For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యువకులు అందంగా కనిపించేలా చేసే స్కిన్ కేర్ టిప్స్

By Super
|

సాదారణంగా మీ జీవితంలో టీనేజ్ సమయంలో మీ శరీరంలో అనేక అంతర్గత మార్పులు జరుగుతూ ఉంటాయి. మీరు యుక్త వయసులో తరచుగా మోటిమలు మరియు ఇతర చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఉంటారు. చాలా మంది యువకులు బాహ్య కార్యకలాపాలు మరియు పాఠశాలలో తీవ్రమైన షెడ్యూల్ కారణంగా బిజీగా ఉంటారు. అందువల్ల వారి చర్మం మీద బహిరంగ కాలుష్యం మరియు సూర్యుని యొక్క ప్రధాన ఎఫెక్ట్స్ నేరుగా పడుతుంది. మీ శరీరం రూపాంతరణం చెందడం,నిరంతరం మీ చర్మం మార్పులను నియంత్రించటం మరియు క్రమం తప్పకుండా సలహా తీసుకోవలసిన అవసరం ఉంది.

యువకులు వేగంగా పెరుగుట వలన వారికీ అవసరమైన పోషకాలపై అదనపు దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. ఒక యువకునికి సగటున పెద్దవారి కంటే ఎక్కువ విటమిన్లు,ప్రోటీన్లు మరియు కొవ్వు అవసరం అవుతుంది. మీ శరీరం యొక్క గ్రోత్ హార్మోన్లకు ఎక్కువ ఆహారం అవసరమవుతుంది. ఎందుకంటే పోషకాలు లోపం అనేది అనేక చెడు ప్రభావాలకు దారితీస్తుంది. ఇది కొంత మీ చర్మంపై ప్రతిబింబిస్తుంది. యువకులలో అత్యంత సాధారణ చర్మ సమస్య మోటిమలు అని చెప్పవచ్చు. ఇవి మీకు అవుట్ డోర్ క్రీడలు మరియు కార్యకలాపాలు వలన వచ్చే అవకాశం ఉంది. మీకు చెమట ఎక్కువగా పట్టుట వలన దాని భర్తీకి తగినంత ఎక్కువగా ద్రవ పదార్థం మరియు ముఖ్యంగా నీటిని త్రాగవలసిన అవసరం ఉంది.

ఒక యువకునిలో ఉండే మొత్తం మార్పులకు చర్మం సమస్య కాదు. కొన్ని సహజ మార్పులు జరుగుతాయి. ఒక యువకుని శరీరంపై తీవ్రమైన హార్మోన్ల మార్పులు ఉన్నట్లయితే ఒక క్రమ పద్ధతిలో మీ పెద్దలు లేదా మీ వైద్యుడిని సంప్రదించడం చాలా అవసరం. కొన్నిసార్లు దద్దుర్లు లేదా సంభవించే ఇతర గుర్తులు మీ వయస్సు లేదా హార్మోన్లు అలెర్జీ వలన కావొచ్చు. మీరు ఆరోగ్యకరమైన ఆహారం మరియు ఫిట్ నెస్ తప్పనిసరిగా అనుసరించాల్సి ఉంటుంది.

ఇక్కడ యువకుల కోసం కొన్ని చర్మ సంరక్షణ చిట్కాలు ఉన్నాయి.

1. మీ చర్మం గురించి తెలుసుకోండి

1. మీ చర్మం గురించి తెలుసుకోండి

మీ చర్మ రకం ఏమిటో తెలుసుకొని అప్పుడు చర్మ సంరక్షణ ఉత్పత్తిని ఎంచుకోండి. ఇంటి పరిష్కారాల మార్గాలను అనుసరించండి. జిడ్డు చర్మం గల వారు ఒక సాధారణ సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. జిడ్డు రంధ్రాలను తీసివేయటానికి క్లీన్సింగ్ కొరకు డీప్ స్క్రబ్ ఉపయోగించండి. జిడ్డు చర్మం కారణంగా అంటుకొని ఉన్న మలినాలు బయటకు పోవటానికి కుంచెతో శుభ్రం చేయండి.

2. మీ చర్మం కొరకు SPF

2. మీ చర్మం కొరకు SPF

సాదారణంగా మీరు పాఠశాల అయిన తర్వాత ఎక్కువ సమయం బహిరంగ క్రీడలు అడతారు. అప్పుడు సూర్యుని కిరణాలు నేరుగా మీ చర్మం మీద పడతాయి. ఈ కఠినమైన UV కిరణాల నుండి మీ చర్మంను రక్షించటానికి వాటర్ ప్రూఫ్ (చెమట వలన నీటిని తొలగించడానికి) ఒక SPF తో రూపొందించిన స్కిన్ క్రీమ్ ను వాడాలి.

3. ఫ్లుయిడ్స్

3. ఫ్లుయిడ్స్

యువకులు బిజీగా ఉండే వారి యవ్వనం జీవితంలో అత్యంత సాధారణ తప్పుగా నీటిని తీసుకోవటం నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు.అత్యంత శక్తివంతమైన నిర్విషీకరణ ఏజెంట్ అయిన నీటిని అసలు పట్టించుకోకుండా ఉంటారు. చెమట భర్తీ కొరకు మరియు మీ శరీరం మరియు స్కిన్ లో మలినాలను శుభ్రం చేయటానికి సహాయం కొరకు నీటిని త్రాగవలసిన అవసరం ఉంది.

4. జాగ్రత్తగా చిదమాలి

4. జాగ్రత్తగా చిదమాలి

యువకులలో సాదారణంగా ముఖానికి బ్రేక్ అవుట్ రావటం అనేది అత్యంత సాధారణ సమస్య అని చెప్పవచ్చు. కొన్నిసార్లు మొత్తం మందులు కంటే ఎక్కువ దోషాలు మరియు ఇబ్బందిని విస్మరించలేము. దానిని మీరు జాగ్రత్తగా చిదమాలి. మొటిమలు తొలగించినప్పుడు మంట మరియు తర్వాత మచ్చలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చేతులు శుభ్రంగా కడుక్కొని క్లీన్సెర్ తో చిదిమిన ప్రాంతంలో కడగడం చెయ్యాలి.

 5. మాస్క్ లు మరియు పండ్ల ఫేషియల్స్

5. మాస్క్ లు మరియు పండ్ల ఫేషియల్స్

మీరు తగినంతగా ముఖంపై మాస్క్ లు మరియు పండ్ల స్క్రబ్స్ చేయడం చాలా మంచిది. బొప్పాయి, నారింజ పై తొక్క,అవెకాడో పండు,పైనాపిల్,స్ట్రాబెర్రీ మొదలైన వివిధ రకాల పండ్లను మీ స్కిన్ కొరకు గొప్ప ఇంటి పరిష్కారాలుగా ఉపయోగించండి. అంతేకాక నిర్విషీకరణ మరియు మీ చర్మంనకు చైతన్యం నింపటానికి తేనెను ఉపయోగించండి.

6. డైట్

6. డైట్

మీరు యువకులకు సరైన పోషక ఆహారం ఇవ్వటం చాలా ముఖ్యమైనది. మీ స్కిన్ బ్రేక్ అవుట్ కాకుండా ఉండటానికి అనారోగ్యకరమైన జిడ్డుగల ఆహారాలను నివారించాలి. తరచుగా తీసుకొనే 'చల్లని' పిజ్జాలు మరియు బర్గర్లకు బదులుగా వెజ్జీస్,పండ్లు,నట్స్,ధాన్యాలు మొదలైన పోషకాలు సమృద్ధిగా ఉన్న ఆహారం తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్,అవెకాడో పండు,డార్క్ బెర్రీలు,ద్రాక్ష,బీట్రూట్ వంటి ఫ్రూట్స్,కూరగాయలు అనేవి సహజంగా మీ స్కిన్ శుభ్రపరచడానికి మరియు మెరుపు రావటం కొరకు ఆరోగ్యవంతమైన ఎంపికలుగా చెప్పవచ్చు.

English summary

Skin care tips for teenage boys

Teenage is the period in your life when there are lots of internal changes happening in your body. This age of adolescence is often plagued with acne and other skin related issues you have to deal with.
Desktop Bottom Promotion