For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సమ్మర్ స్కిన్ కేర్ మహిళలకు మాత్రమే కాదు పురుషులకు అత్యవసరమే....

|

ఎప్పుడతే వేసవి కాలం మొదలై ఎండలు భగభగ మండుతుంటాయో, అటువంటి సమయంలో ఆ వేడిని మన శరీరం తట్టుకోవడానికి తగినంత రక్షణ కల్పించాలి. చర్మ రక్షణ కోసం సంవత్సరం పొడవునా జాగ్రత్తలు తీసుకొన్నా కూడా సమ్మర్ లో మాత్రం మరింత ఎక్స్ ట్రా కేర్ తీసుకోవడం చాలా అవసరం. ముఖంలో ముడుతలు మరియు ఏజింగ్ ప్రొసెస్, యూవీ(ఆల్ట్రావైలెట్ కిరణాల వల్ల చర్మం పాడవుతుంది. వేసవి సెలవులు పిల్లలు పెద్దలు కొంత స్వాంతన కలించుకొనేందేకు లాంగ్ ట్రిప్ లు లేదా పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు అని బయటకు ఈ సీజన్ ల ఎక్కువ తిరగాల్సి వస్తుంది. వేసవి తాపాన్ని తీర్చుకోవడానికి టూర్ లు, బయట వెళ్ళి ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. మరి అటువంటప్పుడు వేసవిలో చర్మానికి హాని కలిగించే సూర్యుని నుండి వచ్చే యూవీ కిరణాలను నుండి మీ చర్మానికి రక్షణ కల్పించడం చాలా అవసరం.

వేసవి స్కిన్ కేర్ మహిళలకు మాత్రమే కాదు పురుషులకు కూడా చాలా అవసరం. కాబట్టి పురుషులు కూడా వేసవి తాపం నుండి బయటపడాలంటే కొన్ని స్కిన్ కేర్ చిట్కాలను పాటించాలి. మరి ఈ వేసవిలో అటువంటి సులభ చిట్కాలు పురుషులు అతి సులభంగా పాటించగలిగే చిట్కాలు కొన్ని ఉన్నాయి. అంతే కాదు వేసవి కాలంలో చర్మానికి హానికరమైన యూవీ కిరణాల నుండి రక్షణ కల్పించవచ్చు.

పురుషులకు అత్యవసరమైన సమ్మర్ స్కిన్ కేర్ టిప్స్...!

చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి: వేసవి కాలంలో చర్మం దుమ్ము, ధూళి, ముఖంలో వేడి వల్ల వచ్చేజిడ్డు వల్ల పాడవకూడదనుకుంటే ప్రతి రోజూ ముఖాన్ని రెండు మూడు సార్లు చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. సమ్మర్ సీజన్ లో డీప్ చర్మ రక్షణకు డీప్ క్లీనింగ్ చాలా ముఖ్యం.

పురుషులకు అత్యవసరమైన సమ్మర్ స్కిన్ కేర్ టిప్స్...!

సన్ స్ర్కీన్ లోషన్: వేసవిలో సూర్యుని నుండి వెలువడే హానికరమైన యూవి కిరణాల నుండి చర్మానికి రక్షణ కల్పించే స్కిన్ కేర్ టిప్స్ ను మగవారు గుర్తుంచుకోవడం చాలా అవసరం. ఈ వేసవికాలంలో బయటకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు లేదా రెగ్యులర్ గా ఆఫీసులకు వెళ్ళే వారు ఇంటి నుండి బయలుదేరే ముందు సన్ స్ర్కీన్ లోషన్ ను ప్రతి రోజూ ఉదయం చర్మానికి రాసుకోవాలి. అలాగే మీకు రోజులు ఎప్పుడైనా రాసుకోవాలనిపిస్తే అప్పుడు కూడా అప్లై చేయవచ్చు. తర్వాత రాత్రుల్లో శుభ్రం చేసుకోవాలి. మీరు ఎంపిక చేసుకొనే సన్ స్ర్కీన్ లోషన్ మన్నికైనవి యూవిఎ/యూవిబి లేబుల్ మరియు ఎస్ఎఫ్ ఫి + ఉన్నవి సెలక్ట్ చేసుకోవడం చాలా మంచిది. ఇటువంటి క్రీములు మీ చర్మానికి రక్షణ కల్పించబడుతాయి.

పురుషులకు అత్యవసరమైన సమ్మర్ స్కిన్ కేర్ టిప్స్...!

హైడ్రేషన్: వేసవి కాలంలో తగినన్ని నీరు త్రాగి చర్మానికి తగినంత తేమనందించాలి. శరీర ఉష్ణోగ్రత క్రమంగా ఉండేట్టు చూసుకోవాలి. వేసవి కాలంలో ఎక్కువగా నీరు త్రాగడం వల్ల మిమ్మల్ని తాజాగా ఉంచడమే కాకుండా శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు పంపించబడుతుంది. కనీసం 7-8గ్లాసుల నీరు త్రాగడం చాలా అవసరం. దాంతో మీ శరీరానికి కావల్సిన హైడ్రేషన్ పొందవచ్చు.

పురుషులకు అత్యవసరమైన సమ్మర్ స్కిన్ కేర్ టిప్స్...!

షేవింగ్: ఇది పురుషులకు చాలా ముఖ్యమైన స్కిన్ కేర్ చిట్కా. ఇది సమ్మర్ లోనే కాదు ప్రతి సీజన్ లోని ఇది చాలా అవసరం. షేవింగ్ చేసుకొన్న తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేయడం చాలా ముఖ్యం. మీ చర్మానికి హాని కలిగించని మరియు పొడబారనియ్యని షేవింగ్ క్రీములను ఉపయోగించాలి. షేవింగ్ తర్వాత కూడా చర్మానికి మాయిశ్చరైజర్ చాలా అవసరం.

పురుషులకు అత్యవసరమైన సమ్మర్ స్కిన్ కేర్ టిప్స్...!

మన్నికైన సోప్ ను ఉపయోగించాలి: మీరు మన్నికైన సోపును ఎంపిక చేసుకోకపోతే, మీ చర్మాన్ని మీరే పొడిబారేలా చేసుకొన్నట్లే. ముఖ్యంగా ఎక్కువ సువాసనలిచ్చే సపులు మీ చర్మాన్ని పొడిబారేలా చేయడమే కాకుండా చర్మం నుండి నూనె ఏర్పడి మీ ముఖంజిడ్డుగా మార్చేలా చేస్తాయి.

పురుషులకు అత్యవసరమైన సమ్మర్ స్కిన్ కేర్ టిప్స్...!

మాయిశ్చరైజర్: మాయిశ్చరైజర్స్ విటమిన్ ఈ కలిగిన ఆలోవెరఆయిల్ కలిగి మాయిశ్చరైజర్స్ పురుషుల స్కిన్ టోన్ కూ చాలా ప్రభావంతం చూపెడుతాయని కనుగొనబడింది. మాయిశ్చరైజ్ ఎస్ పి(సన్ ప్రొటెక్షన్)మీ చర్మానికి డబుల్ ప్రొటక్షన్ కలిగిస్తుంది. మాయిశ్చరైజర్ అప్లై చేసే ముందు మీ చర్మాన్ని తడి చేసుకోవాలి.

పురుషులకు అత్యవసరమైన సమ్మర్ స్కిన్ కేర్ టిప్స్...!

ఫేషియల్స్: వేసవి కాలంలో ఎండ, వేడి, డర్టీ, నూనెలు ఇవన్నీ కూడా మీ ముఖ చర్మాన్ని డల్ గా మార్చుతుంది. అది చర్మం నల్లబడటానికి కారణం అవుతుంది. కాబట్టి ఫేషియల్ పురుషులకు కూడా తప్పనిసరి. జనరల్ ఫేషియల్ కాకుండా మీ చర్మతత్వానికి సరిపడే ఫేషియల్స్ చేయించుకోవడం చాలా అవసరం.

పురుషులకు అత్యవసరమైన సమ్మర్ స్కిన్ కేర్ టిప్స్...!

ఎక్స్ ఫ్లోయేట్: డెడ్ స్కిన్ సెల్స్ తొలగించడానికి ప్రతి నాలుగు రోజులకొకసారి లేదా వారానికి ఒకసారి నేచురల్ స్ర్కబ్ ను ఉపయోగించడం చాలా అవసరం. ఇలా చేయడం వల్ల షేవింగ్ తర్వాత గెడ్డం పెరగకుండా ఉంటాయి. దాంతో మీ చర్మం చూడటానికి అందంగా యంగ్ గా కనబడుతారు.

పురుషులకు అత్యవసరమైన సమ్మర్ స్కిన్ కేర్ టిప్స్...!

ఆలివ్ ఆయిల్: ఈ వేసవికి పురుషులకు ఉపయోగపడే మరో స్కిన్ కేర్ చిట్కా ఇది. ఆలివ్ ఆయిల్ తో మీ చర్మాన్ని మసాజ్ చేయడం వల్ల మీ చర్మం ఫ్రెష్ గా కనబడుతుంది. మాయిశ్చరైజ్ గా పనిచేస్తుంది. మీ చర్మ తత్వం పొడిబారిన, లేదా ఆయిల్ చర్మమైనా, లేదా నార్మల్ చర్మ తత్వం కలిగిఉన్నా మీ చర్మరక్షణ చాలా అవసరం. ఈ సింపుల్ చిట్కాలను ఉపయోగించి ఈ సమ్మర్ సీజన్ లో మీ చర్మాన్ని రక్షించుకొని అందంగా ఆరోగ్యంగా జీవించండి.

English summary

Summer Skin Care Tips For Men | పురుషులకు అత్యవసరమైన సమ్మర్ స్కిన్ కేర్ టిప్స్...!

When the summer sun starts shining, your skin need protection from the scorching heat. Your skin needs care all year long, but more during the summers. Apart from developing wrinkles and accelerating the aging process, UV rays can cause extensive damage to the skin. You might enjoy summer outings but, you need to care for the skin and protect it from harmful UV rays of the sun.
Desktop Bottom Promotion