For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చర్మ సంరక్షణకు ప్రకృతి ప్రసాధించిన వరం కలబంద..!

|

ప్రకృతిలో లభించే మూలికలతో, చెట్లతో ఎన్నో వ్యాధులను దూరం చేసుకునే అవకాశం మానవునికి లభించింది. ఇందులో కలబంద ఒకటి. వ్యాధి నిరోధకశక్తిని పెంపొందించే గుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. విటమిన్స్‌, ఎంజైమ్స్‌, మినరల్స్‌ల మిశ్రమం కలబంద. రోజూ కలబందను తీసుకోవడం ద్వారా వ్యాధి నిరోధకశక్తి బలపడుతుంది. తద్వారా వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి. అలొవెరాను జెల్‌, జ్యూస్‌, పిల్స్‌ టాబ్లెట్స్‌ రూపంలో తీసుకోవచ్చు. ఇంకా కలబందతో ఏమేమి ప్రయోజనాలో తెలుసుకుందాం.

చూడటానికి ముళ్ళ మొక్కలా ఉంటుంది. అలోవెరా జెల్ ఉపయోగాలు అన్ని ఇన్ని కావు . చర్మ సంరక్షణ విషయంలో ఇది అద్భుతంగా పని చేస్తుందంటారు సౌదర్యనిపుణులు. చర్మ సంరక్షణ, ర్యాషెస్, కోతలు, గాయాలు, చర్మం కమిలిపోవటం మొదలగువాటికి అలోవెరా మంచి మెడిసినన్ అని అందరికి తెలిసిందే. అలోవెరా సహజసిద్ధమైన మాయిశ్చరైజర్. పోడిచర్మంతో బాధపడేవారు తరుచుగా అలోవెరా ఆయిల్ రాస్తుంటే చర్మం మృదువుగా మెత్తగా అవుతుంది. వాతావరణ కాలుష్యం కారణంగా మన చర్మం అనేక రకాల విషపదార్ధాల ప్రభావానికి గురవుతుంది. అలోవెరా జెల్ వాటి బారి నుంచి చర్మాన్ని పరిరక్షించి ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతే కాదు అయితే అలోవెరా జ్యూస్ తాగితే వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు మరింత అధికం. ఎంతో సురక్షితం. ఈజ్యూస్ లో వివిధ పోషకాలు, విటమిన్లు, మినరల్స్, ఎమినో యాసిడ్స్ వంటి పోషకాలెన్నో వుంటాయి. ఇది జెల్ , ఆయింట్మెంట్ , లోషన్ ల రూపం లో అటు సౌందర్య సాధనం గా ఇటు ఔషధం గా దీని వాడుక విపరీతం గా పెరిగింది.

Aloe Vera For Skin Care

1. డీటాక్సిఫికేషన్‌: శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపించడానికి కలబంద ఉపయోగపడుతుంది. రక్తం సరఫరాను మెరుగుపరిచే గుణం దీనిలో ఉంది. రక్తనాళాలు సాఫీగా ఉండేలా, రక్తకణాలు వృద్ధి చెందేలా చేయడంలోనూ కలబంద ఉపకరిస్తుంది.

2. చర్మం ఎరుపెక్కడం, రేడియేషన్‌ మూలంగా దెబ్బతిన్న చర్మానికి అలొవెరా జెల్‌ బాగా పనిచేస్తుంది. స్కిన్‌ రాషెస్‌, హెర్పిస్‌ సింప్లెక్స్‌, మొటిమలు, రింగ్‌ వార్మ్‌ తదితర చర్మవ్యాధులకు కలబంద మంచి ఔషధం. చర్మంపై వచ్చే నల్లమచ్చలను ఇది పోగొడుతుంది. సోరియాసిస్‌ గజ్జిలాంటి చర్మవ్యాధులను తగ్గిస్తుంది. చర్మానికి నిగారింపు తీసుకొస్తుంది.

3. ముడతలను నివారించడమే కాకుండా మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. ప్రెగ్నెన్సీ అనంతరం వచ్చే స్ట్రెచ్‌ మార్క్స్‌ను పోగొట్టడానికి ఉపకరిస్తుంది. చర్మం యవ్వనంగా ఉంచేందుకు తోడ్పడే కొల్లాజెన్‌, ఎలాస్టిన్‌ ఉత్పత్తి కావడానికి అవసరమైన ప్రేరణను అందిస్తుంది. చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది.

4.చర్మంపై ఉండే సిబేషియస్‌ గ్రంథులు నూనెతో కూడుకుని ఉంటాయి. వీటి సూక్ష్మరంధ్రాలు మూసుకుపోవడం వల్ల ఉబ్బి మొటిమలుగా మారుతాయి. రోజూ అలొవెరాను తీసుకోవడం వల్ల రక్తం శుభ్రపడటమే కాక రక్త సరఫరా మెరుగుపడుతుంది. తద్వారా మొటిమలు తగ్గుముఖం పడతాయి.

5. వ్యాధుల వలన పొడిబారిన చర్మంపై సహజ సిద్ధమైన తేమను అందిస్తూ శరీరాన్ని శుభ్రంగా, కాంతివంతంగా మారుస్తుంది. శుభ్రపరిచిన చర్మముపై కొద్దిగా కలబందను రాస్తే శరీరము కళగా, కాంతివంతమై బహుళ ప్రయోజనం కలిగిస్తుంది.

6. పొడిబారిన, ముడతపడిన చర్మముపై కొద్దిగా కలబంద జిగురును రాస్తే ఆ ప్రాంతములో తేమశాతము పెరుగుతుంది. మరిన్ని మంచి ఫలితాల కోసం ఈము నూనెను కలబంద జిగురు కలిపిన మిశ్రమాన్ని పొడి చర్మముపై రాస్తే తేమతో పాటు ముఖవర్చస్సు కాంతివంతమవుతుంది.

7. కలబంద జిగురులో కొద్దిగా ఆలివ్‌ నూనె, గులాబీ నీరు. కొన్ని చుక్కల ద్రాక్ష రసాన్ని ఒక మిక్సీలో వేసి బాగా కలుపుకుని ఆ మిశ్రమాన్ని ముఖంపై రాసుకోవాలి.

8. ఉదయం నిద్ర లేచిన తరువాత, రాత్రి నిద్రపోయే ముందు కలబంద లోపల భాగంలోని జిగురును తీసుకుని అలాగే ముఖంపై రాసుకుని మెల్లగా మర్దన చేసుకుంటే చర్మము మృదువుగా కాంతివంతంగా ఉంటుంది.

9. చర్మ సంరక్షణకు అవసరమైన అమెనో ఆసిడ్స్‌ మెండుగా కలిగి, విటమిన్‌ బి12, విటమిన్‌ సి, ఇ కాల్షియం, ఐరన్‌(ఇనుము) లెసిథిన్‌, మెగ్నీషియం, మాంగనీస్‌, పొటాషియం, సోడియం, జింక్‌ వంటి ఖనిజాలను కలిగి ఉంటుంది.

10. రెండు టేబుల్‌స్పూన్ల కలబంద జిగురు, రెండు టేబుల్‌ స్పూన్ల పంచదార, ఒక టీస్పూన్‌ నిమ్మరసం బాగా కలియబెట్టి చర్మముపై నలుగులా పెట్టుకోవాలి.

English summary

The Benefits Of Using Aloe Vera For Skin Care | చర్మ సంరక్షణకు ప్రకృతి ప్రసాధించిన వరం కలబంద..!

Aloe vera has been used for a host of purposes since the ancient Egyptians called it the “plant of immortality.” Since then, its uses have become more targeted and medicinal, and it's one of the leading therapies for sunburns.
Story first published: Saturday, April 27, 2013, 15:00 [IST]
Desktop Bottom Promotion