For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టాటూ వేయించుకుంటున్నారా? ఇదిగో స్కిన్ కేర్ టిప్స్

|

టాటూస్‌! ఆధునిక అలంకరణలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన ఫ్యాషన్‌. బ్రాండెడ్‌ దుస్తులు, గాగుల్స్‌, పలురకాల హెయిర్‌ స్టయిల్స్‌, చెవిపోగులు, బ్రాస్‌లెట్‌...ఈ వరుసలో యువకుల అలంకరణలో టాటూలు వచ్చి చేరాయి. తెల్లని మెరిసే చర్మం మీద రంగురంగుల టాటూ చూడటానికి చాలా అందంగా కనబడుతుంది. ఇక అమ్మాయిలు కూడా నడుము, చేతులు, ఛాతీ ఇలా శరీరంలోని వివిధ భాగాలమీద టాటూలు వేయించుకుని తమ ప్రత్యేకతను, అభిరుచిని చాటుకుంటున్నారు. ఇది వరకు చేతిమీద మాత్రమే పండే గోరింట ఇప్పుడు ఒళ్లంతా పండుతోంది. యువతరంలో అత్యంత ఇమేజ్‌ తెచ్చుకుని తన హవా చూపిస్తున్న టాటూ వేసుకొన్నప్పుడు బాగానే ఉంటుంది.

కానీ, టాటూ వేయించుకొన్న తర్వాత సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే చర్మ పిగ్మేంటేషన్ కు గురి అవుతుంది. చర్మం ఇరిటేషన్ కు గురిఅవుతుంది, డ్రైగా మారుతుంది, ఫ్లాకీగా మారుతుంది దాంతో చర్మం ఎర్రగా మారి, వాపు ఏర్పడుతుంది. కాబట్టి, టూటూ వేయించుకొన్న తర్వాత చర్మం ఈ సమస్యల నుండి రక్షించుకోవడానికి ఇక్కడ కొన్ని స్కిన్ కేర్ టిప్స్ ను అందించడం జరిగింది. మరియు హైజీనిక్ టాటూ పార్లర్స్ లో మాత్రమే టాటూను వేసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వండి. టూటూ వేయడానికి వారు ఉపయోగించే సూదులు ఎప్పుడూ కొత్తవాటినే ఎంపిక చేసుకోవాలి. మరియు మంచి క్వాలిటీ ఉన్న వాటిని ఎంపిక చేసుకోవాలి. టూటూ వేయించుకొన్నాక ఈ చిట్కాలను తప్పక పాటించాలి.

Skin Care Tips After A Tattoo

ఆయిట్మెంట్ ను ఉపయోగించాలి: మీ చర్మం మీద ఇంక్ పడుతానే జాగ్రత్తగా ఉండాలి. టటూ గాయంగా కూడా మారుతుంది . అందువల్ల. ఆర్టిస్ట్ టాటూ వేసిన తర్వాత ఆయిట్మెంట్ ను అప్లై చేయడం వల్ల చర్మం వాపు మరియు ఇన్ఫెక్షన్ నుండి రక్షించుకోవచ్చు. ఆయిట్మెంట్ టాటూ చుట్టూ చర్మంను శుభ్రం చేస్తుంది మరియు స్కిన్ ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది . టటూ వేయించుకొన్న తర్వాత మొదటి చేయాల్సిన పని ఇది

ఎండలో వెళ్ళినప్పుడు టటూ ప్రదేశంలో ఎండికు గురికాకుండా కవర్ చేయాల్సి ఉంటుందిం టాటూ వేసిన ప్రదేశంలో చర్మం మరింత సున్నితంగా మారుతుంది. అందువల్ల, సూర్యరశ్మికి చర్మాన్ని డైరెక్ట్ గా ఎక్స్ ఫోజ్ చేయకూడదు . కొన్ని సందర్భాల్లో ఇది పర్వాలేదు కానీ, చాలా జాగ్రత్తగా ఉండాలి . లేదా బయట వెళ్ళడానికి ముందు సన్ స్క్రీన్ లోషన్ లేదా జెల్ ను టాటూ వేసిన ప్రదేశంలో అప్లై చేయాలి.

మాయిశ్చరైజర్ : టటూ వేసిన ప్రదేశంలో చర్మం పీక్కుపోయినట్లు కనబడుతుంటుంది. అందువల్ల దీన్ని మాయిశ్చరైజ్ చేసి, ఎప్పుడూ హైడ్రేట్ చేయాలి. మంచి మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. రోజులు రెండు మూడు గంటలకొకసారి మాయిశ్చరైజర్ ను అప్లై చేస్తే, ఇన్ఫెక్షన్స్, వాపు, వంటివి త్వరగా తగ్గుతాయి. టాటూ వేయించుకొన్నా స్కిన్ కేర్ చాలా అవసరం.

స్ర్కబ్బింగ్ చేయకూడదు: టాటూ వేయించుకొన్నాక చర్మం మీద రుద్దకూడదు . స్ర్కబ్బింగ్ చేయకూడదు. స్ర్కబ్బింగ్ చేయడం వల్ల ఇంక్ చెరిగిపోవచ్చు . స్నానం చేసేప్పుడు, మన్నికైన సోపును ఉపయోగించాలి. మరియు మహిళలు టాటూ వేయించుకోవడానికి ముందే వాక్సింగ్ వంటివి చేయించుకోవాలి.

డాక్టర్ హెల్ప్: టాటూ వేయించుకొన్నా టాటూ వేసిన ప్రదేశం చుట్టూ చర్మం పొడిగా మరియు వాపు కలిగి ఉన్నట్లైతే, తప్పకుండా డాక్టర్ ను సంప్రదించాలి. గాయం అయితే, చర్మం పూర్తిగా డ్యామేజ్ అవుతుంది . కాబట్టి, ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా డాక్టర్ ను సంప్రదించడం మర్చిపోకండి.

English summary

Skin Care Tips After A Tattoo

Skin care after you get a tattoo is a concern for many people who get a new tattoo or are thinking of getting one. The pigment colour becomes faded if the skin is not taken proper care of. The skin might get irritated, dry, flaky and red because of the tattoo ink.
Story first published: Wednesday, March 12, 2014, 15:04 [IST]
Desktop Bottom Promotion