For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆయిల్ స్కిన్: నివారించే బెస్ట్ హోం రెమెడీస్

ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఆయిల్ స్కిన్ సమస్యను ఎదుర్కొంటున్నారు . చర్మం ఆయిల్ అధికంగా ఉన్నప్పుడు, మొటిమలు, మచ్చలు, బ్లాక్ హెడ్, వైట్ హెడ్స్, మరియు ఇతర చర్మం సమస్యలను ఎదుర్కొవల్సి వస్తుంది. చర్మం అదన

|

ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఆయిల్ స్కిన్ సమస్యను ఎదుర్కొంటున్నారు . చర్మం ఆయిల్ అధికంగా ఉన్నప్పుడు, మొటిమలు, మచ్చలు, బ్లాక్ హెడ్, వైట్ హెడ్స్, మరియు ఇతర చర్మం సమస్యలను ఎదుర్కొవల్సి వస్తుంది. చర్మం అదనపు నూనెను ఉత్పత్తి చేయడానికి అనేక కారణాలున్నాయి. టీనేజర్స్ లో ఆయిల్ స్కిన్ ఏర్పడటానికి ప్రధాన కారణం హార్మోనుల్లో మార్పులు. అదేవిధంగా వేడి, అధికంగా స్మోక్ చేయడం, ప్రెగ్నెన్సీ, మోనాపాజ్ మొదలగునవి ఆయిల్ స్కిన్ కు ప్రధాన కారణాలు.

యవ్వనానికి అడ్డుపడే ఆయిల్ స్కిన్ తొలగించండిలా: క్లిక్ చేయండి

కారణం ఏదైనప్పటికి, ఆయిల్ స్కిన్ ఒక చిరాకు తెప్పించే ఒక బాధాకరమైన సమస్య. మీ చర్మం మొటిమలు మొదలుకొని, చర్మ రంధ్రాల వరకూ మరియు చర్మానికి మేకప్ దీర్ఘ సమయం ఉండదు. కాబట్టి, మీ చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడానికి, చర్మంలో అదనపు నూనెను సమర్థవంతంగా వదిలించుకోవడా చాలా అవసరం. ఆయిల్ స్కిన్ వదలించుకోవడానికి కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది. అయితే సమస్యను నివారించుకోవడానికి అనేక మార్గాలున్నాయి. అందుకు ఖర్చుచేయాల్సిన అవసరం లేదు . ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఆయిల్ స్కిన్ నివారించుకోవడానికి కొన్ని బెస్ట్ హోం రెమడీస్...

ఎగ్ వైట్

ఎగ్ వైట్

ఎగ్ బైట్ లో విటమిన్ అధికంగా ఉంది, ఎగ్ వైట్ చాలా ఎఫెక్టివ్ చర్మకాంతిని పెంచుతుంది అదే విధంగా చర్మాన్ని టైట్ చేసి, జిడ్డును తొలగిస్తుంది.

*ఎగ్ వైట్ ను అలాగే ప్లెయిన్ గా లేదా నిమ్మరసం జోడించి మిక్స్ చేసి ముఖ చర్మంకు పట్టించి ఎడిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇలా వారానికి ఒకటి రెండు సార్లు చేస్తే సరిపోతుంది.

నిమ్మరసం

నిమ్మరసం

నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఒక గొప్ప ఆస్ట్రిజెంట్. ఇందులో యాంటీసెప్టిక్ లక్షణాలు కలిగి ఉండి, చర్మ కాంతిని పెంచడంలో అద్భుతంగా సహాయపడుతుంది. అలాగే చర్మంలో పిహెచ్ ను బ్యాలెన్స్ చేస్తుంది.

*ఒక చెంచా నిమ్మరసంలో అరటీస్పూన్ డిస్టిల్ వాటర్ మిక్స్ చేసి, కాటన్ బాల్స్ తో ముఖం మీద అప్లై చేసి 10నిములు అలాగే ఉంచి, తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి . నిమ్మరసం మీ చర్మాన్ని డ్రై చేస్తుంది. కాబట్టి, కొంచె ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజ్ ను అప్లై చేయాలి. ఇలా ప్రతి రోజూ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

పెరుగు

పెరుగు

పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంది. ఇది చర్మానికి చాలా అద్భుతంగా ఎక్స్ ఫ్లోయేట్ చేస్తుంది. చర్మంలో ఉండే అదనపు జిడ్డు,నూనెతో ఎఫెక్టివ్ గా తొలగిస్తుంది.

*ఒక చెంచా సాదా పెరుగు ను మీ ముఖం మీద అప్లై చేసి 15నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతి రోజూ ఒక సారి చేసుకుంటే, ఆయిల్ స్కిన్ శాశ్వతంగా పరిష్కరించుకోవచ్చు.

టమోటో

టమోటో

ఆయిల్ స్కిన్ కు టమోటో చాలా గొప్పగా పనిచేస్తుంది టమోటోలో చర్మం శుభ్రపరిచే గుణాల మరియు ఆస్ట్రిజెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. మరియు ఇందులో విటమిన్ సి చర్మంలో మెటిమలు మచ్చలు తొలగించడానికి అద్భుతంగా సహాయపడుతుంది. ఇది చర్మంలో ఎక్సెస్ ఆయిల్ ను తొలగిస్తుంది.

* టమోటోను రెండుగా కట్ చేసి ముఖానికి అప్లై చేసి 15నిముషాలు అలాగే ఉంచి, తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజ్ ను అప్లై చేయాలి.

ఆపిల్స్

ఆపిల్స్

ఆపిల్స్ గొప్ప ఎక్స్ ఫ్లోయేట్ గా పనిచేస్తుంది. ఇందులో యాంటీసెప్టిక్, ఆస్ట్రిజెంట్, మరియు స్మూతింగ్ లక్షణాలు కలిగి ఉన్నాయి. ఇది ఆయిల్ స్కిన్ కు ఒక గ్రేట్ హోం రెమడీ. ఇందులో ఉండే మాలిక్ యాసిడ్స్ చర్మాన్ని ఎక్స్ఫ్లోయేట్ చేసి డెడ్ స్కిన్ సెల్స్ ను మరియు అధనపు నూనెను తొలగిస్తుంది.

*ఆపిల్ ముక్కను తురిమి లేదా పేస్ట్ చేసి చర్మానికి అప్లై చేసి 15నిముషాలు అలాగే ఉంచి తర్వాత వాటర్ తో శుభ్రం చేయాలి.

కీరదోసకాయ

కీరదోసకాయ

ఆయిల్ స్కిన్ నివారించడంలో కీరదోస కూడా అద్భుతంగా పనిచేస్తుంది. చర్మానికి చల్లదనాన్ని, ఆస్ట్రిజెంట్, కలిగించే లక్షణాలు కలిగి ఉన్నాయి. ఇందులో పుష్కలమైన విటమిన్స్ మరియు మినిరల్స్, ఎ, ఇ విటమిన్, మెగ్నీషియం మరియు పొటాషియం పుష్కలంగా ఉండి చర్మానికి చాలా మేలు చేస్తాయి.

* తాజాగా ఉండే ఆర్గానిక్ కీరదోసకాయను కట్ చేసి మీ ముఖం మీద రుద్దాలి. అలా చేసిన తర్వాత రాత్రంతా అలాగే ఉంచి, మరుసటి రోజు ఉదయం గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్

ఆపిల్ సైడర్ వెనిగర్

ఆపిల్ సైడర్ వెనిగర్ లో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి మచ్చలు, మెటిమలను నివారించడంలో మరియు ఆయిల్క్ ను మరియు చర్మంలో బ్యాక్టీరియా నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. అలాగే ఆల్ఫా హైడ్రాక్సీ ఆసిడ్స్ చర్మానికి అద్భుతంగా పనిచేసి మాయిశ్చరైజ్ గా పనిచేస్తుంది.

*1/4కప్పు యాపిల్ సైడర్ వెనిగర్ ను డిస్టిల్డ్ వాటర్ తో మిక్స్ చేసి మీ చర్మానికి పట్టించి 10నిముషాలు అలాగే ఉంచి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా ఒక వారం పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

పాలు

పాలు

పాలు ఒక గొప్ప ఆయిల్ ఫ్రీ క్లెన్సర్. ఆయిల్ స్కిన్ సాఫ్ట్ గా మరియు సపల్ గా ఉంచతుంది . పాలలోని ఆల్ఫా హైడ్రాక్సీ ఆసిడ్స్ చాలా గొప్పగా ఉండి చర్మానికి గొప్పగా పనిచేస్తుంది మరియు చర్మంలోని పిచ్ ను బ్యాలెన్స్ చేస్తుంది.

*పాలలో రెండు మూడు చుక్కల సాండిల్ ఉడ్ లేదా లావెండ్ ఆయిల్ మిక్స్ చేసి నిద్రించే ముందు ముఖానికి పట్టించాలి. బాగా మసాజ్ చేసి రాత్రి అలాగే వదిలేయాలి. ఉదయం చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

కలబంద

కలబంద

అలొవెరాలో యాంటీ బ్యాక్టిరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఆయిల్ స్కిన్ తొలగించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.

* తాజా అలొవెరాను కట్ చేసి జెల్ ను ముఖానికి అప్లై చేయాలి. బాగా ఎండిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజుకు ఒకటి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

తేనె

తేనె

చర్మంలో అదనపు నూనె ను తొలగించడంలో తేనె అద్భుతంగా సహాయపడుతుంది. మరియు చర్మం రంద్రాలను బ్లాక్ చేసి ముడుతలను నివారిస్తుంది . తేనెలో మాయిశ్చరైజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది చర్మాన్ని న్యూరిష్ చేస్తుంది.

*తేనె ను ముఖానికి పల్చగా పట్టించి 15నిముషాలు అలాగే ఉండి, తర్వాత మీ ముఖంను శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతి రోజూ రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది

English summary

Home Remedies for Oily Skin

For people with oily skin, it is necessary to shrink the pores and restore the pH balance of the skin. It helps add a layer of protection and create a base for the moisturizer to be applied. You don't have to spend a bomb on the store-kept toners that are laden with chemicals.
Desktop Bottom Promotion