For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొబ్బరినూనెతో పొడిబారిన పెదాలను నయం చేసే చిట్కాలు

By Derangula Mallikarjuna
|

కొబ్బరి నూనె తో పొడిబారిన పగిలిన పెదాలను నయం చేసే మార్గాలు:
పగిలిన, డ్రైలిప్స్ నివారించడానికి కొబ్బరినూనెతో చిట్కాలు:
ఈసారి శీతాకాలం చాలా త్వరగా వచ్చేసినట్లు అనిపిస్తోంది. మరి ఈ సీజన్ కు మనం మన ఆరోగ్యం, అందాన్ని కాపాడుకోవడానికి సిద్దంగా ఉండాలి. ఎందుకంటే ఈ శీతాకాలంలో చలి, చల్లని గాలు, కఠినమైన గాలుల వల్ల మన శరీర ఆరోగ్యంతో పాటు మన చర్మం మరియు జుట్టు కూడా ప్రభావితం అవుతుంది. వింటర్ లో ఈ పొడి, మరియు చల్లని గాలుల వల్ల మన చర్మం మరియు జట్టు చాలా త్వరగా డీహైడ్రేషన్ చెందుతుంది . డ్రై స్కిన్ మన శరీరానికి మరియు ముఖానికి చెడుగా కనబడేలా చేస్తుంది. ఇది నివారించుకోవటానికి ఈ సీజన్ లో మీరు ఎల్లప్పుడు మీశరీరానికి మరియు చర్మానికి ఒక మాయిశ్చరైజర్ మరియు క్రీములను ఉపయోగించాలి .

ఈ చల్లని వాతావరణాకి మీ చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. ఈ చలికి పెదాలు కూడా చర్మం కంటే మరింత సున్నితంగా మారుతాయి. చర్మంలో వలె పెదాలలలో ఆయిల్ గ్రంధులు ఉండవు. అందువల్ల, పెదాలు ఎటువంటి ఆయిల్ లేదా ఎటువంటి తేమను అంధించవు. కాబట్టి, వింటర్ లో మీ శరీర చర్మం సంరక్షణ కంటే పెదాలకు మరింత జాగ్రత్త వహించడం చాలా అవసరం . ఈ చల్లిని వాతావరణం మీ పెదాల పగిలేలా మరియు పొడిబారేలా మరియు తెగి నట్లు కనిపిస్తూ, అందవిహీనంగా చేస్తాయి. ఈ సమస్యను నివారించుకోవాడానికి మార్కెట్లో అనేక క్రీములు, లిప్ బామ్స్ మరియు మాయిశ్చరైజర్ల్ అందుబాటులో ఉన్నాయి. వీటిని ఉపయోగించవచ్చు.

Ways to Cure dry chapped Lips with coconut oil
ఇవే కాకుండా పగిలిన మరియు పొడి బారిన పెదాలను రక్షణకు అనేక ఇంటి నివారణా పద్దతులు కూడా ఉన్నాయి. కొన్నినేచురల్ మాయిశ్చరైజర్లు మీ పెదాలను సున్నితంగా మరియు రీహైడ్రేషన్ కలిగిస్తుంది. అటువంటి కొన్ని ఉత్పత్తులు : వెన్న, ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె, పాల క్రీమ్ మరియు మరికొన్నిఇతరములు. వీటన్నింటిలోకి పగిలిన పెదాలకు కొబ్బరి నూనె చలా బాగా పనిచేస్తుందని భావిస్తారు. ఈ నూనె పెదాలు పొడిబారడాన్ని తగ్గిస్తుంది మరియు పెదాలకు తగినంత తేమను అందిస్తుంది. కొబ్బరి నూనె పగిలిన, పొడి బారిన పెదాల చుట్టూ ఒక పొరను ఏర్పరుస్తుంది. అందువల్ల చల్లని గాలి నుండి పెదాలకురక్షణ కల్పిస్తుంది . కొబ్బరి నూనె చాలా సులభంగా అందుబాటుల ఉంది మరియు ఇది చాలా చవకగా దొరుకుతుంది . కాబట్టి ప్రతి ఒక్కరూ పగిలిన మరియు పొడిబారిన పెదాల చికిత్సకు కొబ్బరినూనెను ఉపయోగించుకోవచ్చు. పగిలిన మరియు పొడి బారిన పెదాలకు కొబ్బరినూనె ఉపయోగించి చికిత్సనందించే మార్గాలను కొన్నింటిని మీకోసం ఈ క్రింది విధంగా ఇవ్వబడింది.

1 .ప్రతి రోజూ ఉపయోగించండి: మీ పర్స్ లేదా బ్యాగ్ లో ఒక చిన్న బాటిల్ లో కొబ్బరి నూనెను వేసుకొని పట్టుకెళ్ళండి. రోజులో అప్పుడప్పుడు ఈ నూనెను అప్లై చేస్తుండండి. అలాగే మీ కొన వేలికి కొద్దిగా కొబ్బరినూనె తీసుకొని మీ పెదాల మీద కూడా సున్నితంగా అప్లై చేయాలి. కొబ్బరి నూనెను ఉపయోగించి పగిలిన పెదాలను నివారించడానికి ఇది ఒక ఉత్తమ మార్గం . ఈ వింటర్ సీజన్ లో దీన్ని ఉపయోగించి ఉత్తమ ఫలితాలను పొందండి.

2 . ఓవర్నైట్ చికిత్స - కొబ్బరి నూనె ఒక ప్రత్యేక వాసన మరియు రుచి ఉంది . అది మిమ్మల్ని అసౌకర్యానికి గురిచేసినప్పుడు, మీరు పగటిపూట ఉపయోగించండి లేదా కొన్ని ఇతర కారణాల వల్ల మీరు కొబ్బరినూనెను ఉపయోగించలేనప్పడు, మరో సౌకర్యం కూడా అందుబాటులో ఉంది, మీరు నిద్రించే ముందు మీ పెదాలకు కొబ్బరి నూనెను అప్లై చేయండి. రాత్రంతా అలాగే ఉంచి, ఉదయం గోరువెచ్చని నీటితో శుభ్రం చేసేసుకోండి . అయితే పగిటి పూట ఏదైనా లిప్ బామ్ ను ఉపయోగించండి.

3 . కోకోనట్ ఫ్లేవర్ బామ్ : కొబ్బరినూనెతో తయారుచేసిన అనేక లిప్ బామ్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ లిప్ బామ్స్ ఉపయోగించడం వల్ల ఒక ఖచ్చితమైన లాభాలు అంధించకపోయినా కొంత ప్రభావాన్ని చూపెడుతాయి. ఈ బామ్స్ ను రెగ్యులర్ గా ఉపయోగించవచ్చు. మరియు కెమికల్స్ తో తయారుచేసినవి కాకుండా, నేచురల్ గా తయారుచేసిన లిప్ బామ్స్ ను ఎంపిక చేసుకోండి .

4 . సాలిడ్ ఆయిల్ - గట్టిగా ఉండే కొబ్బరినూనె కూడా చాలా ఎఫెక్టివ్ గా మరియు నేచురల్ లిప్ బామ్ గా పనిచేస్తుంది. స్వచ్చమైన కొబ్బరినూనె ఘనరూపంలో ఉంటుంది. దీన్ని కరిగించడానికి ఎండలో లేదా, వేడి చేస్తే కరిగిపోతుంది .కాబట్టి సాలిడ్ ఆయిల్ ను కూడా పగిలిన పెదాలకు అప్లై చేయవచ్చు. దాని ఘన రూపంలో కొబ్బరి నూనె ఒక చాలా సమర్థవంతంగా మరియు సహజ పెదవి ఔషధతైలం ఉపయోగించవచ్చు .

5 . ఆయిల్ మిశ్రమాలను - కొబ్బరి నూనెకు ఆలివ్ ఆయిల్ లేదా వేరే ఏ ఇతర నూనెలనైని మిక్స్ చేసి పగినలిన పెదాలకు అప్లై చేయడం వల్ల తగినంత తేమను అందిస్తుంది. ఇలా మిశ్రమ ఆయిల్ ను ఉపయోగించేటప్పుడు రాత్రి సమయంలో ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలుంటాయి. అది ఉపయోగించే విధానం, వారి మీద ఆధారపడి ఉంటుంది. ఈ మిశ్రమం చాలా సమర్థవంతంగా మరియు శీతాకాలంల పొడి గాలుల నుండి పెదవులకు ఎక్కువ రక్షణ కల్పిస్తుంది .

English summary

Ways to Cure dry chapped Lips with coconut oil

Winter is arriving sooner this time. It is time to get prepared for it. Winter calls in for more attention to skin and hair. The dry cold air results in dehydrating the skin and scalp. The dried skin gives a bad look to the face and body. To avoid this one should always use a moisturizer and creams.
Desktop Bottom Promotion