియు నోటి దుర్వాసనను పోగొట్టడానికి మన దగ్గర పెప్పర్ మింట్(పుదీనా) లీవ్స్ ఉన్నాయి. పెప్పర్ మింట్ లీవ్స్ లో స్కిన్ మరియు హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని అతి తక్కువ మంది మాత్రమే తెలుసు. పెప్పర్ మింట్ యాంటీబ్యాక్టీరియల్ మరియు యాంటీమైక్రోబైల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఒక్క మౌత్ ఆడర్(నోటి దుర్వాసనను) పోగొట్టడమే కాదు జీర్ణక్రియ సమస్యలను మరియు తలనొప్పి నివారనకు అద్భుతంగా పనిచేస్తుంది.

మెంతోల్లో పెప్పర్ మింట్ ఉండటం వల్లనే హెల్త్ మరియు స్కిన్ బెనిఫిట్స్ ను కలిగి ఉన్నాయి. ఉదాహరణకు మెంతోల్ ను ఉపయోగించడం వల్ల కోల్డ్ ను నివారిస్తుంది. అంతే కాదు చర్మ మరియు కేశ సంరక్షణకు బాగా సహాయపడుతుంది. మరి చర్మ రక్షణకు పెప్పర్ మింట్ ఏవిధంగా ఉపయోగపడుతుంది. చర్మానికి ఎలా ఉపయోగించాలో ఒకసారి చూద్దాం...

పెప్పర్ మెంట్ తో స్కిన్ బెనిఫిట్స్:
ఆయిల్ స్కిన్ నివారణకు:
పెప్పర్ మింట్ (పుదీనా ఆకుల్ని)పూర్వకాలం నుండినే ఉపయోగంలో ఉంది. ఇది ఆయిల్ స్కిన్ మరియు జీడ్డు చర్మానికి మంచి రక్షణ కల్పిస్తుంది. పెప్పర్ మెంట్ లోని మెంథోల్ సెబాసియస్ గ్రంథుల నుండి ఆయిల్ సెక్రేసన్ ను తగ్గిస్తుంది . దాంతో ఆయిల్ ఫ్రీ చర్మాన్ని నేచురల్ గా పొందడానికి సహాయపడుతుంది.

Skin Benefits Of Cool Peppermint

స్కిన్ ఇరిటేషన్ ను తగ్గిస్తుంది: పెప్పర్ మెంట్ ను ఉపయోగించడం వల్ల ఇది ఒక మంచి స్కిన్ బెనిఫిట్ పొందగలరు. పెప్పర్ మింట్ ఆకులను మెత్తగా పేస్ట్ చేసి తాజాగా ముఖానికి అప్లై చేయడం వల్ల మిమ్మల్ని ఇరిటేషన్ కలిగిస్తున్న చర్మం నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇంకా పెప్పర్ మింట్ లీవ్స్ లో శాంత పరిచే లేదా చల్లబరిచే లక్షణాలు ఎక్కువగా ఉన్నందువల్ల స్కిన్ ఇన్ ఫ్లమేషన్, స్కిన్ బర్న్, మరియు స్కిన్ రాషెస్ ను తగ్గిస్తుంది. ఇంకా పెప్పర్ మింట్ ఆకలను తాజావి పేస్ట్ చేసి అందులో తేనె కలుపుకొని అప్లై చేయడం వల్ల మంచి ఫలితాను పొందవచ్చు. తేనెలో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు మరియు యాంటీఆక్సిడెంట్స్ చిరాకు కలిగించే చర్మ రణకు చాలా మంచిది.

మొటిమల నివారణకు: పెప్పర్ మింట్ ను ఉపయోగించడం వల్ల మరో ప్రధానమైన స్కిన్ బెనిఫిట్ ఏంటంటే మొటిమల నివారణకు బాగా సహాయపడుతుంది. మెంథోల్ చల్లదనాన్ని కలిగించడం మాత్రమే కాదు మొటిమలు మరియు మచ్చల నివారణకు బాగా సహాయపడుతుంది.

సన్ టాన్ తో పోరాడుతుంది: పెప్పెర్ మింట్ లో విటమిన్ ఎ మరియు విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. విటమిన్స్ మాత్రమే కాకుండా చర్మ రక్షణకు ఉపయోగపడే ఫొల్లెట్ మరియు ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. చర్మానికి చల్లదనాన్ని కలిగించడమే కాకుండా సన్ రిలేటెడ్ స్కిన్ ప్రాబ్లెమ్స్ ను (సన్ టాన్ మరియు సన్ బర్న్)వంటి సమస్యలను నుండి రక్షణ కల్పించబడుతుంది. కాబట్టి మీ ఆయిల్ మరియు డల్ స్కిన్ నుండి రక్షణ పొందడానికి పెప్పర్ మింట్ ఆయిల్ మరియు పెప్పెర్ మింట్ లీవ్స్ ను ఉపయోగించడం మొదలు పెట్టండి. పెప్పర్ మెంట్ ఆకులను పేస్ట్ చేసి ముఖానికి అప్లై చేసి మంచి ఫలితాలను పొందవచ్చు.

English summary

Skin Benefits Of Cool Peppermint | కూల్..కూల్.. పెప్పెర్ మింట్ తో బహుళ ప్రయోజనాలు..

We have peppermint leaves as a mouth freshener to feel fresh and prevent mouth odour. Though very few of us are aware about the health and beauty benefits that comes out of peppermint. Peppermint has antibacterial and antimicrobial properties that not only prevents mouth odour, but also relieves digestive problems and ease headache.
Story first published: Saturday, March 16, 2013, 9:57 [IST]
Desktop Bottom Promotion