For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మొటిమలు మాయంచేసి, కాంతివంత చర్మం మీ సొంతం చేస్తుంది

|

కోమలమైన ముఖారవిందంతో పాటు, ముఖంలో మెరుపు.. నునుపుదనం ఉంటే ఆ ముఖం మరింత అందంగా కనబడుతుంది. మరి అంత అదంగా కనబడాలంటే ఫేష్ క్లీనింగ్.. మాయిశ్చరైజింగ్ మాత్రమే సరిపోదు. వాటితో పాటు రోజు మార్చి రోజు ముఖాన్ని స్క్రబ్ చేస్తుండాలి. అప్పుడే ముఖం నైస్ గా తయారు అవుతుంది. స్ర్కబ్ కి ఉపయోగించే వస్తువులు బయట మార్కెట్లో రసాయనిక ఉత్పత్తులను తెచ్చి వాడటం కంటే ఇంట్లోని వస్తువులు తామే స్వయంగా ఉపయోగించడం వల్ల సహజ చర్మ తత్వాన్ని కలిగి ఎటువంటి ఇన్ఫెక్షన్ సోకకుండా ఉంటుంది.

ఇవి చర్మాన్ని రక్షణ కల్పించడమే కాకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. మీరు శరీర సంరక్షణలో ఓట్ మీల్ గురించి వినే ఉంటారు. ఓట్ మీల్ ను తరచూ తీసుకొంటే సన్నబడుతారు, పొట్ట తగ్గించడంలో ఇది ఒక మంచి ఆహారం అని. ఈ ఓట్ మీల్ శరీర సౌష్టవానికి మాత్రమే కాదు... చర్మ సౌందర్యానికి బాగా పనిచేసి ముఖానికి మంచి రంగును... రూపునును అందిస్తుంది.

Oatmeal Face Scrubs For Acne

ఓట్ మీల్ - హనీ ఫేస్ స్క్రబ్: రెండు చెంచాల ఓట్ మీల్ తీసుకొని అందులో ఒక చెంచా తేనె కలిపి బాగా మిక్స్ చేయాలి. ఈ అద్భుతమైన నేచురల్ ఫేస్ స్ర్కబ్ ను ముఖానికి అప్లై చేసి పదిహేను నిముషాల తర్వాత ముఖాన్ని తడిచేసి క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ లా రుద్ది చల్లటి నీటితో శుభ్రపరచుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మ రంద్రాలు తెరచుకొనేలా చేసి, శుభ్రపరచడమే కాకుండా, చర్మం మెరిసేలా చేస్తుంది.

ఓట్ మీల్ - నిమ్మరసం: మిక్సింగ్ బౌల్ లో కొంత ఓట్ మీల్ తీసుకొని అందులో రెండు చెంచాల నిమ్మరసం కలిపి, కొద్దిసేపు నానబెట్టాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట తర్వాత బాగా స్ర్ర్కబ్ చేసి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసేసుకోవాలి. ఓట్ మీల్ నిమ్మరసం రెండు మిక్స్ చేయడం వల్ల చర్మాని షైనింగ్ వచ్చు గ్లాసీగా మెరుస్తుంటుంది.

ఓట్ మీల్- ఆలివ్ ఆయిల్: ఓట్ మీల్ -ఆలివ్ ఆయిల్ అద్భుతమైనటువంటి కాంబినేషన్. ఆలివ్ ఆయిల్ వృద్ధాప్య లక్షణాలు పోగొట్టే లక్షణాలు కలిగిటుంటుంది. అలాగే సూర్య రశ్మిని నుండి కాపాడుతుంది. కాబట్టి యవ్వనంతో కూడిన చర్మ సౌందర్యం మీ సొంత కావాలంటే ఈ హోం మేడ్ ఫేషియల్ స్క్రబ్ ను ఉపయోగించాలి.

ఓట్ మీల్- టమోటో: ఓట్ మీల్ స్క్రబ్ ను టమోటో జ్యూస్ తో మీ ముఖానికి అప్లై చేయండి. టమోటోలో విటమిన్ సి అధికంగా ఉండి యాంటీఆక్సిడెంట్ గా పనిచేసి ముఖంలోని మొటిమలు, నల్ల మచ్చలను తొలగిస్తుంది. ఈ కాంబినేషన్ వారంలో రెండు మూడు సార్లు ఉపయోగించవచ్చు. ఫేషియల్ స్ర్కబ్ లో ఓట్ మీల్ ఉపయోగించడం వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతే కాదు చర్మం కాంతివంతం చేసి కొంత రంగు కూడా మారుతుంది.

ఓట్ మీల్- కీరదోస: ఓట్ మీల్ - కీర దోస కాంబినేషన్ రెండూ కూడా బ్యూటీ ప్రొడక్ట్స్ లో విరివిగా ఉపయోగిస్తుంటారు. ఇవి చర్మాన్ని శుభ్రపరచుటలో కీలక పాత్రను పోషిస్తాయి. ఓట్ మీల్ ను కీరదోసకాయ పేస్ట్ లో నానబెట్టి తర్వాత ముఖానికి అప్లై చేసి ఇరవై నిముషాల తర్వాత శుభ్రం చేయడం వల్లం ముఖం ఫ్రెష్ గా కనబడుతుంది. ఈ ఫేషియల్ స్ర్కబ్ ను వారానికి ఒక్కసారి వేసుకొంటే చాలు ముఖంలో డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించి కాంతివంతం చేస్తుంది. కాబట్టి ఓట్ మీల్స్ తో ఇతర కాంబినేషల్స్ ఉపయోగించి చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోండి..

English summary

Oatmeal Face Scrubs For Acne


 Acne is a severe skin problem which makes the skin look terrible and red. There are many natural skin remedies for getting rid of acne. One such homemade remedy is usin an oatmeal face mask or oatmeal face scrub.
Story first published: Tuesday, April 15, 2014, 10:30 [IST]
Desktop Bottom Promotion