For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముఖాన్ని ప్రకాశవంతంగా మార్చే ఓ అద్భుత పండు!

|

సాధారణంగా మనలో ఒక్కోరికి ఒక్కో అభిరుచి ఉంటుంది. పండ్లంటే ఇష్టపడేవారు చాలా మంది ఉంటారు. అందులో రెడ్ కలర్ ఫ్రూట్స్ ఆపిల్స్, ద్రాక్ష, దానిమ్మ వంటివి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇవి ఇష్టమాత్రమే కాదు ఆరోగ్యానికి వందకు వందశాతం మేలు చేస్తాయి కూడా. వీటితో పాటు అంతటి శక్తివంతమైన ఫ్రూట్స్ మరికొన్ని కూడా ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా ఎర్రగా మరియు జ్యూసీగా ఉండే ఫ్రూట్స్ బెర్రీస్. మన టేస్ట్ బడ్స్ ను మరింత టేస్ట్ గా చూపించే ఈ బెర్రీస్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. మరియు ఇందులో ఉండే సాలిసిలక్ యాసిడ్ ఉండటం వల్ల ఇది చాలా వరకూ స్కిన్ ప్రొడక్ట్స్ గా బాగా ఉపయోగిస్తారు. స్ట్రాబెరీ ఒక అద్భుతమైన టోనర్ గా పనిచేస్తుంది మరియు చర్మాన్ని బిగుతుగా చేస్తుంది మరియు చర్మం ప్రకాశవంతంగా మరియు కాంతివంతంగా మార్చుతుంది.

ఇంకా స్ట్రాబెర్రీలో ఆల్ఫా హైడ్రాక్సిన్ యాసిడ్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది మన ముఖంలోని డెడ్ స్కిన్ తొలగించి కొత్తచర్మాన్ని తీసుకొస్తుంది. మరియు అది చాలా కాంతివంతంగా ఉండేలా చేస్తుంది. స్ట్రాబెరీ ఇంకా మొటిమలను, ముఖంలో పేరుకుపోయిన జిడ్డును, తొలగిస్తుంది. దంతాలను తెల్లగా మార్చుతుంది. కళ్ళ క్రింద ఉబ్బెత్తును తగ్గిస్తుంది మరియు మరెన్నో సమస్యలను నివారిస్తుంది. ఈ అద్భుతమైన స్ట్రాబెరీ పండును, జస్ట్ సింపుల్ గా చర్మానికి అప్లై చేయడం చాలా అద్భుతాలు జరగుతుంది. మరి ఆ అద్భుతాలు మీ ముఖంలో కూడా కనబడాలంటే స్ట్రాబెరీను ఉపయోగించే మార్గాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. పరిశీలించండి...

Ways To Use Strawberry On Face

స్ట్రాబెర్రీ స్ర్కబ్: స్ట్రాబెరీను ముఖానికి ఉపయోగించాలంటే , అందుకు మీరు అంత శ్రమపడాల్సిన అవసరం లేదు. ఒక స్ట్రాబెర్రీను రెండుబాగాలుగా మద్యకు క్ట్ చేసి , వాటిని తీసుకొని ముఖం మీద మర్ధన చేయాలి . తర్వాత కొన్ని నిముషాలు అలాగే వదిలేసి, తర్వాత చల్లటి నీళ్ళతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. అంతే మీకు ముఖంలో తక్షణ మార్పు కనిపిస్తుంది.

స్ట్రాబెర్రీ మరియు క్రీమ్: ముఖానికి స్ట్రాబెరీని ఉపయోగించడానికి మరొక ఎఫెక్టివ్ మార్గం ఇది. మిక్సీలో స్ట్రాబెరీని వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ కు తాజా క్రీమ్ ను ఒక టేబుల్ స్పూన్ , మరియు ఒక టేబుల్ స్పూన్ తేనె మిక్స్ చేసి, మూడింటిని చిక్కటి పేస్ట్ లా తయారు చేసి, ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు పట్టించాలి. అప్లై చేసిన 10 నిముషాల తర్వాత చల్లటి నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి.

కళ్ళక్రింద ఉబ్బును తగ్గిస్తుంది: రోజంతా పనిచేసి అలసిపోయిన కళ్ళు, కళ్ళక్రింద ఉబ్బెత్తుగా కనబడుతాయి. ఈ సమస్య నివారించుకోవాలంటే స్ట్రాబెరీను రెండుగా కట్ చేసి కళ్ళక్రింద కొద్దిసేపుపెట్టుకోవాలి. పది నిముషాలు కళ్ళు మూసుకొని విశ్రాంతి తీసుకోవాలి. తర్వాత స్ట్రాబెరీ స్లైస్ ను తొలగించి కళ్ళకు మాయిశ్చరైజర్ అప్లై చేయాలి.

మొటిమల నివారణకు స్ట్రాబెరీ: స్ట్రాబెరీ ముఖానికి అప్లై చేయడం వల్ల మొటిమలను నివారించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అరకప్పు స్ట్రాబెరీలను మెత్తగా పేస్ట్ చేసి, అందులో సోర్ క్రీమ్ ను మిక్స్ చేసి, ముఖానికి అప్లై చేసి 10-15నిముషాలు అలాగే ఉంచి , తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేయడం వల్ల , ఇది చాలా ప్రభావవంతంగా మొటిమలను నివారిస్తుంది.

బియ్యం పిండి మరియు స్ట్రాబెరీ ప్యాక్: ఐదు ఆరు స్ట్రాబెరీ లను మెత్తగా పేస్ట్ చేసి ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండిని చేర్చి మెత్తగా పేస్ట్ చేయాలి . ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పదిహేను నిముషాలు అలాగే వదిలేయాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ముఖానికి స్ట్రాబెరీను ఉపయోగించడంలో ఇవి ఒక మంచి మార్గాలు . ఈ పండును ఉపయోగించి మీరు కాంతివంతమైన మరియు ప్రకాశవంతమైన చర్మాన్ని పొందండి.

English summary

Ways To Use Strawberry On Face

We all love those red and juicy fruits. Those pretty little berries do more than just delight our taste buds. Did you know that strawberries are a great source of vitamin C and salicylic acid which is used to make most of the skin products?
Story first published: Monday, August 5, 2013, 9:56 [IST]
Desktop Bottom Promotion