For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రకాశవంతమైన చర్మం-ఆరోగ్యకరమైన జుట్టుకోసం 10 హేర్బ్స్

|

అందం అనిర్వచనీయం..అందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. వయసు మీద పడుతున్నా యవ్వనంగా కనిపించాలని అను కుంటారు. కొద్ది మందే కాదు ప్రస్తుతం అందరూ అందంగా ఉం డాలని పరితపిస్తున్నారు. అందమైన ఆకృతి కోసం అర్రులు చాస్తున్నారు. శరీరతత్వంలో వచ్చే మార్పులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు యవ్వనం ఉట్టిపడేలా ఉండాలని ఉవ్విళ్లూరుతున్నారు. నిత్యం యవ్వనంగా కనపడాలని ఎవరికివుండదు. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా వుండాలని ఏవేవో మందులు వాడటం, యోగాలు, ఆసనాలు చేయడం, డైటింగ్ చేయడం లాంటివి ఎన్నో చేస్తుంటారు.

అంతే కాదు కొన్ని రకాల ఫేస్ ప్యాక్ లు అనేక క్రీములను కూడా ఉపయోగిస్తుంటారు. కానీ, రెడీమేడ్ గా వచ్చేవి అంతే త్వరగా, ప్రభావం చూపవు. అయితే మనకు ఇంటిపరిసరాల్లో దొరికే నేచురల్ హేర్బల్ రెమడీలు చాలా అద్భుతంగా ప్రభావాన్ని చూపుతాయి. అవి కూడా ఎటువంటి చర్మ సమస్యలనైనా నివారిస్తాయి మరియు చర్మం సౌందర్యాన్ని ఇనుమడింప చేస్తాయి. ఇంటి పరిసరాల్లో నిత్యం కనిపించే సాధారణ మొక్కలను మనం అంతగా పట్టించుకోం. మన సౌందర్యం పెంచేందుకు ఈ మొక్కల ఆకులు ఎంతగానో దోహద పడతాయి. వీటిలో ఉండే ఔషధ గుణాలు మనకెంతో మేలు చేస్తాయి. మేని ఛాయను మెరుగు పరిచేందుకు, శిరోజాలు నిగనిగలాడేందుకు ఇవి ఉపయోగపడతాయి. మరి మీరు కూడా మీ చర్మ-కేశ సౌందర్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా..ఈ క్రింది హేర్బల్ రెమెడీలు ఒకసారి చూడండి...

నిమ్మపండు-

నిమ్మపండు-

ప్రకృతిలో సహజంగా సీజన్ మొత్తంలో లభించేది నిమ్మపండు. నిమ్మపండులో సిట్రస్ ఆమ్లఉంటుంది కాబట్టి ఇది పింపుల్స్, స్కార్స్ వంటివి పోగొట్టి పేస్ ఎప్పుడూ ఫ్రెష్ గా ఉండేటట్లు చేస్తుంది. నిమ్మ ఆకులు, నిమ్మ పౌడర్ పెరుగు లేక కీరకాయ రసంతో కలిపి ముఖానికి ఫేస్ ప్యాక్ లా వేసుకొని 20 నిమిషాలు పాటు అలాగే ఉంచుకొని తర్వాత రోజ్ వాటర్ తో ఫేష్ వాస్ చేసుకోవాలి.

పుదీనా-

పుదీనా-

ఏ సీజన్ లో అయినా పుదీనా దొరుకుతుంది. పుదీనాతో ఎల్లవేళలా ముఖంను చల్లగా ఉంచుతుంది. పుదీనా బ్యాక్టీరియాను చంపుతుంది. చర్మం లోపల దాగిఉన్న దుమ్ము, దూళి, క్రిములను వెలికితీస్తుంది. ఈ ఆకులను మెత్తగా నూరి ముఖంపై ‘ప్యాక్' వేసుకుంటే మొటిమల సమస్య పోతుంది. చర్మం కాంతివంతమవుతుంది. జిడ్డు చర్మంతో బాధపడేవారికి ఉపశమనం కలుగుతుంది.

తులసి:

తులసి:

ముఖం ఫై ఏర్పడిన నల్లని మచ్చలను నివారించడంలో తులసి మంచి ఒషధంలా పనిచేస్తుంది. తులసి రసానికి , నిమ్మ రసం చేర్చి ముఖానికి పట్టించి ఇరవయ్ నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే కొన్నాళ్ళకు మచ్చలు పూర్తిగా తగ్గుతుంది. చర్మం కాంతివంతముగా ఉంటుంది.

మెంతి:

మెంతి:

చర్మ సౌందర్యానికి, కురుల పోషణకు మెంతి ఆకులను వాడతారు. వీటి ఆకులను మెత్తగా రుబ్బి, కురులకు పట్టిస్తే చుండ్రు సమస్య తీరుతుంది. జట్టు రాలడం తగ్గుతుంది.

వేప:

వేప:

కాంతి తగ్గిన చర్మానికి, మొటిమలు తేలిన ముఖానికి ఈ ఆకుల ముద్దను రాస్తే మంచి ఫలితం ఉంటుంది. వేప ముద్దను జుట్టు కుదుళ్లకు, కేశాలకు పట్టిస్తే జుట్టు రాలడం తగ్గుతుంది. కురులు తళతళలాడతాయి.

నీలగిరి:

నీలగిరి:

నీటిలో ఈ ఆకులను వేసి మరగించాలి. అపుడు వెలువడే వేడిని ముఖానికి పట్టుకుంటే ఉపశమనం ఉంటుంది. ముఖం, చర్మం కాంతివంతమయ్యేలా ఈ ఆకులను వాడవచ్చు

గోరింటాకు:

గోరింటాకు:

శిరోజాలకు చక్కని ‘కండిషనర్'గా గోరింటాకు పనిచేస్తుంది. వేడిని తగ్గించి, చర్మాన్ని చల్లబరిచే గుణం ఈ ఆకుల్లో ఉంది.

మందారం:

మందారం:

వీటి ఆకులను మెత్తగా రుబ్బి కురులకు పట్టిస్తే మంచి నిగారింపు వస్తుంది. ఆకులను బాగా ఎండబెట్టి కొబ్బరినూనెలో వేయాలి. ఆ తర్వాత నూనెను తలకు రాసుకుంటే శిరోజాలు నల్లగా, వొత్తుగా పెరుగుతాయి. జట్టు రాలడం కూడా తగ్గుతుంది.

కరివేపాకు:

కరివేపాకు:

కురులు వొత్తుగా పెరిగేందుకు, తళతళలాడేందుకు ఈ ఆకులతో ‘హెయిర్ ప్యాక్' వేసుకోవాలి. కేశాలు గట్టిపడతాయి.

కలబంద పూత:

కలబంద పూత:

ఒక్కోసారి ఎండకు ముఖచర్మం ఎర్రగా మారి దద్దుర్లు వచ్చే అవకాశముంటుంది. అప్పుడు నీళ్లతో కడగకపోవడం మంచిది. కలబంద గుజ్జును పూతలా వేసి ఐదు నిమిషాలయ్యాక మృదువ్ఞగా మునివేళ్లతో మర్దన చేయాలి. కొద్దిసేపయ్యాక నీళ్లలో దూదిని, లేదా స్పాంజిని ముంచి రెండుసార్లు అద్ది, పొడివస్త్రంతో తుడుచు కొంటే ఇబ్బంది ఉండదు. లేదంటే సమస్య రెట్టింపవ్ఞతుంది.

English summary

Herbs for Radiant Skin and Healthy hair

Everyone wants to achieve glowing, gorgeous and perfect skin. Often we go about it the wrong way and apply harmful chemical laden synthetic beauty products that end up causing more harm than good. If you want to make a real and lasting change for your skin, opt for natural alternatives such as these magical herbal agents.
Story first published: Wednesday, April 16, 2014, 17:10 [IST]
Desktop Bottom Promotion